pizza

Mowgli on Dec 12
రోషన్ కనకాల, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మోగ్లీ 2025' డిసెంబర్ 12న రిలీజ్

You are at idlebrain.com > news today >

11 October 2025
Hyderabad

'బబుల్ గమ్' తో సక్సెస్ ని అందుకున్న హీరో రోషన్ కనకాల 'మోగ్లీ 2025'తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన 'మోగ్లీ 2025' ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

ఈరోజు, నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. 'మోగ్లీ 2025' డిసెంబర్ 12న థియేటర్లలోకి వస్తుంది. డిసెంబర్ రెండవ వారంలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం"మోగ్లీ 2025"కు పెద్ద ప్లస్ పాయింట్‌గా కానుంది.

నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌తో ఈ చిత్రం స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ వీడియో ప్రేక్షకులను ది వరల్డ్ ఆఫ్ మోగ్లీకి పరిచయం చేసింది. ఎమోషనల్ నెరేటివ్ లో రోషన్ కనకాల పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్. వారి అద్భుతమైన కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలెట్ గా ఉండబోతోంది. బండి సరోజ్ కుమార్ ఒక బలమైన విలన్ పాత్రను పోషిస్తుండగా, హర్ష చెముడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. స్క్రీన్ ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్‌గా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved