pizza

Veteran Producer Mahendra Passes Away!
మంచి నిర్మాత మహేంద్ర మరణించారు!!

You are at idlebrain.com > news today >

12 June 2025
Hyderabad

Senior producer Mahendra (79) passed away last night (June 11) at 9:30 PM. He had been suffering from heart-related issues for some time and was undergoing treatment at Ramesh Hospitals in Guntur. He is survived by his wife and daughter. Mahendra had earlier lost his son. Notably, well-known producer and actor Madala Ravi is his son-in-law.

Mahendra began his journey in the film industry as a production executive and went on to produce 36 films under A.A. Arts and Geetha Art Pictures banners. He introduced Srihari as a hero in the film Police and launched Kajal Aggarwal with Lakshmi Kalyanam. He debuted as a producer with Preminchi Pellli Chesuko" and made films like Police, Deva, Coolie, Okkade, Amma Leni Puttillu, and Lakshmi Kalyanam etc.

His last film, Arjuna, directed by Kanmani starring Rajasekhar, unfortunately remained unreleased, which took a toll on his health and finances. Mahendra, known for his values and discipline, earned the respect of many in the film industry. Several film personalities expressed deep condolences over his demise.

His hometown is Guntur, where his final rites will be performed today (June 12).

మంచి నిర్మాత మహేంద్ర మరణించారు!!

సీనియర్ నిర్మాత - ఎ. ఎ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) నిన్న రాత్రి (జూన్ 11) 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర... గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరికి భార్య, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమారుడ్ని కోల్పోయిన మహేంద్రకు... ప్రముఖ నిర్మాత - నటుడు మాదాల రవి అల్లుడు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన మహేంద్ర... ఎ. ఎ. ఆర్ట్స్ - గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకాలపై 36 చిత్రాలు నిర్మించారు. "పోలీస్" చిత్రంతో శ్రీహరిని హీరో చేసింది, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పరిచయ చిత్రం "లక్ష్మీ కల్యాణం" నిర్మించింది ఈయనే. "ప్రేమించి పెళ్లి చేసుకో" చిత్రంతో నిర్మాతగా మారిన మహేంద్ర "పోలీస్, దేవా, కూలీ, ఒక్కడే, అమ్మ లేని పుట్టిల్లు, లక్ష్మీ కల్యాణం" తదితర చిత్రాలు నిర్మించారు. కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "అర్జునా" వీరి చివరి చిత్రం. ఈ చిత్రం విడుదలవ్వకపోవడం ఆయనను ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసింది. విలువలతో కూడిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మహేంద్ర స్వస్థలం గుంటూరు. వారి అంత్యక్రియలు అక్కడే ఈరోజు (జూన్ 12)న జరగనున్నాయి!!

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved