pizza

Mittapalli Surender about Maremma
'మారెమ్మ' కథ ఎమోషనల్ గా కదిలించింది. సినిమా, పాటలు అద్భుతంగా వచ్చాయి. కర్ణి పాత్రలో మాధవ్ ఒదిగిపోయారు. సినిమా అందరికీ నచ్చుతుంది: లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్

You are at idlebrain.com > news today >

09 July 2026
Hyderabad

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, 'బావ బావ', మారి సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సినిమాలో వచ్చిన మొదటి అవకాశం గురించి?
'ధైర్యం' సినిమాకు తొలిసారి పాట రాశాను. ఆ తర్వాత 'రాజన్న'లో 'కాలిగజ్జె ఘల్లుమంటే', 'జార్జ్ రెడ్డి'లో 'వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్', 'లవ్ స్టోరీ'లో 'నీ చిత్రం చూసి', 'రాజు వెడ్స్ రాంబాయి'లో రాసిన పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఆ సినిమాలోని పాట నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.

మారెమ్మలో రాసిన 'మారి' పాట గురించి?
'మారి' అనేది సినిమాలో హీరో ఆడుకునే దూడ పేరు. ఇలాంటి పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం. ఒక దూడ చుట్టూ ఎమోషన్, రిలేషన్‌ను ప్రజెంట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట రాస్తున్నప్పుడు నా బాల్యం గుర్తుకు వచ్చింది. 'బొబ్బిలి రాజా' సినిమాలోని బసవన్న పాటలా ఒక ల్యాండ్‌మార్క్ పాట రాయాలనే సంకల్పంతో ఈ పాట రాశాను.

దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఆయనతో పాటు నేను కూడా ఏడ్చేశాను. అంతలా ఆ కథ నన్ను కదిలించింది. మొదట ఒక పాట కోసం పిలిచి, తర్వాత అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటే, అందులో నాలుగు పాటలు నేను రాశాను. అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి.

ఈ మధ్యకాలంలో రాసిన పాటల గురించి?
'పెద్ది' సినిమాలో రెండు పాటలు రాశాను. ఢిల్లీ ఎపిసోడ్‌లో వచ్చే 'అలసిపోవద్దురా పెద్ది', అలాగే పెద్ది ట్రైన్‌లో తిరిగి వస్తున్నప్పుడు వచ్చే 'అనగనగా' పాట, జగపతిబాబు గారి ఎపిసోడ్‌లో వచ్చే 'ఆగిన శ్వాసలో ఆశయం ఉంది' పాటలు రాశాను. అవన్నీ కథకు ఆయువుపట్టులాంటి పాటలు. థియేటర్‌లో ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి.

రవితేజ గారిని కలిశారా?
ఈ సినిమా కోసం కాదు. 'చోర్ బజార్' సినిమాకు పాట రాసినప్పుడు ఆ సినిమాలోని పాటను రవితేజ గారు లాంచ్ చేశారు. ఆ సందర్భంగా ఆయనను కలిశాను.

మారెమ్మ రషెస్ చూశారా?
-నేను కథ మొత్తం చదివాను. కథ చదివినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయ్యానో, అదే ఎమోషన్ స్క్రీన్‌పైకి వచ్చింది. దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. మాధవ్ కర్ణి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై మాధవ్ కాదు, కర్ణి మాత్రమే కనిపిస్తాడు.

నిర్మాత గురించి?
-మయూర్ గారు తొలిసారి నిర్మాత అయినప్పటికీ ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. ఆయనకు సినిమా అంటే చాలా ప్యాషన్ ఉంది. నేను లొకేషన్‌లో ఉంటే సాహిత్యం మరింత సహజంగా వస్తుందని భావించి, నన్ను లొకేషన్ రెక్కీకి కూడా పంపించారు.

దర్శకుడు గురించి?
దర్శకుడు చాలా టాలెంటెడ్. ప్రతి పాటను దగ్గరుండి రాయించారు. ఆయనకు ప్రతి విషయంలో మంచి ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. సాహిత్యం మీద కూడా మంచి పట్టు ఉంది.

మీ స్ఫూర్తి?
సినీ పరిశ్రమలో వేటూరి గారు, చంద్రబోస్ గారు నాకు స్ఫూర్తి.

మీకు ఎలాంటి పాటలు రాయాలని ఉంది?
నేను ఏ పాట రాసినా నా కుటుంబం మొత్తం కలిసి వినేలా ఉండాలి. అలాంటి పాటలే రాయాలని ఇష్టపడతాను.

సంగీతం చేయాలనే ఆలోచన ఉందా?
లేదు. రెండు పడవల ప్రయాణం చేయను. ప్రస్తుతం సినిమా పాటలు రాయడానికే పూర్తి సమయాన్ని కేటాయించాను.

ఇప్పుడు రాస్తున్న సినిమాల గురించి?
ప్రస్తుతం దాదాపు పది సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఇడుపుకాయితం, జిల్లేడు చెట్టు, దేత్తడి, డేవిడ్ రెడ్డి ఇలా పలు సినిమాలకు రాస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved