pizza

Idlebrain’s #DecodeMayasabha Giveaway Contest 1 Reflects Telugu Sentiments!
తెలుగు వారి మనోభావాలకు అద్దం పడుతున్న ఐడిల్ బ్రెయిన్ #DecodeMayasabha గివ్ అవే కంటెస్ట్ 1!

You are at idlebrain.com > news today >

18 July 2025
Hyderabad

The teaser of Mayasabha, written and directed by Deva Katta, which is set to stream on SonyLIV from August 7, has become a hot topic on social media. Despite the makers repeatedly clarifying that it’s purely fictional, the series appears to portray the story of united Andhra Pradesh, revolving around the friendship and rivalry of two prominent political leaders.

Anticipating the storm this series will create among Telugu audiences, Idlebrain launched a first-of-its-kind giveaway contest that mirrors the sentiments of the people. For the first question, viewers were asked to guess which real-life personality Chaitanya Rao’s character resembles and give a creative reply. Winners would be chosen based on creativity.

Here’s a snapshot of the most interesting responses reflecting the emotions of Telugu audiences:

“Deva Katta says it’s fiction, but we know the real leaders behind this imagination, sir!”

“Pulicherla means Pulivendula, sir!”

“You can change the name, but can you change the vibe, Deva?”

“This isn’t just resemblance… it’s a reincarnation!”

“This isn’t a biopic of politicians… it’s a thermometer checking people’s emotional temperature!”

“Mayasabha – not Rise of the Titans, sir… it’s Rise of the Twitter Titans!” 😄

Finally, the “Twitter Sabha” declared: “This is our YS Rajanna!”

Now, all eyes are on how writer-director Deva Katta will respond to these observations and interpretations!

Here is the list of winners

తెలుగు వారి మనోభావాలకు అద్దం పడుతున్న ఐడిల్ బ్రెయిన్ #DecodeMayasabha గివ్ అవే కంటెస్ట్ 1!

దేవ కట్ట రచన దర్శకత్వంలో సోనీలివ్ ప్లాట్ఫాం లో ఆగస్ట్ 7 వ తారీకున స్ట్రీమ్ కానున్న మయసభ టీజర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దర్శక నిర్మాతలు ఇది కేవలం కల్పితం అని ఎంత కొట్టి పారేసినా, ఈ సిరీస్ ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల స్నేహం, వైరుధ్యం నేపథ్యంలో ఆవిష్కరించిన యునైటెడ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కథలా కనిపిస్తోంది. ఈ సిరీస్ తెలుగు ప్రజల్లో పెద్ద చర్చ కాబోతుందని గ్రహించి, వారి మనోభావాలకు అద్దం పట్టే విధంగా, ఐడిల్ బ్రెయిన్ ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గివ్ అవే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. కాంటెస్ట్ లో మొదటి ప్రశ్నగా టీజర్ పరిశీలించిన వ్యూయర్స్ చైతన్య రావు పోషించిన పాత్ర నిజ జీవతంలో ఎవరిని పోలి ఉందో గెస్ చేసి, క్రియేటివ్ గా రిప్లై ఇచ్చిన వారిని విజేతలుగా ఎన్నుకొంటామని ప్రకటించాం. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజల మనోభావాలకి అద్దం పడుతోన్న ఈ కాంటెస్ట్ మొదటి ప్రశ్న సమాధానాలు ఓవరాల్ గా ఇలా ఉన్నాయ్.

• "ఇది కల్పితం" అని దేవ కట్టా చెప్పినా…ఈ కల్పన వెనక కదులుతున్న అసలు నాయకులు మాకు తెలుసు సార్!" అంటూ కామెంట్లతో “మాయ” గుట్టుని విప్పేశారు!
• "పులిచర్ల అంటే పులివెందులే సార్!"
• “పేరు మార్చినా ఫేస్‌కి ఫీలింగ్ మారదుగా దేవా?”
• “ఈ పాత్ర కేవలం పోలిక కాదు… పునరావృతం!”
• "ఇది రాజకీయ నాయకుల బయోపిక్ కాదు... ప్రజల మనోభావాల టెంపరేచర్ చెక్ చేసే థర్మామీటర్!"
• మయసభ – Rise of the Titans కాదు సార్…Rise of the Twitter Titans! 😄
• చివరికి “ట్విట్టర్ సభ” “ఇది మా వైయస్ రాజన్నే!” అని తేల్చేసింది! ఈ సమాధానాల మీద, మనో భావాల మీద రైటర్ డైరెక్టర్ దేవ కట్టా ఏం సమాధానమిస్తారో వేచి చూడాలి.

ఐడిల్ బ్రెయిన్ గివ్ అవే విజేతలు వీరే

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved