pizza

Mithra Mandali Teaser Launch on June 12th at 12:00 PM
మిత్ర మండలి టీజర్ విడుదల జూన్ 12న మధ్యాహ్నం 12:00 గంటలకు

You are at idlebrain.com > news today >

11 June 2025
Hyderabad

The recently revealed Title Announcement Motion Poster of Mithra Mandali has taken the internet by storm, receiving a phenomenal response from the audience. With quirky character glimpses, intriguing visuals,leaving viewers curious and excited, the announcement has sparked a wave of anticipation across social media.

Presented by Bunny Vas under the banner of BV Works, & Produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, Mithra Mandali promises a unique blend of humour, mystery, and youthful madness. The film, directed by Vijayendar, features an eccentric gang of actors – Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara, whose energy and comic timing is well celebrated amongst the audience.

The film is Produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala & Co-produced by Somaraju Penmetsa.

With the motion poster capturing amazing reach & attention, the makers have officially announced the Teaser Launch on June 12th at 12:00 PM. Given the love the pre-look and title reveal have received, the teaser is expected to add to the rising excitement and give audiences their first real taste of the chaos, comedy, and chemistry this gang is bringing to the big screen.

మిత్ర మండలి టీజర్ విడుదల జూన్ 12న మధ్యాహ్నం 12:00 గంటలకు!

ఇటీవల విడుదలైన మిత్ర మండలి టైటిల్ అనౌన్స్‌మెంట్ మోషన్ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటూ అద్భుత స్పందన పొందింది. వినూత్నమైన పాత్రల పరిచయాలు, ఆసక్తికరమైన విజువల్స్‌ ద్వారా ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

బన్నీ వాస్ సమర్పణలో BV వర్క్స్ బ్యానర్‌పై, సప్త అశ్వ మీడియా వర్క్స్ మరియు వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వినూత్న హాస్యం, మిస్టరీ, యూత్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలవనుంది. విజయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా లాంటి వినూత్న తరం నటులు కనిపించనున్నారు. వీరి ఎనర్జీ, కామిక్ టైమింగ్‌కు ఇప్పటికే మంచి పేరు ఉంది.

ఈ చిత్రాన్ని కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించగా, సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మోషన్ పోస్టర్‌కు వచ్చిన విశేష స్పందన దృష్ట్యా, మేకర్స్ జూన్ 12 మధ్యాహ్నం 12:00 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు వచ్చిన ఆదరణను పరిగణలోకి తీసుకుంటే, టీజర్‌తో ఈ గ్యాంగ్ తెరపై చూపించబోయే సందడి, వినోదం, కెమిస్ట్రీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved