Varun Tej, Daksha Nagarkar’s Special Song Raasa Gummadi From Korean Kanakaraju On July 19
Korean Kanakaraju 2nd song on 19
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ దక్షా నాగర్కర్- అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ రాసగుమ్మడి జూలై 19న రిలీజ్
Mega Prince Varun Tej is all set to bring a refreshing dose of fun with Korean Kanakaraju, an out-and-out horror-comedy helmed by Merlapaka Gandhi. Backed by UV Creations in collaboration with First Frame Entertainment, the film is progressing rapidly through its final post-production phase. The promotional campaign has already struck the right chord, with the title glimpse and teaser sparking excitement through its unique mix of spooky thrills, hilarious moments, and a quirky Korean backdrop. The first single Kamsahamnida also turned into a massive hit.
After taking audiences on a musical trip to Korea with its first single, Korean Kanakaraju is now switching gears to celebrate its desi roots. The makers have unveiled a striking new poster for the film's second single, Raasa Gummadi, featuring Varun Tej and Daksha Nagarkar. The song is set to be released on July 19.
The song poster of the special dance number captures Varun Tej in an electrifying avatar, dressed in a yellow traditional outfit and exuding effortless charisma. Sporting trendy sunglasses and an infectious smile, he appears completely immersed in the celebratory spirit, suggesting that the song is packed with high-energy dance moments.
Stealing equal attention is Daksha Nagarkar, who dazzles in a gorgeous red ethnic ensemble adorned with elegant jewelry. Her lively expressions and sparkling chemistry with Varun Tej instantly light up the frame, giving the poster a festive charm that perfectly complements its rustic backdrop.
Composed by S Thaman, Raasa Gummadi promises to be a pulsating folk celebration loaded with Rayalaseema flavor, infectious beats, and mass appeal. The visual itself hints at a colorful dance anthem that is likely to strike a chord with audiences.
Ritika Naik stars as the female lead, with Satya playing a key character that is expected to add significant entertainment value. The film brings together a strong technical crew, led by music composer S Thaman, while cinematography is handled by Manojh Reddy Katasani. Satyaa G is the editor.
Korean Kanakaraju is slated for its theatrical release on August 7th.
Writer & Director: Merlapaka Gandhi
Producers: UV Creations, First Frame Entertainment
Music: S Thaman
DOP: Manojh Reddy Katasani
Editor: Satyaa G
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ 'కంసంనిద', టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'రాసగుమ్మడి' ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదలైన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది.
కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోంది.
పోస్టర్‌లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా కానుంది.
ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.
సరికొత్త కాన్సెప్ట్, ఆకట్టుకునే విజువల్స్, కమర్షియల్ ట్రీట్‌తో ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
ఆర్ట్: ఎ పన్నీర్‌సెల్వం