A small team that entered the film industry with immense passion and big dreams has now turned their modest project into an unexpected blockbuster. That team is none other than the Little Hearts crew. From the day of release, the film began drawing crowds to theatres and won the hearts of audiences from all walks of life. After a long time, a Telugu film managed to make audiences laugh out loud and return to cinemas in large numbers.
Little Hearts is the magical creation of young filmmaker Sai Marthand - who hasn’t even turned thirty yet - and his group of close friends. Actor Mouli and actress Shivani Nagaram did complete justice to their roles, while music composer Sinjith Erramilli’s soundtrack gave the film an added emotional strength. Every member of the team put their heart and soul into the project, and the film’s success stands as a well-deserved reward for their collective hard work.
Produced by Aadhitya Hasan, the film was released jointly by Bunny Vas and Vamsi Nandipati.
Recently, director Sai Marthand made a remarkable gesture by uploading the entire Little Hearts script online, making it publicly available for everyone to read on social media.
'లిటిల్ హార్ట్స్' స్క్రిప్టును ఇంటర్నెట్లో పెట్టిన దర్శకుడు సాయి మార్తాండ్
సినిమా రంగంపై ఎంతో ఇష్టంతో, ఎన్నో ఆశలతో వచ్చిన ఓ చిన్న బృందం ఓ చిన్న సినిమా రూపంలో తెరపైకి వచ్చి ఊహించని పెద్ద విజయాన్నే తమ ఖాతాలో వేసుకోంది. ఆ బృందమే 'లిటిల్ హార్ట్స్' బృందం. విడుదల రోజు నుండే థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది ఈ సినిమా. అన్ని వర్గాలనూ విపరీతంగా ఆకర్షించింది. చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. థియేటర్లకు రప్పించింది.
సాయి మార్తాండ్ అనే ముప్పై ఏళ్లు కూడా నిండని ఓ యువ దర్శకుడు తన స్నేహితుల బృందంతో కలిసి తెలుగు తెరపై సృష్టించిన మాయాజాలమే 'లిటిల్ హార్ట్స్'. హీరోగా మౌళీ, హీరోయిన్ గా శివాని నగరం తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేసేసారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమిల్లి అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలం. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ తమ సర్వ శక్తులూ ఒడ్డే కష్టపడ్డారు. ఆ బృందం పడ్డ కష్టానికి తగ్గట్టే ఫలితం కూడా విజయం రూపంలో రావడంతో వాళ్ల సంతోషానికి అవధులే లేవని చెప్పుకోవచ్చు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి లు సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా స్క్రిప్టును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు దర్శకుడు సాయి మార్తాండ్.