pizza

‘Mowgli 2025’ Glimpses Raise Curiosity from Start to Finish…
ఆద్యంతం ఆసక్తి గొలిపేలా 'మోగ్లీ 2025' గ్లింప్స్...

You are at idlebrain.com > news today >

29 August 2025
Hyderabad

The character ‘Mowgli’ is one that’s deeply familiar to those born in the 80s and 90s. Mowgli, from The Jungle Book, was a sensation back in the day. When we hear the name ‘Mowgli,’ what immediately comes to mind is a little boy’s wild adventures alongside jungle animals. Even today, the character continues to hold strong appeal among audiences. Now, a film titled Mowgli 2025 is on the way, and its first glimpse was unveiled today.

Set against a forest backdrop, the glimpse is crafted in a visually appealing manner. The voice-over by actor Nani adds an extra layer of charm to the promo.

Mowgli 2025 tells the story of a young man, not yet 25, who lives in the forest. When a city girl enters his life and their bond blossoms into a love story, things take a dramatic turn. The film explores who tries to interfere in their golden romance, and how this young man reacts—how he strikes back and fights back.

Nani’s voice-over introduces the premise: “Let me tell you a small love story… It’s 2025, a time when technology hasn’t fully evolved. If you go into the forest, even basic mobile signals are out of reach.” Through this, it’s evident that Mowgli 2025 is all set to showcase the hero’s daring efforts to protect his love.

“What really happened? What battles did the hero fight for his heroine, and with whom?” - These are the questions the audience will have to wait until the film’s release to get answered.

Roshan Kanakala and Sakshi Sagar Madolkar play the lead pair in the film. Roshan is the son of actor Rajeev Kanakala and renowned anchor Suma Kanakala. Though Roshan made his debut as a hero with Bubble Gum, the film didn’t meet box office expectations.

The film is directed by Sandeep Raj, who shot to fame with Color Photo, a film that won the National Award for Best Feature Film in 2022, along with several other accolades.

The film also features the unique performer Bandi Saroj Kumar in a key role. Years ago, he made waves with his directorial and acting film Maangalyam. The glimpse itself hints at the power of his role in this film—especially with the striking line: “Hey Mowgli… Sher Khan is coming! Be ready!”

The film’s music is composed by Kaala Bhairava, son of legendary composer M.M. Keeravani. Cinematography is by Rama Maruthi. The film is jointly produced by TG Vishwa Prasad and Krithi Prasad under the People Media Factory banner.

ఆద్యంతం ఆసక్తి గొలిపేలా 'మోగ్లీ 2025' గ్లింప్స్...

'మోగ్లీ' ఎనభై మరియు తొంభయ్యో దశకంలో పుట్టిన వారికి బాగా పరిచయం అయిన పాత్ర ఇది. 'జంగిల్ బుక్' లో 'మోగ్లీ' పాత్ర అప్పట్లో ఓ సంచలనం. 'మోగ్లీ' అనగానే 'జంగిల్ బుక్' కథల్లో అడవి జంతువులతో పాటూ ఓ చిన్న బాలుడు చేసే సాహసాలే మన కళ్ళముందు కనిపిస్తాయి. ఇప్పటికీ 'మోగ్లీ' పాత్రకు అంతే క్రేజ్ ఉంది ప్రేక్షకుల్లో. అదే పేరుతో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే 'మోగ్లీ 2025'. అడవి నేపథ్యంగా జరిగే ఈ సినిమా గ్లింప్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన ఈ గ్లింప్స్ కు హీరో నాని ఇచ్చిన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

అడవిలో బ్రతికే ఓ పాతికేళ్లు కూడా నిండని ఓ కుర్రాడి జీవితంలోకి ఒక పట్నం అమ్మాయి ప్రవేశిస్తే, అది కాస్తా ప్రేమ కథలా మారితే, ఆ బంగారు ప్రేమ కథలో ఎవరు వేలు పెట్టారో, ఆ వేలు పెట్టిన వాళ్ళను ఆ కుర్రాడు ఎలా కుట్టాడో , ఎలా కొట్టాడో అన్న కథే మోగ్లీ 2025. "ఒక చిన్న ప్రేమ కథ చెప్తా, 2025 టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వని రోజులు, అడవిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేవి కావు" అంటూ కథను పరిచయం చేస్తున్న నాని వాయిస్ ఓవర్ వింటుంటే తమ ప్రేమను కాపాడుకోవడం మోగ్లీ చేసే సాహసాలన్నీ చూపించబోతున్నటు అర్ధమవుతుంది. "అసలేం జరిగిందో, కథానాయిక కోసం కథా నాయకుడు ఎలాంటి యుద్ధాలు చేశాడో, ఎవరితో చేశాడో" తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఎదురుచూడాల్సిందే..

రోషన్ కనకాల మరియు సాక్షి సాగర్ మదోల్కర్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. నటుడు రాజీవ్ కనకాల మరియు ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతుల కుమారుడే రోషన్ కనకాల. 'బబుల్ గమ్' సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేదు. 'కలర్ ఫోటో' సినిమాతో అందరినీ ఆకర్షించిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నారు. 'కలర్ ఫోటో' సినిమా 2022 ఏడాదికి గానూ 'జాతీయ ఉత్తమ చిత్రం' అవార్డుతో పాటూ ఎన్నో సినీ అవార్డులను సొంతం చేసుకుంది. విలక్షణ నటుడు బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కొన్నేళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన 'మాంగల్యం' సినిమా అప్పట్లో ఓ దుమారమే లేపిందన్న సంగతి అందరికీ తెలిసిందే. "రేయ్ మోగ్లీ.. షేర్ ఖాన్ వచ్చేస్తున్నాడు రా రెడీ గా ఉండు" అంటూ బండి సరోజ్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో గ్లింప్స్ ద్వారానే చెప్పేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రామ మారుతి పనిచేయడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో నిర్మాతలు TG విశ్వప్రసాద్ మరియు క్రితి ప్రసాద్ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

The world of #Mowgli glimpse is strikingly original and well-crafted.

Set against a lush forest backdrop, it’s a youthful action-packed love story - featuring an intriguing triangular dynamic between the hero, heroine, and a menacing villain played by Bandi Saroj Kumar.… pic.twitter.com/zkCzFO7zRZ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved