pizza

SAMANTHA SCRIPTS HISTORY AT THE BOX OFFICE AS MAA INTI BANGAARAM ENTERS THE 100 CRORE CLUB
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’.. బాక్సాఫీస్ వ‌ద్ద హిస్ట‌రీ క్రియేట్ చేసిన స‌మంత‌

You are at idlebrain.com > news today >

12 July 2026
Hyderabad

Last week, Samantha’s action family drama became the highest-grossing woman-led Telugu film of all time. And now Maa Inti Bangaaram has officially crossed the ₹100 crore mark at the worldwide box office, cementing its place as one of the biggest commercial successes in the history of women-led Indian cinema with a recovery of more than 300% on its budget.

MiB has created history by becoming the first female-led Telugu film to cross the coveted 100cr gross mark, surpassing many collection records on its way including the highest overseas collections for a female- led film, exceeding $2.5 Million. MiB also makes it to No 6 amongst India's Highest Grossing Solo Female Led Indian Films.

Maa Inti Bangaram is the brain child of Raj K Nidimoru, who created and crafted it in collaboration with BV Nandini Reddy. The movie is produced by Raj, Samantha and Himank Reddy Duvuru under their production house, Tralala Moving Pictures. It was released on June 19, 2026, simultaneously in Telugu and Tamil (as Engal Thangam). Gulshan Devaiah, Diganth Manchale, Gautami, Sreemukhi and Anand feature in prominent roles in the film.

The film became a phenomenon and in a rare feat, women of all ages flocked to the theaters and embraced it unanimously. They praised Samantha’s performance and the picture perfect cast. The film was also praised for the situational comedy and the spectacularly natural action sequences.

“This isn’t just a number for us!” said Samantha. “Maa Inti Bangaaram proves that audiences across languages are ready to back a story led entirely by a woman.”

Creator & producer Raj said, “Finally, I got to make a Telugu film and I’m truly overwhelmed by the love and support it has received. I’m so grateful that audiences have embraced it as their own."

Producer Himank of Tralala Moving Pictures added: ₹100 crore for a woman-led film is a milestone for the industry. Maa Inti Bangaaram will be a movie that will be a case study in its making and exploitation for the industry."

Maa Inti Bangaaram continues its glorious theatrical run across India and overseas markets.

About Maa Inti Bangaaram:
A 2026 Telugu-language action-comedy family drama, created by Raj K Nidimoru, written by Vasanth Maringanti and Raj, directed by B. V. Nandini Reddy, edited by Dharmendra Kakarala, music by Santhosh Narayanan, creative supervision by Sita R Menon, produced by Raj, Samantha and Himank under Tralala Moving Pictures. Released simultaneously in Telugu and Tamil on June 19, 2026, starring Samantha, Gulshan Devaiah, Diganth Manchale, Gautami, Sreemukhi and Anand.

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’.. బాక్సాఫీస్ వ‌ద్ద హిస్ట‌రీ క్రియేట్ చేసిన స‌మంత‌

రీసెంట్‌గా సమంత ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. భారతీయ సినిమా చరిత్రలోనే రూపొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఈ చిత్రం తన బడ్జెట్‌పై 300 శాతం పైగా రికవరీ సాధించడం విశేషం.

తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్ దాటి అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తన ప్రయాణంలో ఎన్నో కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. మహిళా ప్రధాన సినిమాల్లోనే $2.5 మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌తో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మహిళా ప్రధాన చిత్రాల్లో మా ఇంటి బంగారం 6వ స్థానాన్ని దక్కించుకుంది.

‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ కె నిడిమోరు ఆలోచ‌న‌ ప్రధాన బలం. ఆయన డైరెక్ట‌ర్ బీవీ నందిని రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. రాజ్, సమంత, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు క‌లిసి స్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2026 జూన్ 19న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. తమిళంలో ఎంగళ్ తంగం పేరుతో రిలీజైంది. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అరుదైన రీతిలో అన్ని వయస్సుల మహిళలు, ప్రేక్ష‌కులు థియేటర్లకు తరలివచ్చి ఈ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ చేశారు. సమంత నటనతో పాటు, పర్ఫెక్ట్‌గా సెట్ అయిన నటీనటుల, సాంకేతిక నిపుణుల ప‌నితీరుపై ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ చిత్రం సిట్యుయేషనల్ కామెడీతో పాటు సహజంగా కనిపించే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు కూడా ప్రత్యేక ప్రశంసలను అందుకుంది.

“ఇది మాకు కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు!” అని సమంత అన్నారు. “మా ఇంటి బంగారం సినిమా ద్వారా భాషతో సంబంధం లేకుండా, పూర్తిగా మహిళా ప్రధానంగా నడిచే కథలను ప్రేక్షకులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి ప్రూవ్ అయ్యింది” అన్నారు. క్రియేటర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు మాట్లాడుతూ “చివరికి నేను ఒక తెలుగు సినిమా చేశాను. ఈ సినిమాకు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ చూసి ఆనందంలో మునిగిపోయాను. ఈ సినిమాను తమదిగా స్వీకరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌కు చెందిన నిర్మాత హిమాంక్‌ మాట్లాడుతూ “మహిళా ప్రధాన చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం పరిశ్రమకు ఒక మైలురాయి. మా ఇంటి బంగారం అనౌన్స్‌మెంట్‌ నుంచి విడుదల వరకు ప్రతి దశలోనూ పరిశ్రమకు ఒక కేస్ స్టడీగా నిలిచే చిత్రం అవుతుంది” అన్నారు.

‘మా ఇంటి బంగారం’ సినిమా ఇక్క‌డే కాకుండా ఓవ‌ర్సీస్‌లోనూ స‌క్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తోంది.

‘మా ఇంటి బంగారం’ గురించి...

2026లో విడుదలైన ఈ తెలుగు యాక్షన్-కామెడీ ఫ్యామిలీ డ్రామాను రాజ్ కె నిడిమోరు క్రియేట్ చేశారు. వసంత్ మారింగంటి, రాజ్ కలిసి కథను అందించగా.. సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్ విజన్ అందించారు. బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌. రాజ్, సమంత, హిమాంక్‌ కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 2026 జూన్ 19న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించగా, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved