pizza

Bhagyashri Borse dubs for Mr. Bachchan
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్'లో తన క్యారెక్టర్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పిన సెన్సేషనల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే

You are at idlebrain.com > news today >

30 July 2024
Hyderabad

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆమె డెడికేషన్, ప్రొఫెషనలిజంను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్, టీజర్ లో తన బ్యూటీఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు భాగ్యశ్రీ. ఇప్పుడు ఎక్కడ చూసిన భాగ్యశ్రీ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఆమెను టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటున్నారు. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్. ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న గ్రాండ్ విడుదల కానుంది.

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved