pizza

‘Mirai’ storms past ₹112 Cr in just one week…
వారంలోనే 112 కోట్లు దాటి దూసుకుపోతున్న 'మిరాయ్'....

You are at idlebrain.com > news today >

19 September 2025
Hyderabad

Mirai is setting the box office on fire. Starring Teja Sajja as the hero and Manchu Manoj in the antagonist role, the film is produced by People Media Factory and directed by Karthik Gattamneni. Within just five days of release, Mirai crossed the ₹100 crore mark, and as the first week came to a close, the film grossed ₹112 Cr worldwide, according to an official announcement by People Media.

With that, Mirai has become another ₹100 crore film for Teja Sajja, following HanuMan.

From the beginning, the film has generated strong buzz among audiences. It is also raking in massive collections overseas. The film unit’s well-planned promotional strategy right from the start has played a crucial role in the film’s success.

As part of promotions, Teja Sajja will be traveling abroad, the team has announced. He is scheduled to tour Seattle, Dallas, and New Jersey over the weekend.

వారంలోనే 112 కోట్లు దాటి దూసుకుపోతున్న 'మిరాయ్'....

'మిరాయ్' బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' నిర్మించగా, ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడం జరిగింది. విడుదలైన అయిదు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం పూర్తయ్యేసరికి 112 కోట్ల గ్రాస్ సాధించినట్టు పీపుల్ మీడియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాంతో 'హనుమాన్' తరువాత మరో వంద కోట్లు దాటిన సినిమాగా తేజా జాబితాలో ఇంకో సినిమా చేరినట్టయింది.

ఈ సినిమాకు మొదటి నుండే ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ కలక్షన్లు సాధిస్తుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ల విషయంలో మొదటి నుండీ చక్కటి ప్రణాళికతోనే వెళ్తుండటం కూడా ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిందనే చెప్పుకోవచ్చు. ప్రమోషన్లో భాగంగా హీరో తేజ సజ్జా విదేశాలకు వెళ్ళబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వీకెండ్ మొత్తం సియాటెల్, డల్లాస్ మరియు న్యూ జెర్సీ లో పర్యటించనున్నారు తేజ సజ్జా.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved