“I was bedridden for four months after getting injured during a fight scene in ‘Junior’.” – Kireeti
'జూనియర్' సినిమా ఫైట్ సీన్ లో గాయపడి నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. -కిరీటి.
As part of promotions for the film Junior, actor Kireeti gave an interview to Idlebrain’s Jeevi. Throughout the interview, he responded humbly to all questions. He said that although his family, the Rajkumar family of Karnataka, is widely known and respected, he has always been inspired by how grounded they remain—and he learned to be humble by watching them.
Kireeti revealed that he met with an accident while shooting a fight sequence, which left him bedridden for four months, leading to a one-year delay in the film’s release. He also mentioned that compared to him, Sai Dharam Tej’s willpower is incredible, and that’s what helped Tej recover quickly from his accident.
He expressed that he has been a massive fan of Jr. NTR since childhood—especially of his songs even more than his movies. During the shoot, music director Devi Sri Prasad motivated and encouraged him constantly.
Even when facing negative trolls, Kireeti said he remains unaffected, choosing to look at everything positively. Regardless of one's family background, he believes one must work hard to survive in the film industry, and he is confident he will earn the love of audiences.
He also shared that Sreeleela performed her role in Junior without any ropes for support during stunts, and that’s why they released the BTS video of "Viral Vayyari" to showcase her dedication. He said he attended workshops in the UK to learn screen acting.
Although he comes from a political family, Kireeti stated he has no interest in joining politics. He speaks Kannada with his father and Telugu with his mother. He also dubbed his own voice in the Telugu version of Junior.
Kireeti said he loved Pushpa, and his favorite song is “Naire Naire” from Andhrawala. Among Jr. NTR’s films, Temper is his top pick, and he considers the courtroom climax scene in Temper a benchmark performance, saying no actor has matched NTR’s intensity in that scene. He hasn’t had a chance to meet Jr. NTR in person yet.
He concluded by saying that Genelia’s comeback in Junior will be outstanding.
'జూనియర్' సినిమా ఫైట్ సీన్ లో గాయపడి నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. -కిరీటి.
'జూనియర్' సినిమాకు ప్రమోషన్ లో భాగంగా ఐడిల్ బ్రెయిన్ జీవికి ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో కిరీటి. జీవి అడిగిన ప్రశ్నలకు ఇంటర్వ్యూ మొత్తం హంబుల్ గా మాట్లాడుతూనే జవాబులిచ్చారు. కర్ణాటకలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజ్ కుమార్ గారి కుటుంబంలో అందరూ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారని, వాళ్ళను చూసే హంబుల్ గా ఉండటం నేర్చుకున్నానన్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఫైట్ సీన్ చేసేటప్పుడు తనకు యాక్సిడెంట్ జరిగిందని, నాలుగు నెలలు బెడ్ మీదనే ఉండాల్సి వచ్చిందని, ఆ కారణంగానే ఏడాది ఆలస్యం అయిందన్నారు. తనతో పోల్చుకుంటే సాయి ధరమ్ తేజ్ గారి విల్ పవర్ గొప్పదని, అందువల్లనే వేగంగా కోలుకోగలిగారన్నారు. తనకు చిన్నప్పటి నుండీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానమని, ఆయన సినిమాల కంటే ఆయన పాటలకే తనొక పెద్ద ఫ్యాన్ అన్నారు. షూటింగ్ టైం లో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా ఎంకరేజ్ చేసేవారని, ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇచ్చేవారన్నారు.
నెగటివ్ ట్రోల్స్ ఎదురైనా ఇబ్బంది పడనున్నారు. అన్నిటినీ సానుకూల దృక్పథంతోనే చూస్తానన్నారు. నేపధ్యం ఎంత పెద్ద కుటుంబం అయినా సరే కష్టపడకపోతే ఇండస్ట్రీలో నిలబడటం కష్టమన్నారు. ప్రేక్షకుల మన్ననలు పొందగలనన్నారు. ఈ సినిమాలో శ్రీ లీల రోప్ లేకుండానే నటించారన్నారు. ఆ విషయం అందరికీ తెలియడం కోసమే వైరల్ వయ్యారి BTS వీడియో రిలీజ్ చేశామన్నారు. యూకే లో స్క్రీన్ యాక్టింగ్ నేర్చుకోవడం కోసం వర్క్ షాప్ లకు వెళ్ళేవాడినన్నారు. తనది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబమైనా, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదన్నారు. ఇంట్లో నాన్నతో కన్నడ, అమ్మతో తెలుగు మాట్లాడతానన్నారు. 'జూనియర్' సినిమాకు తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పానన్నారు. పుష్ప సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. 'ఆంధ్రావాలా' సినిమాలో 'నాయిరే నాయిరే' పాట తనకు బాగా ఇష్టమన్నారు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో 'టెంపర్' సినిమా తన పేవరైట్ అని, ఆ సినిమా క్లైమాక్స్ కోర్ట్ సీన్ అన్నది ఒక బెంచ్ మార్క్ అని, అలాంటి సీన్స్ లో ఎన్టీఆర్ గారిని మించిన నటుడిని ఇంతవరకూ చూడలేదన్నారు. ఇప్పటి వరకూ ఆయన్ను కలిసే అవకాశం రాలేదన్నారు. 'జూనియర్' సినిమాతో జెనీలియా గారి కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఉంటుందన్నారు.