pizza

Dulquer Salmaan about King of Kotha
‘కింగ్ ఆఫ్ కొత్త’ యూనిక్, మాసీవ్ గ్యాంగ్ స్టర్ డ్రామా.. ఆడియన్స్ కి బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చాలా పెద్ద స్కేల్ లో నిర్మించాం: హీరో దుల్కర్ సల్మాన్

You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2023
Hyderabad

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరో దుల్కర్ సల్మాన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమా టైటిలే చాలా వెరైటీగా అనిపిస్తుంది ?
కింగ్ ఆఫ్ కొత్త .. ఇందులో కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్ధం. అదొక ఫిక్షనల్ టౌన్. ఐతే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది (New) అనే అర్ధం వస్తుంది. అందుకే డబ్బింగ్ లో దానికి కొంచెం భిన్నమైన శబ్దం వచ్చేలా కోత అని చెప్పాం.

ఇది మీ మొదటి గ్యాంగ్ స్టార్ మూవీ కదా ?
ఇది వరకు నేను గ్యాంగ్ స్టార్ సినిమాలు చేయలేదు. స్కేల్ పరంగా ఇది బిగ్గెస్ట్ మూవీ. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్ .. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ఇలాంటి సినిమా చేయడం నాకు పూర్తిగా కొత్త.

ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
కథ నాకు చాలా నచ్చింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా. మంచి ఫ్రండ్ షిప్ కూడా వుంటుంది. ఇందులో ప్రతి పాత్ర కథ, కథనంను ప్రభావితం చేస్తుంది. నాకు హ్యూమన్ డ్రామా, సంఘర్షణ ఇష్టం. అది ఇందులో చక్కగా కుదిరింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. కథ రెండు పీరియడ్స్ లో వుంటుంది.

సీతారామం తర్వాత మీకు పూర్తిగా లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది కదా.. ఇలాంటి గ్యాంగ్ స్టార్ సినిమా చేయడం ఎలా అనిపించింది ?
నేను ఎక్కువగా లవర్ బాయ్ గా గుర్తుంటాను( నవ్వుతూ) నాకు నచ్చిన కథని చేస్తాను. ఐతే ఒకేరకం కథలు, పాత్రలు చేయాలని మాత్రం వుండదు. ప్రేక్షకులతో పాటు ఒక నటుడిగా నాకు నేను సర్ ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని వుంటుంది. అందులో నుంచి దీనికి షిఫ్ట్ అవ్వడం ఎక్సయిటింగా వుంది.

డబ్బింగ్ మీరే చెప్పారా ?
అవును.. తమిళ్ తెలుగు మలయాళం హిందీలో నేనే చెప్పాను. ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కూడా ( నవ్వుతూ)

డబ్బింగ్ అనుభావలు గురించి చెప్పండి?
నాకు భాషలు అంటే ఇష్టం. ప్రతి భాషకి ఒక సొగసు వుంటుంది. ప్రతి పదం, శబ్దం ఒక భావోద్వేగాన్నివ్యక్తపరుస్తుంది. ప్రతి భాష మాట్లాడటం కొంచెం ఇబ్బంది వుంటుందోమో కానీ డబ్బింగ్ లో ప్రతి లైన్ రాసుకొని దాని అర్ధం తెలుసుకొని సరైన శబ్దాన్ని వ్యక్తపరచడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. గన్స్ అండ్ గులాబ్ సిరిస్ ని ఐదు భాషల్లో చేశాం. ప్రతి భాష డబ్బింగ్ నేనే చెప్పాను. నటుడిగా నాకు దొరికిన అరుదైన అవకాశం ఇది. ఈ ప్రక్రియని చాలా ఆస్వాదిస్తాను.

గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇదివరకే చాలా వచ్చాయి కదా.. ఈ సినిమా ఎంత డిఫరెంట్ గా వుంటుంది ?
ఇది నా తరహా గ్యాంగ్ స్టర్ సినిమా. మంచి కథ, కథనం వుంటుంది. యునిక్ ఒరిజినల్ స్టొరీ. మంచి మ్యూజిక్, స్టార్ కాస్ట్ యాక్షన్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. గ్యాంగ్ స్టర్ కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో ప్రతి పాత్ర కథ ని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది.

ఇది మీకు డ్రీం ప్రాజెక్ట్ నా ?
ఈ సినిమా దర్శకుడు నాకు చైల్డ్ హుడ్ ఫ్రండ్. ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఫైనల్ గా ఈ కథ కుదిరింది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ ఈ ఒక్క సినిమా కోసం ఏడాది పాటుగా శ్రమించాం. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వచ్చి చూసే విధంగా ఈ సినిమాని భారీగా రూపొందించాం.

ఇందులో ఫుట్ బాల్ కి ప్రాధాన్యత ఉందా ?
ఇందులో ఫుట్ బాల్ సీక్వెన్స్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ద్రువ్ అనే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆ సన్నివేశాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. విజువల్ గా చాలా కొత్తగా వుంటాయి.

ఐశ్వర్య లక్ష్మీ గారి పాత్ర ఎలా వుంటుంది ?
ఐశ్వర్య లక్ష్మీ చాలా మంచి చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాధించుకున్నారు. తను చాలా ప్రతిభ వున్న నటి, ఇందులో తన పాత్ర కీలకంగా వుంటుంది. ఇందులో మంచి లవ్ ట్రాక్ వుంది. అది ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వుంటుంది.

టెక్నికల్ గా సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది ?
ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. కురుప్ చిత్రానికి పని చేసిన నిమేష్ రవి డీవోపీ గా చేశారు. జాక్స్ బిజోయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. పిరియడ్ సినిమా కావడంతో బ్రిలియంట్ ఆర్ట్ వర్క్ చేశాం. విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి. జీ స్టూడియోస్ మా పార్ట్నర్స్ గా చేశారు. అందరం కలసి బెస్ట్ సినిమా ఇవ్వాడానికి ప్రయత్నించాం.

సీతారామం తర్వాత తెలుగు సినిమాలు ఎక్కువగా చేయాలని అనిపించిందా ?
నేరుగా తెలుగులో సినిమాలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని ఆసక్తికరమైన కథలు కూడా వింటున్నాను.

మణిరత్నం, బాల్కి లాంటి సీనియర్ దర్శకులతో పని చేశారు.. కొత్త దర్శకులతో పని చేసినప్పుడు ఏమనిపిస్తుంది ?
నేను అందరి దర్శకులతో పని చేయడానికి ఎంజాయ్ చేస్తాను. కొన్నిసార్లు కొత్త డైరెక్టర్స్ చాలా విలక్షణమైన ఆలోచనలతో వస్తారు. వాళ్ళలో ఏదైనా చేయాలని తపన వుంటుంది. అనుభవం వున్న దర్శకులు వారి అనుభవంతో ఎన్నో విషయాలు నేర్పుతారు. ఐతే నేను ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన కథని ఎంపిక చేసుకోవడంపై దృష్టిపెడతాను. మెటిరియల్ బలంగా వుంటే దానితో ఒక మంచి సినిమానే వస్తుందని నమ్ముతాను.

మీరు నిర్మాణంలోకి వెళ్ళడానికి కారణం ఏమిటి ?
మలయాళంలో సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నా సినిమాలని నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి వుండేది. ఏవో కారణాల వలన కొందరు నిర్మాతలు అనుకున్న బడ్జెట్ ని సమకూర్చలేకపోవడం, సరిగ్గా విడుదల చేయలేకపోవడం జరిగేవి. దీని వలన ఎంతో కస్టపడి చేసిన సినిమాకి చాలా నష్టం జరిగేది. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యుషన్ లో వుండాలని వేఫేరర్ ఫిల్మ్స్ ని మొదలుపెట్టడం జరిగింది.

తెలుగులో కూడా నిర్మాణం చేస్తారా ?
ఇక్కడ మంచి నిర్మాతలు వున్నారు. ఇక్కడ అవసరం ఉండదనే భావిస్తాను. అయితే సినిమాని బట్టి, దానికి అవసరమైనప్పుడు నిర్మాణంలో సపోర్ట్ కావాలంటే మాత్రం చేస్తాను. ‘కాంత’ నేను, రానా కలసి చేస్తున్నాం. సినిమా పట్ల నాకు తనకి ఒకేరకమైన ఆలోచనలు వుంటాయి. లక్కీ భాస్కర్ సితార ఎంటర్ టైమెంట్స్ నిర్మిస్తున్నారు. వారు చాలా మంచి ప్రోడ్యుసర్స్. ఇక వైజయంతి మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దత్ గారు , స్వప్న గారు నాకంటే గొప్పగా ఆలోచిస్తారు. నిర్మాతగా నేను వాళ్ళ నుంచి, మిగతా పరిశ్రమల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మలయాళంలో వాటిని అనుసరిస్తున్నాను.

ప్రాజెక్ట్ కె లో చేస్తున్నారా ?
‘ప్రాజెక్ట్ కె’ పై ప్రశ్నలని ఎవైడ్ చేస్తున్నాను( నవ్వుతూ). వారే చెప్పాలి. అయితే ఆ సినిమా.. ఇండియన్ సినిమా ల్యాండ్ స్కేప్ ని మార్చేస్తుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు విన్నాను చూశాను కానీ అలాంటి సినిమాని ఎవరూ తీయలేదు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved