Chiranjeevi appreciates Kishkindhapuri
కిష్కింధపురి సినిమా చాలా బావుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ కిష్కింధపురి: మెగాస్టార్ చిరంజీవి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి' చిత్రాన్ని అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోలో తన రివ్యూని షేర్ చేశారు.
నమస్తే. నా రాబోయే చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' పండక్కి వస్తున్నారు నిర్మాత సాహూ గారపాటి గారి మరో చిత్రం కిష్కింధపురి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని అనిపించింది. ఆ సినిమాలో పనిచేసిన అందరికీ అభినందనలు.
సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ కిష్కింధపురిలో హారర్ తో పాటు మంచి సైకలాజికల్ పాయింట్ కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని చెప్పడం, మనిషికున్న బాధలు కష్టాలు పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే ప్రమాదాలు, పరిణామాలు చాలా సమర్థవంతంగా చిత్రీకరించారు డైరెక్టర్ కౌశిక్.
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తన పనితనం చాలా బాగా చూపించారు.
టోటల్ గా కిష్కింధపురి లాంటి మంచి సినిమాని అందించిన టేస్ట్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ కిష్కింధపురి.