pizza

After Evvarikee Cheppoddu & Pekamedalu - Crazy Ants Productions & Rakesh Varre bringing a Unique & Twisted Love Story MAYA LADY Glimpse Out Now
యంగ్ టాలెంటెడ్ హీరో రాకేష్ వర్రే "మాయలేడి" మూవీ గ్లింప్స్ రిలీజ్

You are at idlebrain.com > news today >

03 August 2026
Hyderabad

Known for delivering fresh, content-driven cinema like Evvarikee Cheppoddu and Pekamedalu, actor-producer Rakesh Varre and his banner Crazy Ants Productions have carved a distinct niche for themselves in Telugu cinema. As a passionate producer with impeccable taste and an actor known for choosing meaningful, intriguing scripts, Rakesh Varre has once again proven his commitment to bringing original storytelling to the big screen with his latest venture, Maya Lady.

The newly unveiled glimpse of Maya Lady promises a romantic entertainer like no other. At first glance, it feels like a sweet, cute love story, but it quickly shifts gears into a fun and emotional roller-coaster packed with an interesting twist. The glimpse begins with Rakesh Varre talking to his mother about a special girl, who he is slowly falling in love with by knowing her more.

The narrative cleverly flips typical tropes on their head, turning the heroine as a villain with her obsession. With a seamless blend of heartwarming emotion, and beautiful love moments, the film promises a complete and rich theatrical experience. Madhumita Sarcar looks adorable, and her character twist is going to be one of the major highlights. Rakesh Varre brings another interesting concept as a producer and hero.

Visually, the glimpse impresses with rich production values and sharp cinematography, setting an authentic yet captivating atmosphere. Adding soul to every frame is Vishal Chandrasekhar’s mesmerizing and soothing musical score. Following his iconic work in films like Sita Ramam and many other blockbusters, Vishal Chandrasekhar delivers once again, elevating the emotional intensity and creating an instant impact.

Starring Rakesh Varre and Madhumita Sarcar in the lead roles, Maya Lady is written and directed by Prasankar. The film is presented by V D Jagan Mohan Rao and produced by Rakesh Varre under the esteemed Crazy Ants Productions banner. With the team aiming for a major Monsoon 2026 theatrical release, Maya Lady is gearing up to be the ultimate romantic entertainer with a twist.

Cast: Rakesh Varre, Madhumita Sarcar, Satya, Indraja, Mysore Suresh

Technical crew:
Banner: Crazy Ants Productions
Producer: Rakesh Varre
Writer & Director: Prasankar
Music Director: Vishal Chandrashekhar
Dop: Yedhu Radhakrishnan
Editor: Raviteja Girijala
Production Designer: Latha Naidu
Art Director - Bhargav
Co - Producer: Varun Bora , Vijithendra Bommagouni
Presented by : V D Jagan Mohan Rao

యంగ్ టాలెంటెడ్ హీరో రాకేష్ వర్రే "మాయలేడి" మూవీ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే "మాయలేడి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు "మాయలేడి" సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - 'హీరోయిన్ గురించి తెలుసుకున్నా కొద్దీ ఆమె పట్ల హీరోలో మరింత ఆసక్తి పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి గురించి తెలిసే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ జంట లవ్ ప్రపోజ్ చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో హీరోయిన్ గురించి కొత్త కొత్త విషయాలు తెసుకుంటాడు హీరో. 'తమ మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోనంటూ..' హీరోయిన్ యాక్షన్ తో సత్తా చూపిస్తుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసి తమ శత్రువులతో ఫైట్ చేయడం గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. గ్లింప్స్ చివరలో హీరో చెప్పిన 'ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది..' అనే డైలాగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ లో హీరో రాకేష్ వర్రే ఫ్రెష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. లవ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన పర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. హీరోగా, ప్రొడ్యూసర్ గా రాకేష్ వర్రేకు ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ మూవీ కాబోతుందనే అంచనాలు గ్లింప్స్ తో ఏర్పడుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన 'నిన్ను చూసినాక ఈ క్షణం..' పాట గ్లింప్స్ ఫీల్ ను మరింత పెంచింది. మొత్తంగా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను గ్లింప్స్ క్రియేట్ చేసింది.

నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు

టెక్నీషియన్స్

మ్యూజిక్ - విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ - క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ - రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ - ప్రశంకర్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved