pizza

Lenin blockbuster celebrations
ఇక్కడి నుంచి మన (అభిమానులు) ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇకపై నేను ప్రశాంతంగా మీ కోసం యుద్ధం చేస్తాను - ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో అఖిల్ అక్కినేన

You are at idlebrain.com > news today >

16 July 2026
Hyderabad

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు గుంటూరులో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌కి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘నందు వల్లే ‘లెనిన్’ ఈ స్థాయికి వచ్చింది. రెండేళ్ల క్రితం నందు నాకు ఈ కథ చెప్పారు. ఆయన నన్ను నమ్మారు కాబట్టే ఈ చిత్రం వచ్చింది. ఒక్క ఫోన్ కాల్‌తోనే మా కోసం వచ్చిన అన్నయ్య ఎన్టీఆర్ గారికి థాంక్స్. మా సినిమాకి వాయిస్ ఇచ్చిన తారక్ అన్నకి థాంక్స్. నా కెరీర్ ప్రారంభం నుంచీ నాని, వంశీ కాక, వీఎంఆర్ నాతోనే ఉన్నారు. అవినాష్ గారు మాకు అద్భుతమైన సెట్స్ వేశారు. లియోన్ గారి కెమెరా వల్లే నేను అందంగా కనిపించాను. ఎడిటర్ నవీన్ ఎవ్వరి మాట వినడు. ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్లకు థాంక్స్. మంచి సాహిత్యం ఇచ్చిన లిరిక్ రైటర్లకు థాంక్స్. తమన్ తన బీజీఎంతో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకు వెళ్లారు. భారతి పాత్రకు ప్రాణం పోసిన భాగ్యశ్రీకి, అద్భుతంగా నటించిన ప్రమోద్‌కి థాంక్స్. నాగవంశీతో ఈ నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆయనతో మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు చేయాలని కోరుకుంటున్నాను. నా వెన్నంటే నిలిచిన రూపక్‌కి, రథుల్‌కి థాంక్స్. నా సతీమణి జైనబ్‌ని ఇంట్లో బంగారు తల్లి అని పిలుస్తాను. ఈ మూడేళ్లలో జైనబ్‌ నాకు కొండంత అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు. మా నాన్న ఇచ్చిన హగ్‌లోనే ఈ పదేళ్ల శ్రమ, ప్రేమ కనిపిస్తుంది. నా సర్వస్వం అయిన నాన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ‘లెనిన్’ను మా నాన్న తన భుజానికి ఎత్తుకుని రెండేళ్లు కష్టపడ్డారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుని ఉంటానో.. అందుకే అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పుడు నేనేమీ కాలర్ ఎగిరేయడం లేదు.. గంతులు వేయడం లేదు. ఇకపై నేను ప్రశాంతంగా ఉంటాను. సైలెంట్‌గా యుద్ధం చేస్తాను. ఇక్కడి నుంచి మన (అభిమానులు) ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇకపై నేను ప్రశాంతంగా మీ (అభిమానులు) కోసం యుద్ధం చేస్తాను’ అని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, టీంకు అభినందనలు. ఒక సినిమా విజయం సాధిస్తే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రపీ మినిస్టర్‌గా నేను సంతోషిస్తాం. ఇలా విజయాలు వస్తే ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్తుంది. అఖిల్ గారు మొదటి నుంచీ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అపజయాలకు బెదరకుండా నిర్విరామంగా చేసిన కృషికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు ‘లెనిన్’తో వచ్చింది. అక్కినేని లెగసీ చాలా గొప్పది. మన ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ నేపథ్యం, మన ఎమోషన్స్‌తో మురళీ కిషోర్ గారు ‘లెనిన్’ను అద్భుతంగా తెరకెక్కించారు. నాగార్జున గారు, నాగవంశీ గారు ఈ మూవీని గొప్పగా నిర్మించారు. అఖిల్ గారు, భాగ్యశ్రీ జంట చూడముచ్చటగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ పదికాలాల పాటు నిలబడేలా చేసింది ‘లెనిన్’ విజయం. చిత్తూరు ప్రాంతానికి చెందిన కథను, మహా భారతానికి అన్వయించుకుని ఇంత అద్భుతంగా తీశారు. అఖిల్‌కి మరిన్ని విజయాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి మధ్య ఒక అందమైన, గొప్పగా తెలుగు సినిమా పరిశ్రమను నిర్మించాలనే దీక్షా కంకణ బద్దులమై ఉన్నామని తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. ‘గుంటూరుకి చివరగా ‘అ ఆ’ సక్సెస్ మీట్‌కి వచ్చాను. ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ సక్సెస్ మీట్‌కి వచ్చాను. ఇలా మన ఊరికి రావడం ఆనందంగా ఉంది. ఫస్ట్ డే టాక్ చూసిన తర్వాత అఖిల్‌కి వంద కోట్లు సినిమా అవుతుందని ఫిక్స్ అయ్యాను. ఈ విషయంలో నాకు ఆడియెన్స్ అంతా సపోర్ట్ చేయాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్స్ కమీషన్స్‌తో సహా బ్రేక్ ఈవెన్ అయ్యారు. మాకు సపోర్ట్ చేసిన దుర్గేశ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ రిలీజ్ అయినప్పటి నుంచీ మా అయ్యగారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. నాకు ఇంత కంటే ఏం కావాలి. హైదరాబాద్‌లోనే రామాపురంని క్రియేట్ చేసేందుకు కష్టపడిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అఖిల్ గారు మొదటి నుంచీ కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచీ మనం కొడుతున్నాం అనే నమ్మకంతోనే ఆయన ఉన్నారు. నా భారతికి థాంక్స్. నాకు దారి చూపించిన నాగ్ సార్‌కి థాంక్స్. సపోర్ట్‌గా నిలిచిన నాగవంశీ గారికి థాంక్స్’ అని అన్నారు.

కల్చరల్ చైర్ పర్సన్ తేజస్వీ మాట్లాడుతూ .. ‘‘అయ్యగారే నెంబర్ వన్.. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు.. రావడం లేట్ ఏమో గానీ.. రావడం మాత్రం పక్కా.. అన్ని ప్రశ్నలకు అఖిల్ గారు ‘లెనిన్’తో సమాధానం చెప్పారు. నెక్ట్స్ మూవీ సక్సెస్ మీట్‌ను మా ఒంగోలులో పెట్టాలని అఖిల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని అన్నారు.

నటుడు ప్రమోద్ మాట్లాడుతూ .. ‘నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్నారు. దీనంతటికి కారణం కిషోర్. అతను చాలా మంచివాడు. నన్ను నమ్మి వసంత్ అనే పాత్రను ఇచ్చిన కిషోర్‌కి థాంక్స్. అఖిల్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడో నా కళ్లారా చూశాను. అఖిల్ ఇచ్చిన ఒకే ఒక్క ఇంటెన్స్ రియాక్షన్‌ చూసి షాక్ అయ్యాను. అఖిల్ ఇండస్ట్రీని రూల్ చేస్తాడు. నా గురించి గొప్పగా చెప్పిన నాగ్ సర్‌కి, నాపై నమ్మకం పెట్టుకున్నందుకు థాంక్స్’ అని అన్నారు.

భాగ్య శ్రీ బోర్సే మాట్లాడుతూ .. ‘‘లెనిన్’తో మనం హిట్టు కొట్టేశాం. మీ (అభిమానులు) అందరికీ భారతి నచ్చిందా?. మీ ప్రేమే మాకు అవార్డులతో సమానం. అందరూ భారతిని మనస్పూర్తిగా ప్రేమించారు. నందు గారు లేకపోతే మా ‘లెనిన్’ లేదు. మా అందరికీ అద్భుతమైన పాత్రలు ఇచ్చిన ఆయనకు థాంక్స్. అఖిల్ అద్భుతమైన నటుడు. మున్ముందు మరిన్ని సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. క్లైమాక్స్‌లో అఖిల్ అదరగొట్టేశారు. నాగార్జున గారే ‘లెనిన్’కి హార్ట్ బీట్. మాకు సపోర్ట్ చేసిన నాగవంశీ గారికి థాంక్స్. తమన్ బీజీఎం అదిరిపోయింది. అభిమానులు చూపించే ప్రేమ కోసం నేను ఇంకా కష్టపడతాను’ అని అన్నారు.

శివాజీ మాట్లాడుతూ .. ‘‘మా ‘లెనిన్’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. మా కోసం వచ్చిన కందుల దుర్గేశ్ గారికి, సత్య ప్రసాద్ గారికి, తేజస్వి గారికి థాంక్స్. అఖిల్ మొదటి సారిగా సతీసమేతంగా మా ఊరికి వచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి గుంటూరు ప్రజలు ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. ‘లెనిన్’ మా అందరికీ ప్రత్యేకమైన సినిమా. నందు ఈ మూవీని ఎంతో గొప్పగా మలిచారు. ఈ చిత్రానికి కథ వర్కౌట్ అయింది. ఫ్యామిలీ, సెంటిమెంట్, డ్రామా, పాటలు, ఆర్టిస్టులు, పర్ఫామెన్స్‌లు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మన సహజత్వానికి దగ్గరగా ఉండే కథలే ఎక్కువగా విజయవంతం అవుతాయి. కిషోర్ గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఏపీలో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ది చేయాలని అనుకుంటున్నాను. అఖిల్‌కి ఇది 8వ సినిమా. ఎనిమిది అనే నంబర్ చాలా లక్కీ. అయ్యగారే నెంబర్ వన్’ అని అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ మూవీ అందరికీ నచ్చుతోంది. నాగవంశీ గారు అందరికీ అందుబాటులోనే టికెట్ రేట్లను పెట్టారు. అందరూ అద్బుతంగా నటించినా.. క్లైమాక్స్‌లో మాత్రం దర్శకుడు, అఖిల్ సినిమాని పట్టుకెళ్లారు. అఖిల్‌ అద్భుతమైన నటనకు అవార్డు రావాల్సిందే. ఈ మూవీ చూడని వారిది బ్యాడ్ లక్. ఇది ప్యూర్ మన తెలుగు సినిమా. ఈ మూవీకి అఖిల్ ఆన్ స్క్రీన్ కష్టపడితే.. ఆఫ్ స్క్రీన్‌లో నాగార్జున గారు కష్టపడ్డారు’ అని అన్నారు.

ఈశ్వరీ రావు మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ సినిమా ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. చివరి ఇరవై నిమిషాలు అఖిల్, ప్రమోద్, నందు గారు మాత్రమే కనిపించారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాత : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
బ్యానర్లు : మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ :నవీన్ నూలి
DOP :లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ :అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :ఆనంద్ రెడ్డి కర్నాటి
పోస్ట్ ప్రొడక్షన్ : అన్నపూర్ణ స్టూడియోస్
కలరిస్ట్: వివేక్ ఆనంద్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s