pizza

Successful Hero Kiran Abbavaram’s K-Ramp Unveils Magical Love Melody ‘Kalale Kalale’, Film Releasing This Diwali on October 18
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ మెలొడీ సాంగ్ 'కలలే కలలే' రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

You are at idlebrain.com > news today >

9 September 2025
Hyderabad

Kiran Abbavaram, one of Tollywood’s successful young heroes, is coming with his new film K-Ramp. The movie is being jointly produced by noted production houses Hasya Movies and Rudransh Celluloid, with successful producers Rajesh Danda and Shiva Bommakku backing the project. Yukti Thareja plays the female lead, while Jains Nani directs. The film is set for a grand theatrical release this Diwali, on October 18.

Today, the team unveiled the magical love song ‘Kalale Kalale’ from the film. Composed by Chaitan Bharadwaj with his signature classy touch, beautifully sung by Kapil Kapilan, and written with catchy lyrics by Bhaskarabhatla, the song flows with a heartfelt love vibe.

Cast: Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore & others.

Technical Crew:

Production Designer: Brahma Kadali
Action: Prithvi
Editor: Chota K Prasad
DOP: Satish Reddy Masam
Music: Chaitan Bharadwaj
PRO: GSK Media (Suresh – Srinivas), Vamsi Shekhar
Co-Producer: Balaji Gutta
Producers: Rajesh Danda & Shiva Bommakku
Writer & Director: Jains Nani

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ మెలొడీ సాంగ్ 'కలలే కలలే' రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ సాంగ్ 'కలలే కలలే' రిలీజ్ చేశారు. ఈ పాటను చైతన్య భరద్వాజ్ క్లాసీ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కపిల్ కపిలన్ అందంగా పాడారు, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. 'కలలే కలలే' పాట ఎలా ఉందో చూస్తే - ' కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే, నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే, నీ చుట్టు చుట్టు తిరిగేలా చేసిందే, నాతోటి ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటి జట్టే కడుతోందే కడుతోందే, అందాల మాయ కళ్లే కాదా, ఊసులేవో నాలో పూసగుచ్చేలా నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో ఇబ్బందే, యే నీ గుండే నాలోనే అందంగా దాక్కుందే, నాక్కొంచెం చోటైనా లేకుందే..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి
యాక్షన్ - పృథ్వీ
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
డీవోపీ - సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ - రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం - జైన్స్ నాని


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved