Vijay Deverakonda and Samantha starrer 'Kushi' is getting ready to do magic on the big screen. The film is produced by Naveen Yerneni and Y Ravi Shankar under Mythri Movie makera banner. Director Shiva Nirvana has made it as a love and family entertainer. 'Kushi' is gearing up for a grand release on September 1. Today, makers arranged a Fifth song Osi Pellamma launch event in a pub in Hyderabad. Producers Y Ravishankar, Naveen Yerneni, Mythri CEO Cherry, director Shiva Nirvana, music director Hesham Abdul Wahab and singer Rahul Sipligunj participated in the event.
This song was shot as a party song in a pub. While director Shiva Nirvana penned the lyrics for the song 'Osi Pellamma', Hesham Abdul Wahab once again provided a catchy tune. This song is sung by Rahul Sipliganj and Saketh. The song tells about the flashback of the hero who fell in love with Aradhya in Kashmir and thier love story. Then it explains the struggle of Viplav in marraige life. At the event,
Singer Rahul Sipligunj said - Welcome to everyone who attended in the launch event of Osi Pellamma. Thanks to Mythri Ravi garu, music director Hesham and director Shiva for giving me the opportunity to sing in this movie. This is the song I sang for Vijay Anna for the first time. This is a beautiful song. You all will like it.
Producer Naveen Yerneni said - We as producers are eagerly waiting for this movie more than anyone else. Kushi releasing on September 1 will be loved by all of you. It will definitely be a big hit.
Director Shiva Nirvana said - It has been two years since my movie was released in theaters. I am happy to meet you all again with a good entertainer. Kushi has good emotion and entertainment. You can watch it with all your friends, girlfriend, family members. You will watch the movie on repeat. It will be a Fun Ride. Samantha is acting in a love story after many days and it is a celebration for all of us. Missing Vijay and Samantha on this stage today. Hesham bro gave good music. Thanks to Ravi Garu and Naveen Garu for giving me the opportunity to make this film.
Music director Hesham Abdul Wahab said - Mythri production and director Shiva garu supported a lot to give beautiful music to the movie Kushi. On the 1st of this month, we started the background score for this film. We completed it today. Mythri producers have supported me a lot to work on this film. Kushi gives a beautiful feeling in the theater. Be sure to check it out.
Mythri CEO Cherry said - Many genres of movies are being watched by our audience. But lately there has not been a full pleased love story. Kushi tells such a good love story with all the emotions. Director Shiva made a good movie. Watch Khushi in theaters on September 1 and enjoy.
‘ఖుషి’ సినిమా నుండి ఐదో పాట 'ఓసి పెళ్లామా..' రిలీజ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ఐదో లిరికల్ పాట 'ఓసి పెళ్లామా..' రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ పబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ సీయీవో చెర్రీ, దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.
పబ్ లో పార్టీ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. 'ఓసి పెళ్లామా..' పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ రాయగా...హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. కాశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనను చూసిన, ముందెనక చూడకుండ మనసిచ్చిన...బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చిన, లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసిన...అంటూ హీరో తన ప్రేమ, పెళ్లి ప్లాష్ బ్యాక్ గురించి చెబుతూ సాగుతుందీ పాట. ఈ పాట విడుదల కార్యక్రమంలో
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ - ఈ సాంగ్ రిలీజ్ లో పాల్గొనేందుకు వచ్చిన అందరికీ వెల్ కమ్. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన మైత్రీ రవి గారికి, సంగీత దర్శకుడు హేషమ్ గారికి, డైరెక్టర్ శివ గారికి థాంక్స్. ఫస్ట్ టైమ్ విజయ్ అన్నకు నేను పాడిన పాట ఇది. బ్యూటిఫుల్ సాంగ్ ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - మిగతా అందరి కంటే ప్రొడ్యూసర్స్ గా మేము ఈ సినిమా కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్నాం. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఖుషి మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అన్నారు
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - నా సినిమా థియేటర్ లో రిలీజై రెండేళ్లు దాటుతోంది. మళ్లీ మీ అందరినీ ఓ మంచి ఎంటర్ టైనర్ తో కలుస్తుండటం సంతోషంగా ఉంది. ఖుషిలో మంచి ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడొచ్చు. మీరు రీపీటెడ్ గా సినిమాను చూస్తారు. అంత బాగుంటుంది. ఫన్ రైడ్ లా సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సమంత లవ్ స్టోరీలో నటిస్తుందంటే మనందరికీ పండగ. ఇవాళ ఈ స్టేజీ మీద విజయ్ ను, సమంతను మిస్ అవుతున్నా. హేషమ్ బ్రో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రవి గారికి, నవీన్ గారికి థాంక్స్. అన్నారు.
సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ - ఖుషి సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చేందుకు మైత్రీ సంస్థ , డైరెక్టర్ శివ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ నెల ఒకటో తేదీన మేము ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాం. ఇవాళ కంప్లీట్ చేశాం. ఈ సినిమాకు పనిచేసేందుకు ఎంతో సపోర్ట్ చేశారు మైత్రీ ప్రొడ్యూసర్స్. ఖుషి థియేటర్ లో బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా చూడండి. అన్నారు.
మైత్రీ సీయీవో చెర్రీ మాట్లాడుతూ - ఎన్నో జానర్స్ మూవీస్ చూస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య ఒక ఫుల్ ప్లెజ్డ్ లవ్ స్టోరీ రాలేదు. ఖుషిలో అలాంటి మంచి ప్రేమ కథను అన్ని ఎమోషన్స్ కలిపి చూస్తారు. దర్శకుడు శివ గారు మంచి సినిమా చేశారు. సెప్టెంబర్ 1న ఖుషిని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
Songs do play a vital role in getting people notice the film and in getting grand openings. Songs going viral has helped these films (Waiter Veerayya, Sir, Dasara, Baby and Jailer) get good openings this year. And content too helped in these films scoring big at the box office.… pic.twitter.com/8oE7pnbgxB