pizza

“With K-Ramp, I’ve delivered another Diwali blockbuster. The audience is thoroughly enjoying the film - shows, screens, and collections are all increasing.” - Hero Kiran Abbavaram at the success meet.
"K-ర్యాంప్"తో ఈ దీపావళికి మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, షో బై షో స్క్రీన్స్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి - సక్సెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం

You are at idlebrain.com > news today >

19 October 2025
Hyderabad

Repeating his Diwali success sentiment, young hero Kiran Abbavaram has struck gold again with K-Ramp. The film, which released to an enthusiastic response from all sections of the audience, is running successfully across theatres. To celebrate the film’s grand success, the team held a success meet in Hyderabad.

Speaking at the event, Kiran Abbavaram said, “This Diwali, the audience gave me another blockbuster. Since morning, we’ve been waiting to hear how people are reacting, and the response has exceeded our expectations. Many from the press called after watching the early shows saying they laughed a lot, this is the first time I’ve received so many calls after a morning show. Families are coming to theatres, collections are growing show by show, and screens are being added. Getting such numbers despite tough competition is not a small thing. Our goal was to deliver solid entertainment with a festive vibe and a small message, and we’re thrilled the audience has embraced it. Thank you for making K-Ramp a success.”

Producer Rajesh Danda added, “We’ve always said K-Ramp was made purely to entertain. It’s not a film meant for logical analysis. While some reviewers gave us low ratings, I’m not upset that’s their personal opinion. But it’s disappointing to see bias from a few who deliberately delay reviews or ratings when it’s a small producer’s film. The reality is clear when you look at the box office in Hyderabad, many shows are running full, and the film is performing well in Vizag and East too. Collections are rising show by show, and the audience’s love speaks louder than any review. Our team is truly happy.”

Director Jains Nani said, “We made K-Ramp as a fun-filled entertainer with festival energy, centering around the hero and heroine’s characters. Like our producer mentioned, some reviews were disheartening, especially for a debut director like me. But when I watched the film at Sri Ramulu theatre, the audience laughed throughout the first half and connected emotionally in the second half. People are putting their phones aside and enjoying the film, that’s the best validation. Kiran garu carried the film on his shoulders, and that’s why we’re here celebrating today. I’m thankful to the audience and media for their support.”

Heroine Yukti Thareja said, “A huge thanks to the audience for all the love. I watched the film in theatres and the response has been amazing. People are messaging me on social media congratulating me. I’m grateful for this success and everyone’s support.”

Actor VK Naresh shared, “Thank you all for making K-Ramp a super hit. This is Kiran Abbavaram’s ramp of success! My character is getting hilarious responses. It’s a complete family entertainer with relatable characters and dialogues inspired by real-life people, all meant to bring laughter. I also worked in Sammohanam with this same production house, and now I’m thrilled my character in K-Ramp is being appreciated. When Jains Nani narrated the story, I immediately knew it would be a hit. He’s a next-level director in the making.”

"K-ర్యాంప్"తో ఈ దీపావళికి మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, షో బై షో స్క్రీన్స్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి - సక్సెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం

దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. "K-ర్యాంప్" మూవీ విజయవంతమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - ఈ దీపావళికి నాకు మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఊర్లు, టౌన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రెస్ షో చూసిన మీడియా మిత్రులు కాల్ చేసి మేము బాగా నవ్వుకున్నాం అని చెబుతున్నారు. మార్నింగ్ షో చూసిన మీడియా నుంచి ఇన్ని కాల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడున్న కాంపిటేషన్ లో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. పండక్కి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలి, చిన్న మెసేజ్ ఇవ్వాలి, ఒక వైబ్ మూవీలో ఉండాలని చేసిన ప్రయత్నమిది. సినిమా రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్పాం. "K-ర్యాంప్"తో మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ - మా "K-ర్యాంప్" సినిమాను కేవలం నవ్వించడం కోసమే తీశామని మేము చెబుతూ వస్తున్నాం. ఇలాంటి సినిమాలో లాజిక్స్ వెతకకూడదు. మీడియా వాళ్లు మా సినిమాకు రేటింగ్స్ తక్కువగా ఇచ్చారు. అయితే నేనేం బాధపడటం లేదు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం. కానీ కొందరు కావాలనే మా మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు. ట్విట్టర్ రివ్యూస్ లో ఫుల్ రివ్యూ కు మధ్యలో గంటలు గంటలు గ్యాప్ ఇస్తారు. రేటింగ్ సాయంత్రం వరకు ఇస్తారు. కానీ మా సినిమాకు మాత్రం ఏం అన్నా పడతారు, చిన్న ప్రొడ్యూసర్ కదా అనుకున్నట్లు ఉన్నారు. కానీ ఈ దీపావళికి రిలీజైన మూవీస్ లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి నిజాలు తెలుసుకోవాలి. హైదరాబాద్ లో చాలా థియేటర్స్ లో షోస్ ఫుల్ అవుతున్నాయి. అలాగే వైజాగ్, ఈస్ట్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. షో, షో కు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆ కలెక్షన్స్ అన్నీ నేనే చెప్పుకుంటే డప్పు కొట్టినట్లు ఉంటుంది. మా "K-ర్యాంప్" సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా టీమ్ అంా హ్యాపీగా ఉన్నాం. అన్నారు.

డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ - హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ను హైలైట్ గా పెట్టుకుని మేము ఫెస్టివల్ కు ఎంజాయ్ చేసే మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న మూవీ చేశాం. ఇందాక మా ప్రొడ్యూసర్ అన్నట్లు రివ్యూస్ లో వచ్చిన విశ్లేషణ చూసి నేనూ బాధపడ్డాను. ఒక కొత్త దర్శకుడిగా నిరాశచెందా. శ్రీరాములు థియేటర్ లో సినిమా చూస్తుంటే ప్రేక్షకులు ఫస్టాఫ్ ను బాగా ఎంజాయ్ చేశారు. సెకండాఫ్ లో సెంటిమెంట్ కు కనెక్ట్ అవుతున్నారు. ఫోన్స్ పక్కనపెట్టి సినిమా చూస్తున్నారు. ప్రేక్షకుల దగ్గర నుంచి మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు రివ్యూస్ కు సంబంధం లేదు. మీడియా మిత్రులు కూడా చాలా మంది సినిమా చూస్తూ నవ్వుకున్నామని చెప్పారు. కిరణ్ గారు సినిమాను భుజాల మీద వేసుకుని మోశారు కాబట్టి ఈ రోజు ఇలాంటి మంచి రిజల్ట్ వచ్చింది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ - మా మూవీపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్. నేను థియేటర్ కు వెళ్లి సినిమా చూశాను. మూవీ చూస్తున్న ఆడియెన్స్ ను చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా ద్వారా నాకు కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్ లు పంపుతున్నారు. ఇంతమంచి సక్సెస్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ - కె ర్యాంప్ మూవీకి మీరంతా సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్. నా క్యారెక్టర్ కు హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. మనం సొసైటీలో చూస్తున్న కొందరిని రిఫ్లెక్ట్ చేసేలా క్యారెక్టర్స్, డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ నవ్వించడం కోసం చేసిన ప్రయత్నమే. సామజవరగమన సినిమాను ఇదే ప్రొడక్షన్ లో చేశాను. ఇప్పుడు కె ర్యాంప్ మూవీలో నా క్యారెక్టర్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. దర్శకుడు జైన్స్ నాని కథ చెప్పినప్పుడే ఈ సినిమా హిట్ అని అన్నాను. అతను నెక్ట్స్ లెవెల్ డైరెక్టర్ అవుతాడని చెప్పాను. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved