pizza

Director Karthik Gattamneni about Mirai
'మిరాయ్‌' అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చింది. ఇది మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్. తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని

You are at idlebrain.com > news today >

6 September 2025
Hyderabad

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మిరాయ్ స్టోరీ ఐడియా ఎప్పుడు జనరేట్ అయింది? మిరాయ్ కథ ఎలా వుండబోతోంది ?
-ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టొచ్చనే ప్రాసెస్ కి చాలా టైం పట్టింది.

-చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, పాషనేటింగ్ ఎలిమెంట్స్ తో మిరాయ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మన రూటేడ్ కథలా వుంటుంది. ఆడియన్స్ అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఉంటుంది.

-అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయానే ఒక మిత్ వుంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది మిరాయ్ ఐడియా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో పురాణాల్లో వుందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వంచర్ గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్. ఈ కథ దాదాపు ప్రజెంట్ లోనే జరుగుతుంది.

మీరు డీవోపీ కావడం వలనే ఇంత పెద్ద కాన్వాస్ లో చేయగలిగారా?
-ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు యాంబిషన్ పెద్దదని తెలుసు. ఈ సినిమా చేసిన ప్రాసస్ డిఫరెంట్. నటీనటులందరినీ రియల్ లోకేషన్స్ లోకి తీసుకెళ్ళాం. మంచు పర్వతాల్లో , ఎడారుల్లో, అడవుల్లో .. అన్నిట్లో రియల్ గా చేశాం. మొత్తం షూటింగ్ లో ఒక్క సీనియర్ యాక్టర్ కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన ఈ సినిమాకి అంత అద్భుతంగా కుదిరింది.

-శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయిలాండ్.. మొత్తం ఏసియా అంతా తిరిగేశాం.

యాక్షన్ బ్లాక్స్ గురించి ?
-ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. ఇందులో ఫాస్ట్ యాక్షన్ ని ట్రై చేశాం.
- తేజ ఈ సినిమా కోసం థాయిలాండ్ లో ప్రత్యేకం శిక్షణ తీసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.

తేజకి హనుమాన్ తర్వాత ఈ సినిమా వస్తుంది కదా.. ఒత్తిడికి లోనయ్యరా?
-లేదండి. రెండు కథలు వేరు. మిరాయ్ ని ఎంత అద్భుతంగా తీయాలనేది అలోచించాను.

మంచు మనోజ్ గారిని తీసుకోవడానికి కారణం?
-పాజిటివ్ సైడ్ ఉంటూ నేచురల్ అగ్రేషన్ ఉన్న ఒక యాక్టర్ కావాలి. మనోజ్ గారు కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ కి ఫిట్ అవుతారు. మనోజ్ గారికి మార్షల్ ఆర్ట్స్ లో కూడా అనుభవం వుంది. అది మాకు హెల్ప్ అయ్యింది.

శ్రియా గారిని ఎంపిక చేయడానికి కారణం ?
-వనరబుల్ గా ఉంటూ అదే సమయంలో స్ట్రెంత్ గా కూడా కనిపించే ఒక పాత్ర కావాలి. ఆలాంటి పాత్రకి శ్రీయా గారు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారనిపించి చేశాం. తల్లి కొడుకుల ఎమోషన్ ఈ సినిమాకి చాలా కీలకం. శ్రియాగారు అద్భుతంగా చేశారు.

వీఎఫ్ఎక్స్ గురించి ?
మా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియానే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేయడంతో మాకు చాలా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా కావాల్సినంత సమయం, మనీ.. రెండూ ఖర్చు చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.

-బడ్జెట్ మేము అనుకున్న దానికంటే కొంచెం క్రాస్ అయ్యింది. నిర్మాత విశ్వప్రసాద్ గారు మా విజన్ పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఆయన పాషన్ తోనే సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

ఇందులో జటాయువు పాత్ర వుంటుందా?
- అజటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం, అది చాలా సర్ ప్రైజ్ గా వుంటుంది. దీనికోసం యానిమేట్రానిక్ టెక్నాలజీ ఉపయోగించాం.

సినిమా అవుట్ ఫుట్ చూసుకున్నాక ఎలా అనిపించింది?
- మేము అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చిందని ఫీలింగ్ కలిగింది. ఇందులో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది. అది పేపర్ మీద చూసుకున్నప్పుడు నిజంగా ఎలా అవుతుందా అనిపించింది. శ్రీలంకలో షూట్ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది, ఆడియన్స్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. ప్రతి సీక్వెన్స్ కూడా మేము అనుకున్న దాని కంటే చాలా బెటర్ గా వచ్చింది. ఈ సినిమాని యూనివర్స్ ముందుకు తీసుకెళ్ళింది. అందుకే ట్రైలర్లో 'ది పవర్ ఆఫ్ బ్రహ్మాండ' అని పెట్టాం.

క్యారెక్టర్ లుక్స్ డిజైన్ చేయడానికి ఎంత కాలం పట్టింది ?
-దాదాపు తొమ్మిది నెలలు పట్టింది. ఈ ప్రిపరేషన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.
-ఈ సినిమాలో చాలెజింగ్ పార్ట్.. డ్రామా, ట్రీట్మెంట్ ని క్రాక్ చేయడం. దీనికి చాలా సమయం పట్టింది.

మ్యూజిక్ గురించి ?
మ్యూజిక్ కథని ఎలివేట్ చేసింది. మంచి హై క్రియేట్ చేసేలా మ్యూజిక్ చేశారు.

జయరాం, జగపతి బాబు పాత్రల గురించి?
-జయరాం గారు అగస్త్య ముని పాత్రలో కనిపిస్తారు. జగపతి బాబు గారు తాంత్రిక గురువు పాత్రలో కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు కీలకంగా వుంటాయి.

మిరాయ్ కి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా ?
-సీక్వెల్ చేసే పొటెన్షియల్ మిరాయ్ కథకి వుంది. ఈ సినిమాకి వచ్చే రిజల్ట్ ని బట్టి అలోచించాలి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved