Lokah, already celebrated as a blockbuster in Malayalam, has now stormed into the Telugu market with remarkable success. Released grandly by Naga Vamsi under Sithara Entertainments, the film is drawing huge crowds, proving that content-rich cinema has no language barriers.
The superhero drama, headlined by Kalyani Priyadarshan, has received rave reviews from critics, praising its mythological depth, gripping action, and emotional storytelling. Telugu audiences have echoed the same, with positive word of mouth further boosting advance bookings.
Currently, the film is trending every hour on BookMyShow, reflecting the massive craze. With weekend bookings already looking strong, trade circles expect Kotha Lokah to emerge as one of the biggest non-star-driven blockbusters in recent times for Telugu cinema.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ‘కొత్త లోక’తో ఘన విజయం!
మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లోక, ఇప్పుడు తెలుగు మార్కెట్‌లోనూ అద్భుత విజయం సాధిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ భారీగా విడుదల చేసిన ఈ చిత్రం, కథతో కూడిన సినిమాలకు భాష అనేదే అడ్డు కాదు అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
సూపర్‌హీరో డ్రామా అయిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, దీనికి మైతాలజికల్ డెప్త్, గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ స్టోరీటెల్లింగ్‌కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అదే విధంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు. పాజిటివ్ మౌత్ టాక్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం బుక్‌మైషోలో ప్రతి గంటకూ ట్రెండ్ అవుతోంది, ఇది సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికే శక్తివంతంగా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, కొత్త లోక ఇటీవల కాలంలో స్టార్ వాల్యూ లేకుండానే పెద్ద విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలవనుంది.