pizza

Hudiyo song promo from Mass Jathara
'మాస్ జాతర' నుండి ఓ క్లాస్ సాంగ్.. విడుదలైన 'హుడియో హుడియో' ప్రోమో

You are at idlebrain.com > news today >

06 October 2025
Hyderabad

విడుదల దగ్గర పడుతుండటంతో 'మాస్ జాతర' అప్డేట్స్ ఒక్కొక్కటీ బయటకు వదులుతుంది ఆ చిత్ర యూనిట్. తాజాగా ఓ క్లాస్ మెలోడీ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో ఈ నెల 8 న విడుదలకాబోతుంది.

" నా గుండె గాలిపటమల్లె ఎగరేసావే.. నీ సుట్టూ పక్కల తిరిగేలా గిరిగీసావే.. నా కంటి రెమ్మల్లో కలలకు ఎర వేసావే.. నీ కంటి చూపుల్తో కలలను ఉరి తీసావే.. " అంటూ సాగిన లిరిక్స్ ఎంతో వినసొంపుగా ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా శ్రీలీల మెరవబోతున్నారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శక్వతం వహించగా, సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved