pizza

Gowra Hari about Mirai success
మిరాయ్ ఘన విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. థియేటర్స్‌లో ఆడియన్స్ మ్యూజిక్‌కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి

You are at idlebrain.com > news today >

15 September 2025
Hyderabad


సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

హనుమాన్, మిరాయ్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
- చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు సినిమా కోసం పడ్డ కష్టం మర్చిపోతాం. మా నిర్మాత, దర్శకుడు, హీరో, టీమ్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.

ఈ సినిమా కోసం మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
- చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. అందరికీ మ్యూజిక్ చాలా నచ్చింది. ఆడియన్స్ థియేటర్‌లో గ్రేట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మీకు ఈ సినిమాలో మ్యూజిక్ చేయడానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిన క్యారెక్టర్ ఏమిటి?
- ప్రతి పాత్రకి వెయిటేజ్ ఉంది. ప్రతి పాత్ర గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి ఇన్‌స్పైర్ చేసింది.

- ఇందులో మిరాయ్ ఆయుధానికి లార్డ్ శివ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బిజి) ఉపయోగించడం జరిగింది. శ్రీ రాములవారి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆస్ఫూర్తితో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయడం జరిగింది.

స్టోరీని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్కోర్ కూడా రాయడం జరిగింది. ఈ సినిమా రాములవారి పోర్షన్ చేయడానికి దాదాపు 10 డేస్ పట్టింది. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడానికి టైమ్ పట్టింది.

ఈ సినిమా కోసం రకరకాల జానర్స్‌ని వాడడం జరిగింది. ఇంటర్వల్ బ్యాంగ్‌లో నాలుగు జానర్స్‌లో సౌండ్‌ని మిక్స్ చేసి ప్రెజెంట్ చేసే అవకాశం రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది

వైబ్ వుంది సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.. అది సినిమాలో లేకపోవడం మిమ్మల్ని నిరాశపరిచిందా?

లేదు. అది అంతా టీమ్ డెసిషన్. సినిమాకి ఏది అవసరమో అది చేయడమే కరెక్ట్. మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం అది.

నిజానికి చాలా పెద్ద కథ ఇది. ఒక పార్ట్‌గా చెప్పడం చాలా చాలెంజ్. కానీ కార్తీక్ గారు చాలా అద్భుతంగా సినిమాని ప్రెజెంట్ చేశారు. ఆ సాంగ్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుంటే ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది. దీంతో ఆ నిర్ణయం తీసుకున్నాం.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని కీరవాణి గారితో పోల్చుతూ కొన్ని కాంప్లిమెంట్స్ వినిపించడం ఎలా అనిపించింది?
- కీరవాణి గారు లాంటి లెజెండరీ కంపోజర్‌తో పోల్చడం నాకు ఒక భయాన్ని తీసుకొస్తుంది. భవిష్యత్తులో తెలిసో తెలియక ఏదో ఒక చిన్న తప్పు చేసిన అది నాకు పెద్ద అపవాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆయనతో పోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ అదే సమయంలో భయాన్ని కూడా ఇస్తుంది.

మీ జర్నీ ఇప్పటివరకు ఎలా అనిపించింది?
- నమ్మకాన్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో చాలా టైమ్ పట్టింది. కన్నడలో చార్మినార్‌తో మంచి హిట్ వచ్చింది. అయితే తెలుగులో ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన అలంటి సినిమాలు చేశాను.

ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ పూలమ్మె పిల్ల సాంగ్ ఇచ్చాను. ఆయనకి నచ్చింది. తర్వాత ఆయన సినిమా చూపించారు. నేను చేసిన స్కోర్ చాలా నచ్చింది. ఆ సినిమా విజయం గొప్ప నమ్మకాన్ని ఇచ్చింది.

తేజ గారు మళ్లీ మిరాయ్ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ మొత్తం జర్నీలో మెల్లమెల్లగా నమ్మకాన్ని బిల్డ్ చేసుకుని రావడం ఆనందాన్ని ఇచ్చింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved