pizza

Tralala Moving Pictures Announces May 15 Release for Samantha Starrer ‘Maa Inti Bangaram’
ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.. మే15న గ్రాండ్ రిలీజ్‌

You are at idlebrain.com > news today >

22 February 2026
Hyderabad

HYDERABAD – Tralala Moving Pictures is pleased to announce that its second production, Maa Inti Bangaram, is scheduled for a worldwide theatrical release on May 15, 2026.

The film features Samantha, Diganth, and Gulshan Devaiah in lead roles, supported by notable performances from Sree Mukhi, Gautami, Anand, Lakshmi, Srinivas Gavireddy and Manjusha. Created by Raj Nidimoru, this project marks a significant reunion between Samantha and director Nandini Reddy, following their previous collaboration on the successful film Oh! Baby.

A Compelling Action Drama, currently progressing through its final stages of production, Maa Inti Bangaram is a well-crafted action drama designed to engage audiences across all age groups. Director Nandini Reddy has helmed this project as a family entertainer that balances emotional depth with high-stakes action.

The production team has also unveiled a new poster featuring Samantha, offering a glimpse into the film’s aesthetic. This follows a well-received teaser that highlighted Samantha’s physical preparation for the film’s action sequences, establishing high expectations for her performance.

The film is produced by Samantha, Raj Nidumoru, and Himank Duvvuru, featuring a technical crew of industry veterans:
• Music: Santosh Narayanan
• Cinematography: Om Prakash
• Story & Screenplay: Raj Nidimoru, Vasanth Maringanti and Sita Menon
• ⁠Action: Lee Whittaker
• Production Design: Ullas Hydur
• Editing: Dharmendra Kakarala
With its strategic May release, Maa Inti Bangaram is positioned to be a highlight of the 2026 summer cinematic calendar.

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.. మే15న గ్రాండ్ రిలీజ్‌

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య ఇత‌ర ప్రాత‌ల్లో న‌టిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌత‌మి, ఆనంద్‌, లక్ష్మి, శ్రీనివాస్ గ‌విరెడ్డి, మంజుషా కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబి వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత మ‌రోసారి సమంత‌, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మే15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. యాక్ష‌న్ డ్రామా మూవీ అంద‌రికీ నచ్చేలా, అన్ని అంశాల‌తో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బ‌ల‌మైన భావోద్వేగాల‌తో పాటు ఉత్కంఠ‌త‌ను రేపే యాక్ష‌న్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా స‌మంత ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది, ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇది యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈసారి స‌మంత ఎలా మెప్పించ‌నుందోన‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను స‌మంత‌, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.

సంగీతం: సంతోష్ నారాయ‌ణ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఓం ప్ర‌కాష్
స్టోరీ, స్క్రీన్‌ప్లే: రాజ్ నిడిమోరు, వ‌సంత్ మారింగంటి, సీతా మీన‌న్
యాక్ష‌న్‌: లీ విట్టాకెర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉల్లాస్ హైదుర్‌
ఎడిటింగ్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల‌
మే నెలలో రిలీజ్ అవుతుండ‌టం ద్వారా మా ఇంటి బంగారం 2026 వేసవి సినిమాటిక్ క్యాలెండర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవడానికి సిద్ధమైంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved