“Watching Kottapallilo Okappudu along with all of you was a special experience. Your response brought me immense joy. I sincerely request everyone to watch the film in theaters.” – Hero Rana Daggubati
'కొత్తపల్లిలో ఒకప్పుడు' మీ అందరి సమక్షంలో చూడడం స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. మీ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమాను చూడాలని కోరుకుంటున్నాను: హీరో రానా దగ్గుబాటి
Rural comedy “Kottapallilo Okappudu” is presented by Rana Daggubati’s Spirit Media. The film is directed by actress-producer Praveena Paruchuri, who previously worked on critically acclaimed films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. It is produced under Paruchuri Vijaya Praveena Arts, featuring Manoj Chandra and Monica in lead roles. The first look, teaser, and trailer received a positive response. The film is set for release on July 18. Ahead of the release, the makers hosted a pre-release press meet followed by a press premiere, which received tremendous response.
Rana Daggubati said at the event:
“Hello everyone! I hope you all liked Kottapallilo Okappudu. When a film like this comes out, we think about how to promote it and reach people. Showing the film during the pre-release event rarely happens, but we did it. When I first saw the movie, every character felt alive—like someone we know from our surroundings. Director Praveena is a cardiologist, and she made this film while practicing medicine. Manoj also has a job, yet they made this movie breaking the usual notion that you have to leave everything behind to make a film. Thank you, Praveena, for such a wonderful movie. I hope you continue making many more. Manoj looks amazing on screen and is a fine actor. When there’s a good movie and visionary filmmakers, I’ll always stand by them. Now, it’s your responsibility to take this movie to the audience. Thank you all so much. Kottapallilo Okappudu releases on July 18—please watch and support it.”
Director Praveena Paruchuri said:
“Hello everyone! Watching the film with you all is a special occasion. If you like it, please spread the word to your friends and family. This is my third film as a producer and first as a director. You all supported C/o Kancharapalem, which gave me the courage to make this movie. It was Rana Garu who helped take Kancharapalem to the audience. If big production houses like his support filmmakers like us, it’s important for audiences to do their part by watching the film in theaters. Many told me they missed Kancharapalem in theaters—don’t miss this one! I made this movie with faith in you. Please support us. Thanks to the entire cast and crew, including Ramakrishna Appanna Reddy, for bringing these characters to life. Special thanks to Rana Garu for his amazing support—I hope to collaborate on more projects with him.”
Hero Manoj Chandra shared:
“Hello everyone! The credit for shaping Ramakrishna’s character so beautifully goes to director Praveena Garu. Our entire team worked hard on this movie. Thank you, Rana Garu, for recognizing our efforts. Today proves once again that when you make an honest film with dedication, audiences will always embrace it. Your response is overwhelming. Thank you so much for accepting me. Love you all.”
Actor Ravindra Vijay said:
“Hello! Thank you to Praveena for introducing me to Telugu cinema and giving me such a great role. Watching the movie for the first time, I felt some magic on screen. I believe you all liked it—please tell your friends and family to watch it in theaters.”
Actor Banerjee added:
“Hello everyone! I just watched the movie, and it feels so fresh. I’ve done many films, but here, even with newcomers, I felt refreshed on screen. That credit goes to the director. Please come to theaters and enjoy it.”
The pre-release event saw full participation from the entire movie unit.
'కొత్తపల్లిలో ఒకప్పుడు' మీ అందరి సమక్షంలో చూడడం స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. మీ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమాను చూడాలని కోరుకుంటున్నాను: హీరో రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన మేకర్స్ ప్రెస్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఇలా ప్రమోట్ చేయాలి? ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమాని చూపించడం బహుశా కొన్నిసార్లు జరుగుతుంది. ఈ సినిమా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పాత్రలన్నీ చాలా సజీవంగా కనిపించాయి. అన్ని మనకి తెలిసిన పాత్రలే మన చుట్టూ ఉన్న పాత్రలే అనిపించాయి. డైరెక్టర్ ప్రవీణ కార్డియాలజిస్ట్. తను ప్రాక్టీస్ చేస్తూనే ఈ సినిమా తీశారు. అలాగే మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి అనే ఒక ఆలోచనకు భిన్నంగా వాళ్లు ఈ సినిమాని తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ప్రవీణకి థాంక్యూ. తను ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మనోజ్ మస్త్ హీరో లాగా ఉన్నాడు. తనని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా నచ్చాడు. మంచి యాక్టర్. ఒక మంచి సినిమా, మంచి విజన్ తో ఉన్న ఫిలిం మేకర్స్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఈ సినిమాని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది బాధ్యత మీదే. అందరికీ థాంక్యూ సో మచ్. సినిమా జూలై 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూసి సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు,.
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీతో ఈ సినిమా చూడడం చాలా స్పెషల్ అకేషన్. మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. నిర్మాతగా ఇది నా మూడో సినిమా. డైరెక్టర్ గా నా మొదటి సినిమా. మీరు కేరాఫ్ కంచరపాలెం సినిమాని ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా తీగలిగాను. రానా గారు వల్లే కేరాఫ్ కంచరపాలెం సినిమా జనాల్లోకి వెళ్ళింది. రానాగారి లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ నాలాంటి ఫిలిం మేకర్స్ చేస్తున్న సినిమాల్ని సపోర్ట్ చేయాలంటే ఆడియన్స్ వచ్చి తప్పకుండా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి. కంచరపాలెం సినిమాని చాలామంది థియేటర్స్ లో మిస్సయ్యమని చెప్పారు. ఈ సినిమా మాత్రం థియేటర్లో మిస్ అవ్వొద్దు. తప్పకుండా చూడండి. మీ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాను. మా అందరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. రామకృష్ణ అప్పన్న రెడ్డి గారు ఇలా పాత్రలన్నీ చాలా అద్భుతంగా తెరపైకి వచ్చాయి. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారా రానా గారికి థాంక్యూ. వారితో కలిసి మరిన్ని సినిమాలకి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రానా గారికి థాంక్యూ సో మచ్'అన్నారు.
హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో చూస్తున్న రామకృష్ణ మొదట ఇలా లేడు. రామకృష్ణుని అంత అద్భుతంగా తయారుచేసిన క్రెడిట్ డైరెక్టర్ ప్రవీణ గారికి దక్కుతుంది. సినిమా కోసం టీం అందరూ కష్టపడ్డారు. మా కష్టాన్ని గుర్తించిన రానా గారికి ధన్యవాదాలు.కష్టపడి నిజాయితీగా ఒక సినిమా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఆదరిస్తారని ఈరోజు మరోసారి నిరూపించారు. మీ రెస్పాన్స్ అదిరిపోయింది. నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. లవ్ యు ఆల్'అన్నారు
యాక్టర్ రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన ప్రవీణకి థాంక్యూ. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. మొదటిసారి ఈ సినిమా చూశాను స్క్రీన్ మీద ఏదో మ్యాజిక్ జరిగింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి చెప్పండి. అందరూ సినిమాని థియేటర్స్ లో చూడండి.'అన్నారు
యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నేను ఇవాళ సినిమా చూశాను, చాలా ఫ్రెష్ గా ఉంది. నేను చాలా సినిమాలు చేశాను. కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇందులో ఉన్న కొత్త వారిలాగే చాలా ఫ్రెష్ గా కనిపించడం జరిగింది. ఈ క్రెడిట్ డైరెక్టర్ కి దక్కుతుంది. థియేటర్స్ కి వచ్చి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అందరు పాల్గొన్నారు.
ప్రవీణ అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్. అయినా కూడా ఇక్కడికి వచ్చి సినిమా తీశారు
మనోజ్ LA లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనోజ్ తప్పు చేస్తున్న బాగుంటుంది.