pizza

Little Hearts proves that content is the true superstar: Blockbuster director Sai Rajesh
కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని "లిటిల్ హార్ట్స్" ప్రూవ్ చేసింది - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సాయి రాజేశ్

You are at idlebrain.com > news today >

9 September 2025
Hyderabad

The film Little Hearts starring Mouli Tanuj and Shivani Nagaram as the lead pair, recently hit theatres and has become a resounding success.

The film has been receiving not only audience appreciation but also praise from several celebrities. Recently, director Sai Rajesh extended his congratulations to the team. Sharing his love for the film on Instagram, Sai Rajesh shared his thoughts:

"I watched Little Hearts. It proves that content alone is the true superstar, and the one who can create such content is the real champion. Times have changed - if we don’t change too, we’ll just end up blaming others. Little Hearts is a beautiful film that keeps a smile on your face from start to finish. My appreciation to director Marthand Sai, Aditya Hasan, Sinjith, and Mouli. Every two or three years, someone comes along, smashes the box office, and moves on... yet we never seem to learn. That’s just how it is."

కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని "లిటిల్ హార్ట్స్" ప్రూవ్ చేసింది - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సాయి రాజేశ్

"లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ - '"లిటిల్ హార్ట్స్" సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, "లిటిల్ హార్ట్స్" బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో వచ్చి ఇలా బాక్సాఫీస్ లు బద్దలుకొట్టి పోతుంటాడు, మనకు బుద్ధి రాదు, అంతే..' అంటూ పేర్కొన్నారు.

మౌళి తనూజ్, శివానీ నగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved