pizza

Mahendragiri Varahi A Divine Blockbuster Weekend Winner
‘మహేంద్రగిరి వారాహి’కి గ్రౌండ్ లెవల్ లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మౌత్ టాక్ చాలా బావుంది. ఈ వీకెండ్ సినిమా చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది: ప్రెస్ మీట్ లో హీరో సుమంత్

You are at idlebrain.com > news today >

12 September 2026
Hyderabad

హీరో సుమంత్ డివైన్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ డివైన్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా కాలంగా కొంతమంది ఇండస్ట్రీ పీపుల్, అలాగే నా ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుకోలేదు. నిన్నటి నుంచి ఆ అభినందనలు మొదలయ్యాయి. ‘మహేంద్రగిరి వారాహి’ని గురించి ప్రేక్షకులు, అభిమానులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి చాలా మంచి కాల్స్ వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో టాక్ చాలా పాజిటివ్‌గా ఉంది. పికప్ కావడానికి టైం పట్టింది, అది వాస్తవమే. ఇప్పుడు మంచి టాక్ సెటిల్ అయింది. ఈ టాక్ మరింత పెరుగుతుంది. చాలాకాలం తర్వాత నా స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కంగ్రాజులేషన్స్ అందుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన మీడియాకి, ప్రేక్షకులకు థాంక్యూ. తప్పకుండా ఈ వీకెండ్ సినిమా చూడండి. మేము చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో అనే ఒక చిన్న భయం ఉండేది. ఆడియన్స్ వాటిని చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి షోకి ఫుట్‌ఫాల్స్ పెరుగుతున్నాయి. ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయి. అలాగే షోలు కూడా పెరుగుతున్నాయి. రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మాది నంబర్ వన్‌లో ఉందని ఆడియన్స్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకుల పబ్లిక్ టాక్ రాపిడ్ ఫైర్‌లా వెళ్తుంది. ఇంకా అద్భుతంగా వెళ్లాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

వంశీ చాగంటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చూసిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్‌తో వెళ్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయి. మీరందరూ తప్పకుండా ఈ పండగ సెలవుల్లో సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది.

మీనాక్షి మాట్లాడుతూ.. మీ అందరికీ సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా సినిమా అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

నిర్మాత మధు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గ్రౌండ్‌లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వుంది. ఇది మెల్లగా పికప్ అవుతుందని ముందే ఊహించాను. మేము ఊహించినట్టే ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి కృష్ణా, ఈస్ట్, వైజాగ్, తిరుపతి, నైజాం అన్నిచోట్ల ఫుల్స్ వచ్చాయి. ఇప్పుడు 75 స్క్రీన్స్ పెంచాము. అలాగే ఒడిశాలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే హిందీలో కూడా మెల్లగా పికప్ అవుతుంది. చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా ఆడియన్స్ అందరూ థియేటర్స్‌కి వెళ్లి చూడండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved