Rohit Saraf comes on board for “Mahakali”, the next chapter after Hanu-Man; Actor completes Filming an extensive schedule in Hyderabad
ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ ‘మహాకాళి’లో చేసిన రోహిత్ సరాఫ్, హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి
Filmmaker Prasanth Varma and RKD Studios continue to build momentum around Mahakali, the next chapter from the world of Hanu-Man, as Rohit Saraf comes on board for the film. The actor has recently completed shooting for the film in Hyderabad, marking a significant new arc in its expanding narrative.
With Rohit Saraf’s addition, the film strengthens its ensemble while widening its appeal across audiences. The actor enjoys a strong following in the North, particularly among the youth, further anchoring the film’s pan-India reach.
The film also stars Akshaye Khanna, Bhoomi Shetty and several other prominent actors in pivotal roles, with their first looks already generating intrigue for their striking and intense visual appeal. Mounted on a grand cinematic scale, Mahakali is being produced by RK Duggal and Riwaz Ramesh Duggal under the banner of RKD Studios, as part of Prasanth Varma’s vision to expand a uniquely Indian cinematic universe following the success of Hanu-Man. The film is being directed by Puja Kolluru.
The film is progressing steadily and is positioned as one of the most anticipated upcoming pan-India projects.
ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ ‘మహాకాళి’లో చేసిన రోహిత్ సరాఫ్, హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి
‘హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
రోహిత్ సరాఫ్ చేరికతో ఈ చిత్రానికి మరింత అప్పీల్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ ‘మహాకాళి’ పాన్ ఇండియా రీచ్‌ను మరింత బలోపేతం చేయనుంది.
ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
‘హను-మాన్’ విజయానంతరం భారతీయ మూలాలతో కూడిన సినిమా యూనివర్స్ ని విస్తరించాలనే ప్రశాంత్ వర్మ విజన్‌లో భాగంగా ‘మహాకాళి’ రూపొందుతోంది. ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్‌లు ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు
‘మహాకాళి’ అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.