The highly anticipated film Kingdom, starring Vijay Deverakonda, finally hit theatres today (July 31). Directed by Gautham Tinnanuri, the film features Satyadev and Bhagyashri Borse in key roles. It was grandly produced under Sithara Entertainments and Fortune Four Cinemas, presented by Srikara Studios. Music is composed by rockstar Anirudh Ravichander. From the very first show, the film garnered positive talk. Set against a backdrop of brotherhood, Kingdom is being praised for delivering a visually rich and emotionally compelling experience. It is performing impressively at the box office and earning accolades from critics and audiences alike. To celebrate, the team held a success press meet.
Vijay Deverakonda said:
“I’m overwhelmed by the response to Kingdom. Right from the US premieres, we got great feedback. I’ve been getting calls all night—people emotionally saying, ‘Anna, we have a hit!’ This win is all because of your love and Lord Venkateswara’s blessings. I’m witnessing how much support I have from Telugu people. Fans prayed and celebrated for this film. I was nervous about releasing on a Thursday, but Naga Vamsi garu believed in the film, and that belief has paid off. The appreciation for my performance and the film is all thanks to our director Gautham. Also, my heartfelt thanks to NTR Anna for lending his voice to the teaser. I can't wait to celebrate this success with the audience — both in India and the US.”
Producer Suryadevara Naga Vamsi shared:
“The film is receiving the response we hoped for. Reviews are positive, and many are saying this is one of the most technically brilliant Telugu films in recent times — comparable to Hollywood standards. We didn’t just make a great film, but with media’s support, we were able to take it to the audience. The collections are exceptional, with many places already recovering over 50% on Day 1 itself. We’re grateful to everyone who made this a success.”
Satyadev expressed:
“I’m very happy about the love Kingdom is getting. It’s especially heartening to see my brother Vijay make such a strong comeback. His success feels like my own. He’s an inspiration to many self-made dreamers. Naga Vamsi garu is a daring producer who takes on risky projects. Gautham’s narration convinced me to do this film. Audiences are loving the brother sentiment and the performances. As Vamsi garu said, this is a Hollywood-level experience. Kingdom has energised me to do more quality films.”
Actor Venkatesh (from the film) said:
“This is my first success meet. I watched Kingdom with the audience, and the response to the film and to my role made me so happy. This is a movie that must be experienced in theatres. It has elements that will connect with all kinds of audiences.”
Actor Venkitesh said:
“This is my first success meet. I watched Kingdom with the audience, and the response to the film and to my role made me so happy. This is a movie that must be experienced in theatres. It has elements that will connect with all kinds of audiences.”
‘కింగ్‌డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.
ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి 'అన్నా మనం హిట్ కొట్టినం' అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్ ని కూడా త్వరలో కలుస్తాను. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు." అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. "మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదేననే మాటలు వినిపిస్తుండటం సంతోషంగా ఉంది. ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. అనిరుధ్, నవీన్ నూలి సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పని చేశారు. మేము మంచి కంటెంట్ ని అందించాము, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళడానికి మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు." అన్నారు.
నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. "కింగ్‌డమ్ కి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది. సినిమాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రంతో నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే. సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తి. అలాంటి విజయ్ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను రిస్క్ చేసి తీస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారి ధన్యవాదాలు. గౌతమ్ ఈ కథ చెప్పగానే.. ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అనుకున్నాను. బ్రదర్ సెంటిమెంట్ గురించి, ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ ల గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. వంశీ గారు అన్నట్టు.. ఈ సినిమా హాలీవుడ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. కింగ్‌డమ్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు అందిస్తాను." అన్నారు.
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. "ఇది నా మొదటి సక్సెస్ ప్రెస్ మీట్. ప్రేక్షకులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. ఈ సినిమాకి, ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.