Hyderabad: Mass Ka Das Vishwak Sen’s upcoming intense political action drama ‘LEGACY’ has locked its worldwide theatrical release date. The film, directed by Saikiran Reddy Daida and produced under the Kalaahi Media banner, will release worldwide on December 4, 2026. The intense political action drama is being produced by Yeshwanth Daggumati and Saikiran Reddy Daida, with Sanjay Sambrani and V.V.N. Prasad as co-producers.
The makers unveiled a striking new release-date poster featuring Vishwak Sen and Ekta Rathod, officially announcing December 4th as the date audiences can mark on their calendars.
Written and directed by Saikiran Reddy Daida, LEGACY marks his second feature film after his directorial debut Pindam. The film also marks the second production venture from Kalaahi Media, following Pindam.
Set against a powerful political backdrop, LEGACY explores the collision of power, family, love and betrayal. Vishwak Sen plays a character who is drawn into a dangerous world shaped by his father’s legacy, while acclaimed Hindi actor Kay Kay Menon takes on a powerful antagonist role.
The film features a strong ensemble cast including Rao Ramesh, Sachin Khedekar, Murali Mohan, Ekta Rathod, Raja Ravindra, Rajeev Kanakala, Aneesh Kuruvilla, Khushee Ravi, Kalyani Natarajan, Ravi Kaale, Amit Tiwari and others.
The technical team includes Jiju Sunny as cinematographer, Govind Vasantha as music composer, Sirish Prasad as editor, Rajeev Nair as production designer and Jashuva as action choreographer.
With the final leg of shooting currently underway, LEGACY is gearing up for a worldwide theatrical release on DECEMBER 4, 2026.
విశ్వక్ సేన్ ‘లెగసీ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో డిసెంబర్ 4న ‘లెగసీ’తో విశ్వక్ సేన్ ఎలాంటి పవర్‌ఫుల్ అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు కే కే మీనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, ఏక్తా రాథోడ్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ల, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్ర సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్‌గా జిజు సన్నీ, సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత, ఎడిటర్‌గా శిరీష్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవ్ నాయర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా జాషువా పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో శరవేగంగా జరుగుతోంది. పవర్‌ఫుల్ కథాంశం, విశ్వక్ సేన్ ఇంటెన్స్ పాత్ర, భారీ తారాగణం, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో రూపొందుతున్న ‘లెగసీ’ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.