pizza

I got Arya Vibes when I heard the story of 'Love Me': Dil Raju at the title launch event
‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను: టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు

You are at idlebrain.com > news today >

27 February 2024
Hyderabad

Starring young hero Ashish and gorgeous Vaishnavi Chaitanya, the film is presented by Shirish and produced by Harshith Reddy, Hansitha, and Naga Mallidi under the banner of Dil Raju Productions. Directed by Arun Bhimavarapu, the title announcement press meet for this film was held today. The movie has been titled 'Love Me', with 'If You Dare' as tag line. After announcing the title, the film unit interacted with the media.

Ace producer Dil Raju said, "Ashish is currently in Tirumala, which is why he couldn't be here today. Naga and Arun are the reasons why 'Love Me - If You Dare' project started. Naga has been familiar to me since long time. He told me to listen to the script, saying it was made with his friend. Then I met Arun. The moment I heard that script, I was transported back twenty years. How I got excited when I heard Arya's story, I got excited again. This is a new-age film. Ashish was asked to be the hero. They won me over by telling the story. We started Dil Raju Productions to support the newcomers. We have told this story to many people. Everyone was excited. After the script was completed, I was afraid to tell the names of the technicians. I asked PC Sreeram to listen to the script. He read the script and immediately said ok. In the case of music, they wanted Keeravaani. We approached Keeravaani garu and heard the script and immediately said ok. 'Baby' was a big hit at a time when heroines were being sought. She came to the office, read the script completely, and got fully excited. Rarely do we see a script like this excite to this extent. I am confident that the movie will receive a good response from the audience. The title was announced on February 27. We are going to release the movie on April 27. After 'Balagam', Harshith and Hansitha had to do another project, and this movie came along. Ashish also wants to do another project and this project is ready. What happened to me with 'Arya'. I'm getting vibes that the same is going to happen to all of you. All the best to the film team."

Vaishnavi Chaitanya said, "I still get those vibes ever since I heard the story of 'Love Me - If You Dare'. The same excitement is still there. This movie is very special to me. It has a point and story never seen before. The teaser will be released soon. The teaser gives a different vibe to everyone. When they come out of the theater, they come out with a different experience."

Actors: Ashish, Vaishnavi Chaitanya, and others.

Technical team:
Banner: Dil Raju Productions
Producers: Harshith Reddy, Hansitha, Naga Mallidi
Director: Arun Bhimavarapu
Cameraman: PC Sreeram
Music: MM Keeravaani
Editor: Santosh Kamireddy

‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను: టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమాకు ‘లవ్ మీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఉప శీర్షిక. టైటిల్ ప్రకటించిన అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. అందుకే అతను ఇక్కడకు రాలేకపోయారు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాగ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ స్క్రిప్ట్ వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని అన్నాడు. అప్పుడు అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ గారికి స్క్రిప్ట్ వినమని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి కావాలన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటివి చేస్తున్నారు.. ఆయన మీకు దొరుకుతాడా? అని అన్నారు. కీరవాణి గారిని అప్రోచ్ అయి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన కూడా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ ప్రకటించారు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. బలగం తరువాత హర్షిత్, హన్షితలు వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది ఈ సినిమా వచ్చింది. ఆశిష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది.. ఈ ప్రాజెక్ట్ రెడీ అయింది. నాకు ఆర్య విషయంలో ఏం జరిగిందో.. మీ అందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్, లైన్‌ను ఇది వరకెప్పుడూ చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారు’ అని అన్నారు.

నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
దర్శకుడు : అరుణ్ భీమవరపు
కెమెరామెన్ : పీసీ శ్రీరామ్
సంగీతం : కీరవాణి
ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved