Little Hearts: A Wholesome Family Entertainer Collects 15.41 Crores Gross in Just 4 Days
4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "లిటిల్ హార్ట్స్"
The film Little Hearts, starring Mouli Tanuj and Shivani Nagaram in the lead roles, has recently hit the screens and emerged as a resounding success. Directed by Sai Marthand under the ETV Win Original Production banner, the movie was produced by Aditya Hasan. The film received an excellent promotional push and was released theatrically on a grand scale across the globe by Bunny Vas (BV Works) and Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments).
As a wholesome family entertainer, Little Hearts has been gaining strong momentum at the box office with each passing day. Within just 4 days of its release, the film has grossed an impressive ₹15.41 crores, which is considered a remarkable feat, especially for a small-to-mid-budget film. Given the current trend, the movie is expected to post even stronger numbers by the end of its first week.
Writer & Director: Sai Marthand
Producer: Aditya Hasan
PRO: GSK Media (Suresh & Sreenivas)
Music: Sinjith Yerramilli
Cinematography: Surya Balaji
Editor: Sridhar Sompalli
Art Director: Divya Pavan
Executive Producers: Vinod Nagul, Murali Punna
Distribution: Bunny Vas, Vamsi Nandipati
Distribution Banners: BV Works, Vamsi Nandipati Entertainments
4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "లిటిల్ హార్ట్స్"
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.
హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. చిన్న చిత్రాల్లో ఈ రేంజ్ వసూళ్లు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ మరిన్ని గ్రేట్ నెంబర్స్ "లిటిల్ హార్ట్స్" క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.