“Tourist Family” Director Abhishan Jeevinth Praises Little Hearts
"లిటిల్ హార్ట్స్" సినిమా టీమ్ కు "టూరిస్ట్ ఫ్యామిలీ" మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు
Little Hearts, starring Mouli Tanuj and Shivani Nagaram, has recently hit theatres and turned out to be a grand success. Directed by Sai Marthand under the ETV Win Originals banner and produced by Aditya Hasan, the film was extensively promoted and released worldwide by Bunny Vas (BV Works) and Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments). Capturing the audience’s attention, the movie has performed strongly at the box office.
Adding to the celebrations, Tourist Family director Abhishan Jeevinth showered praises on Little Hearts. Sharing his thoughts on social media, he said, “I watched Little Hearts. It’s a cute fun movie to enjoy with friends and family.” The film has already grossed an impressive ₹12.21 Cr in just 3 days.
Writer & Director: Sai Marthand
Producer: Aditya Hasan
Music: Sinjith Yerramalli
Cinematography: Surya Balaji
Editor: Sridhar Sompalli
Art Director: Divya Pawan
Executive Producers: Vinod Nagul, Murali Punna
Distribution: Bunny Vas (BV Works), Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments)
"లిటిల్ హార్ట్స్" సినిమా టీమ్ కు "టూరిస్ట్ ఫ్యామిలీ" మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
తాజాగా ఈ చిత్రానికి సూపర్ హిట్ మూవీ "టూరిస్ట్ ఫ్యామిలీ" డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు దక్కాయి. "లిటిల్ హార్ట్స్" సినిమాను చూశాను, ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన క్యూట్ ఫన్ మూవీ అంటూ ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. "లిటిల్ హార్ట్స్" సినిమా 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.