Namasthe World Signs ₹36.24 Crore MoU with Andhra Pradesh Government at the 31st CII Partnership Summit
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న 'నమస్తే వరల్డ్'
Visakhapatnam, November 13, 2026: Namasthe World, the Hyderabad-based storytelling and toy startup founded by Bhuma Mounika Manchu with actor and entrepreneur Manchu Manoj, signed a handlooms and textiles MoU with the Government of Andhra Pradesh at the 31st CII Partnership Summit on Thursday to establish sustainable apparel, handloom and toy manufacturing centres in Kurnool and Visakhapatnam, with a proposed investment of ₹36.24 crore.
The project is designed as an integrated, sustainable manufacturing ecosystem in which nothing a weaver makes goes to waste: handloom fabric becomes garments, and surplus material becomes dolls and soft toys. The two facilities are expected to generate around 950 direct jobs, along with 100 indirect employment opportunities across supply chains, logistics and ancillary services.
“Our vision with Namasthe World is to turn India’s incredible cultural heritage and traditional craftsmanship into contemporary, globally relevant businesses. Having grown up in a political family, I have seen how governance, public institutions and community engagement play a critical role in translating vision into action. This partnership is a significant step towards empowering artisans, creating sustainable manufacturing opportunities and taking Andhra Pradesh’s handlooms, textiles and toys to the world. We are excited to build something that creates both economic and social impact,” said Bhuma Mounika Manchu, Founder and CEO, Namasthe World. She added, “We already have a retail partnership with Reliance Brands, and now we are partners with the Government of Andhra Pradesh as well.”
“Cinema and entertainment have always had the power to influence culture, connect communities and create aspirations. I believe the creative industries can go much beyond storytelling and become powerful engines of economic opportunity. Through Namasthe World, we want to explore how creativity, technology and entertainment can support traditional industries, create new livelihoods, take India’s cultural strengths to a global audience and make ‘Made in Andhra Pradesh’ a global identity,” said Manchu Manoj, Co-Founder and Chief Innovation Officer, Namasthe World. He added, “We are also reaching out to leading technology companies to bring AI and robotics into Etikoppaka and Kondapalli toys.”
At the Summit, Namasthe World presented its toy collection to Shri Piyush Goyal, Union Minister of Commerce and Industry, who then launched the company's calendar.
“I appreciate the glocal approach of Namasthe World, taking something deeply Indian and presenting it in a format that can resonate with the world. I particularly like the brand name Namasthe World and its underlying thought of promoting Indian culture through storytelling, especially through native toys. Our traditional toys and cultural narratives have enormous potential to become ambassadors of India’s identity in global markets,” said Shri Piyush Goyal.
The initiative was also welcomed by leaders in government and public life.
“Our artisans are the custodians of India’s incredible cultural heritage, and they deserve stronger platforms and wider market access. I am very keen to support initiatives that create a structured ecosystem for local artisans, and a format like Namasthe World offers an interesting approach to connecting their skills and craftsmanship with larger opportunities. We must ensure that our local talent gets the recognition and markets it deserves,” said Shri K. Rammohan Naidu, Union Minister of Civil Aviation, Government of India.
“Andhra Pradesh is keen to attract investments that create meaningful employment, strengthen local industries and unlock the potential of our traditional sectors. The Namasthe World initiative aligns with our vision of positioning the state as a destination for sustainable manufacturing, and we welcome entrepreneurs like Manoj and Mounika to participate and grow with India’s Sunrise State,” said Shri T.G. Bharat, Minister for Industries and Commerce, Government of Andhra Pradesh.
“Andhra Pradesh is committed to creating an enabling environment for investments that combine innovation, entrepreneurship and employment generation. The proposed Namasthe World initiative presents an opportunity to strengthen sustainable apparel, handloom and toy manufacturing while creating new avenues for local artisans, entrepreneurs and the state’s manufacturing ecosystem,” said Sagili Shan Mohan, IAS, CEO, Andhra Pradesh Economic Development Board.
“India’s handloom and textile traditions are a valuable part of our cultural and economic identity. Initiatives such as Namasthe World can help connect our artisan communities with contemporary markets, design innovation and sustainable manufacturing practices. Our focus must be on preserving traditional skills while creating commercially viable opportunities for the next generation,” said Rekha Rani, IAS, Commissioner of Handlooms and Textiles, Government of Andhra Pradesh.
“What I particularly appreciate about Namasthe World is its approach to bringing art, culture and technology together. Our traditional art forms and indigenous craftsmanship have immense potential, and technology can play a transformative role in preserving, promoting and taking them to newer audiences. Such initiatives create an exciting bridge between our cultural roots and the opportunities of the future,” said Shri P.V.N. Madhav, BJP State President, Andhra Pradesh.
This builds on Namasthe World's MoU with the Andhra Pradesh Economic Development Board, signed on October 26, 2026, in Tirupati to promote tourism and cultural heritage. The three-year agreement focuses on developing characters, short films and QR-linked experiences around traditional Etikoppaka and Kondapalli toys, taking the state's craft heritage to wider audiences.
Since its inception, Namasthe World has developed over 55 original plush designs and sold more than 43,000 BIS-certified toys, establishing its presence across India and drawing interest from the Indian diaspora abroad.
ABOUT NAMASTHE WORLD
Namasthe World is a self-funded Hyderabad-based storytelling startup that brings Indian art, craft, heritage and culture to life through toys, characters and thoughtfully designed products for children. With the tagline “Celebrating Kids”, the company aims to create meaningful connections between India’s cultural identity and the next generation through play and storytelling. Namasthe World is the brand of Namasthe Toys Private Limited, which is building an ecosystem of culturally rooted children’s products, original intellectual properties and youth-focused experiences.
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న 'నమస్తే వరల్డ్'
విశాఖపట్నం, నవంబర్ 13, 2026: భూమా మౌనికా మంచు, నటుడు, వ్యాపారవేత్త మంచు మనోజ్ సంయుక్తంగా స్థాపించిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టోరీటెల్లింగ్, టాయ్ స్టార్టప్ 'నమస్తే వరల్డ్' (Namasthe World), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేనేత, జౌళి రంగంలో కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. గురువారం విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) వేదికగా రూ. 36.24 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
చేనేత కార్మికులు నేసిన ఏ ఒక్క వస్త్రం కూడా వృథా కాకుండా ఉండేలా ఒక సమగ్ర, పర్యావరణ హితమైన తయారీ వ్యవస్థగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో భాగంగా చేనేత వస్త్రాలతో దుస్తులను తయారు చేయడంతో పాటు, మిగిలిన వస్త్రాలతో బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ తయారు చేస్తారు. ఈ రెండు కేంద్రాల ద్వారా సుమారు 950 మందికి ప్రత్యక్షంగా, సప్లై చైన్, లాజిస్టిక్స్, అనుబంధ సేవల విభాగాల్లో మరో 100 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా నమస్తే వరల్డ్ వ్యవస్థాపకురాలు, సీఈవో భూమా మౌనికా మంచు మాట్లాడుతూ, "భారతదేశపు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయ హస్తకళలను ఆధునిక, అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలుగా తీర్చిదిద్దడమే నమస్తే వరల్డ్ లక్ష్యం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక ఆలోచనను కార్యాచరణలోకి తీసుకురావడంలో పరిపాలన, ప్రభుత్వ సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో నేను దగ్గరగా చూశాను. హస్తకళాకారులకు సాధికారత కల్పించడం, సుస్థిరమైన తయారీ అవకాశాలను సృష్టించడం, ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి, బొమ్మలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగు. ఆర్థిక, సామాజిక ప్రభావం చూపేలా దీనిని నిర్మించేందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. మాకు ఇప్పటికే రిలయన్స్ బ్రాండ్స్‌తో రిటైల్ భాగస్వామ్యం ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా భాగస్వాములయ్యాము" అని తెలిపారు.
నమస్తే వరల్డ్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మంచు మనోజ్ మాట్లాడుతూ, "సంస్కృతిని ప్రభావితం చేయడానికి, సమాజాలను ఏకం చేయడానికి, ఆశయాలను సృష్టించడానికి సినిమా, వినోద రంగాలకు ఎప్పుడూ శక్తి ఉంటుంది. సృజనాత్మక పరిశ్రమలు కేవలం కథలు చెప్పడానికే పరిమితం కాకుండా, ఆర్థిక అవకాశాలను సృష్టించే శక్తివంతమైన ఇంజిన్లుగా మారగలవని నేను నమ్ముతున్నాను. నమస్తే వరల్డ్ ద్వారా సృజనాత్మకత, సాంకేతికత, వినోద రంగాలు సంప్రదాయ పరిశ్రమలకు ఎలా అండగా నిలవగలవో, కొత్త జీవనోపాధులను ఎలా సృష్టించగలవో అన్వేషించాలనుకుంటున్నాము. మన దేశ సాంస్కృతిక బలాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేస్తూ, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్'కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలలో ఏఐ (AI), రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలను కూడా సంప్రదిస్తున్నాము" అని పేర్కొన్నారు.
ఈ సదస్సులో నమస్తే వరల్డ్ ప్రతినిధులు తమ బొమ్మల కలెక్షన్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌కు అందజేశారు. అనంతరం ఆయన సంస్థ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, "భారతీయ మూలాలను తీసుకుని ప్రపంచానికి నచ్చే రీతిలో ఆవిష్కరించే నమస్తే వరల్డ్ 'గ్లోకల్' (Glocal) విధానాన్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా 'నమస్తే వరల్డ్' అనే బ్రాండ్ పేరు, మన దేశీయ బొమ్మల కథనాల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించాలనే వారి ఆలోచన నాకు ఎంతగానో నచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ గుర్తింపును చాటే రాయబారులుగా మారే అపారమైన శక్తి మన సంప్రదాయ బొమ్మలకు, సాంస్కృతిక కథనాలకు ఉంది" అన్నారు.
ఈ కార్యక్రమాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతించారు.
· కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు: "మన హస్తకళాకారులు భారతదేశ అద్భుత సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు. వారికి మరింత బలమైన వేదికలు, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. స్థానిక కళాకారుల కోసం ఒక వ్యవస్థీకృత వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నమస్తే వరల్డ్ వంటి సంస్థలు వారి నైపుణ్యాన్ని పెద్ద అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ఆసక్తికరమైన విధానాన్ని అందిస్తున్నాయి. మన స్థానిక ప్రతిభకు తగిన గుర్తింపు, మార్కెట్లు లభించేలా మనం కృషి చేయాలి."
· ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్: "అర్థవంతమైన ఉపాధిని సృష్టించే, స్థానిక పరిశ్రమలను బలోపేతం చేసే, మన సంప్రదాయ రంగాల సామర్థ్యాన్ని వెలికితీసే పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఉంది. రాష్ట్రాన్ని సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ గమ్యస్థానంగా నిలపాలనే మా లక్ష్యానికి నమస్తే వరల్డ్ చొరవ అనుగుణంగా ఉంది. మనోజ్, మౌనిక వంటి యువ పారిశ్రామికవేత్తలు సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాలో భాగస్వాములై అభివృద్ధి చెందాలని మేము ఆహ్వానిస్తున్నాము."
· ఏపీఈడీబీ (APEDB) సీఈవో సాగిలి షణ్మోహన్, ఐఏఎస్: "ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ఉపాధి కల్పన కలగలిసిన పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నమస్తే వరల్డ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక కళాకారులు, పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర తయారీ రంగానికి కొత్త మార్గాలను తెరుస్తుంది."
· ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, ఐఏఎస్: "భారతదేశ చేనేత, జౌళి సంప్రదాయాలు మన సాంస్కృతిక, ఆర్థిక గుర్తింపులో విలువైన భాగం. నమస్తే వరల్డ్ వంటి కార్యక్రమాలు మన చేనేత కార్మిక సంఘాలను ఆధునిక మార్కెట్లు, డిజైన్ ఆవిష్కరణలు, సుస్థిర తయారీ పద్ధతులతో అనుసంధానించడానికి దోహదపడతాయి. సంప్రదాయ నైపుణ్యాలను కాపాడుతూనే, రాబోయే తరానికి వాణిజ్యపరంగా లాభదాయకమైన అవకాశాలను సృష్టించడంపై మనం దృష్టి పెట్టాలి."
· ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్: "కళ, సంస్కృతి, సాంకేతికతను ఏకతాటిపైకి తీసుకువచ్చే నమస్తే వరల్డ్ విధానం నాకు ప్రత్యేకంగా నచ్చింది. మన సంప్రదాయ కళారూపాలకు, దేశీయ హస్తకళలకు అపారమైన శక్తి ఉంది. వాటిని సంరక్షించడంలో, ప్రోత్సహించడంలో, కొత్త తరం ప్రేక్షకులకు చేరువ చేయడంలో సాంకేతికత విప్లవాత్మక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మన సాంస్కృతిక మూలాలకు, భవిష్యత్ అవకాశాలకు మధ్య ఒక అద్భుతమైన వారధిని నిర్మిస్తాయి."
పర్యాటక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు 2026, అక్టోబర్ 26న తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB)తో నమస్తే వరల్డ్ కుదుర్చుకున్న ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఎంవోయూ జరిగింది. సంప్రదాయ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల ఆధారంగా క్యారెక్టర్లు, లఘు చిత్రాలు, క్యూఆర్ (QR) ఆధారిత అనుభవాలను రూపొందించి, రాష్ట్ర హస్తకళా వారసత్వాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంపై ఆ మూడేళ్ల ఒప్పందం దృష్టి సారిస్తుంది.
ప్రారంభమైనప్పటి నుండి నమస్తే వరల్డ్ 55కు పైగా ఒరిజినల్ ప్లష్ డిజైన్లను రూపొందించి, 43,000కు పైగా బిఐఎస్ (BIS) ధృవీకరించిన బొమ్మలను విక్రయించింది. తద్వారా భారతదేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవడంతో పాటు విదేశాల్లోని ప్రవాస భారతీయుల ఆదరణను కూడా చూరగొంటోంది.
నమస్తే వరల్డ్ గురించి: 'నమస్తే వరల్డ్' అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సెల్ఫ్-ఫండెడ్ స్టోరీటెల్లింగ్ స్టార్టప్. పిల్లల కోసం రూపొందించిన బొమ్మలు, పాత్రలు, వినూత్న ఉత్పత్తుల ద్వారా భారతీయ కళ, హస్తకళ, వారసత్వం, సంస్కృతికి జీవం పోస్తోంది. "సెలబ్రేటింగ్ కిడ్స్" (Celebrating Kids) అనే ట్యాగ్‌లైన్‌తో, ఆటలు, కథల ద్వారా భారత సాంస్కృతిక గుర్తింపుకు, రాబోయే తరానికి మధ్య అర్థవంతమైన అనుబంధాన్ని ఏర్పరచాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 'నమస్తే వరల్డ్' అనేది నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క బ్రాండ్. ఇది సాంస్కృతిక మూలాలు కలిగిన పిల్లల ఉత్పత్తులు, ఒరిజినల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ (IPs), యువతను ఆకట్టుకునే అనుభవాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థను నిర్మిస్తోంది.
ఫోటో క్యాప్షన్స్:
· ఫోటో 1: విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో నమస్తే వరల్డ్ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్.
· ఫోటో 2: విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ (MoU) సంతకాల కార్యక్రమంలో నమస్తే వరల్డ్ వ్యవస్థాపకురాలు, సీఈవో భూమా మౌనికా మంచు, సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మంచు మనోజ్.