pizza

Man of Masses NTR launched Sree Vishnu and Hussain Sha Kiran's Investigative Thriller "Mrithyunjay" Trailer; Movie Releasing worldwide on March 6th
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు, హుస్సేన్ షా కిరణ్‌ల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల.. మార్చి 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

28 February 2026
Hyderabad

The King of Content Sree Vishnu, is currently bringing an investigative thriller titled "Mrithyunjay" directed by Hussain Sha Kiran. The film is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. The blockbuster Samajavaragamana duo is all set to share the screen once again. Reba Monica John is playing the female lead in Mrithyunjay.

After the thrilling teaser, expectations for the film skyrocketed. Today, the makers dropped the trailer. Making it even more special for the team, Man of Masses NTR launched the trailer and wished the entire team all the best. Supporting his friend Sandeep Gunnam, aka Sunny, he penned a beautiful note praising his talent for selecting unique stories and his belief in content-driven cinema, just like his father, Gunnam Gangaraju.

He wrote, "Sunny @sunnygunnam has been an integral part of my life for many years now. Over 18 years of our friendship, I have observed that Sunny has an instinct for identifying unique stories, just like his father Gunnam Gangaraju garu. I couldn’t be prouder of him as he steps into his maiden venture Mrithyunjay as a producer with one such unique script."

NTR was highly impressed with the Mrithyunjay trailer and said that it carries gripping intensity and leaves you wanting more. As Tarak mentioned, the trailer effectively builds intrigue. It begins with a child who is missing her father - what really happened to him?

To uncover the mystery, Sree Vishnu takes charge, investigating the murder case linked to Vikranth. He is seen relentlessly chasing a killer.

The powerful background score by Kaala Bhairava elevates every moment. The thrill factor works effectively, and the makers do not reveal the antagonist, which further builds curiosity around his character. Sree Vishnu surprises with his choice of script, and Hussain Sha Kiran’s narration keeps you thoroughly intrigued.

Mrithyunjay is hitting the big screens on March 6th, 2026. With proper promotions and exciting content, Mrithyunjay is all set to impress the audience. This Sree Vishnu-styled thriller promises another intriguing entertainer. The cinematography is managed by Vidhya Sagar, Kaala Bhairava is composing the music, Sreekar Prasad is in charge of editing, and Manisha A. Dutt handled production design.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు, హుస్సేన్ షా కిరణ్‌ల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల.. మార్చి 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ రిలీజ్

ది కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ‘మృత్యుంజయ్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ని పలకరించనున్నారు.

‘మృత్యుంజయ్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్‌లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తూ.. ‘‘సన్నీ (సందీప్ గుణ్ణం) నా జీవితంలో ఓ భాగం. మా 18 సంవత్సరాల స్నేహంలో సన్నీలో నేను ఎన్నో గమనించాను. సన్నీకి తన తండ్రి గుణ్ణం గంగరాజు గారిలాగే ప్రత్యేకమైన కథలను గుర్తించే స్వభావం ఉంది. ‘మృత్యుంజయ్’ లాంటి ఓ యూనిక్ స్క్రిప్ట్‌తో అతను తన తొలి ప్రాజెక్ట్‌గా నిర్మాణంలోకి అడుగు పెడుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మృత్యుంజయ్ ట్రైలర్ చూసి ఎన్టీఆర్ ప్రశంసల్ని కురిపించారు. ఉత్కంఠభరితంగా ఉందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉందని కొనియాడారు. తండ్రిని మిస్ అవుతున్న ఒక పిల్లవాడితో ఈ కథ ప్రారంభం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మళ్లీ ట్రైలర్ చివర్లో ఆ పిల్లాడికి, హీరో కథకి కనెక్ట్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. హీరోకి మాత్రమే కనిపించే ఆ హంతకుడు.. పోలీసులకు ఎందుకు కనిపించడం లేదు? అసలు ఆ వ్యక్తి ఎవరు? నేరం ఎలా జరిగింది? ఈ సమస్యను హీరో ఎలా పరిష్కరిస్తాడు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అందరిలోనూ మరింత ఉత్సుకతను పెంచేసింది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపించబోతోన్నారని స్పష్టంగా తెలుస్తోంది.

కాళ భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింతగా సీన్లను ఎలివేట్ చేసినట్టు అనిపిస్తోంది. థ్రిల్ ఫ్యాక్టర్ ఆద్యంతం కంటిన్యూ అయినట్టుగా కనిపిస్తోంది. ‘మృత్యుంజయ్’ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా ని విద్యా సాగర్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మనీషా ఎ. దత్ పని చేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved