pizza

Manoj Manchu announces 3 films
తన సినిమాల భారీ లైనప్ ను ప్రకటించిన మంచు మనోజ్..!

You are at idlebrain.com > news today >

9 September 2025
Hyderabad

Manchu Manoj has accelerated the pace of his film projects. In an interview with Idlebrain Jeevi, he revealed that he has a massive lineup after Mirai. He shared that he will next be seen as David Reddy, in a story set between 1897 and 1920. Although the character is fictional, the film will explore how such a character would have existed within real historical events from that era.

He also announced a comedy film titled Attaru Saayibu, promising that it will leave audiences in splits with laughter. Apart from these two, he revealed that he is also collaborating on a film with someone very close to him.

With this, it’s clear that Manchu Manoj has greenlit three films post-Mirai.

తన సినిమాల భారీ లైనప్ ను ప్రకటించిన మంచు మనోజ్..!

మంచు మనోజ్ తన సినిమాల వేగాన్ని పెంచారు. 'మిరాయ్' తరువాత ఓ భారీ లైనప్ ఉండబోతున్నట్టు 'ఐడిల్ బ్రెయిన్' జీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1897 నుండి 1920 మధ్య కాలంలో జరిగే కథతో 'డేవిడ్ రెడ్డి' గా రాబోతున్నానన్నారు. అది ఓ కల్పిత పాత్ర అయినా, చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనల్లో ఆ పాత్ర ఉంటే ఎలా ఉండబోతుందో అన్న విషయాలను ఆ సినిమాలో చూపించబోతున్నామన్నారు.

'అత్తరు సాయిబు' అనే మరో హాస్య రస చిత్రం కూడా రాబోతుందని, ఆ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలమన్నారు. పై రెండు సినిమాలు కాకుండా తనకు బాగా కావాల్సిన వ్యక్తితో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఈలెక్కన 'మిరాయ్' తరువాత మూడు సినిమాలకు మంచు మనోజ్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved