pizza

'Mr Pregnant' will be a career turning movie for me - Hero Syed Sohel Ryan
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నా కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుంది - హీరో సయ్యద్ సోహైల్ రియాన్

You are at idlebrain.com > news today >
Follow Us

17 August 2023
Hyderabad

Syed Sohel Ryan, who shot to fame with Bigg Boss, has proved himself as a talented young hero with many crazy movies. The new movie in which he is playing the hero is 'Mr. Pregnant' is getting ready for release. In this, Sohel will be seen in the character of a male pregnant. Roopa Kodavayur is playing the heroine in this film. Produced by Appi Reddy, Ravindar Reddy Sajjala and Venkat Annapareddy under the banner of Mic Movies, this film is produced by debutant Srinivas Vinjanampati. This film which is getting ready for release on 18th of this month is being released by famous distribution company Mythri Movie Distribution in Nizam. Hero Sohail interacted with media today about the film.

- I got closer to the audience through Bigg Boss. But there was a doubt whether they would come to the theater to see me if I acted as a hero in the film. If star heroes do commercial films, it will workout because they have fans. But I believe that if young heroes like me do variety movies and make new efforts, the audience will come to our movies. That's why I am doing a new genre movie like Mr. Pregnant. I don't think making this movie is risky. For young actors like me, doing routine commercial projects is a risk.

- Director Srinivas Vinjanampati has been my friend for eight years. He wanted to make a movie with a big hero with this story. Because we both are newcomers, he said that the movie will not get craze. I didn't enter Bigg Boss then. After I came from Bigg Boss, he told me that you are the hero of this film and made me sign. That's how this movie started.

- Playing a male pregnant character was a different experience for me. Two sisters in my house were pregnant when I accepted this film. I observed how they walk, how they talk, how they do things. Also our director Srinivas is a good family person. He gives good advice. I have done this character well. I wore prosthetics weighing three kilos while doing this character. That little weight was bothering me. We can imagine how hard it is for mom to carry us for nine months.

- After watching this movie special show, many women shed emotional tears and said that it showed well the difficulties faced by the mother. Their response is the best example of how our film connected with the audience. It seems that our effort was successful. We hope to get the same response in the theater tomorrow.

- At least 20 percent of males are willing to take pregnancy if male pregnancy is really possible. It is taken to experience what it is. After the announcement of this movie, there were many trolls. But just like there are people who love me, there are people who don't like me. My mother also spoke negatively about this movie initially. But after watching the movie, I felt proud. She shed tears. She appreciated me for making a good movie.

- I went into depression when the release of this movie was delayed. Because I have high hopes for this movie. I believe this movie will be a turning point in my career.

- Nagarjuna garu appreciated when he showed glimpses of the movie Mr. Pregnant. You are doing a different movie. He said that new people should make new efforts like this. I felt very happy to release the trailer at his hands.

- Mic Movies Appireddy garu is supporting new directors and heroes with his movies. Movies are being made with a budget of at least five to six crores. If he wants, he can spend some more budget and try star heroes. But they are giving opportunities to new people. I am also happy to do a film in Mic Movies. This is a love story between Gautham and Mahi. First fun, going with a love story then it turns emotional.

- Roopa is a talented heroine. She received SIIMA award. In this movie, I also acted as her hubby. Reputed technicians worked for this film and they has better experience than me. I entered the industry at a young age. Trying to settle down. Everyday I work hard for movies. Boot Cut Balaraju is currently shooting. I'm doing another film called Katha Vere Vuntadi. Im selective when it comes to films. Like Ayushmann Khurana in Bollywood, I want to do different movies in Telugu.

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నా కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుంది - హీరో సయ్యద్ సోహైల్ రియాన్

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన సయ్యద్ సోహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఇందులో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో సోహైల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాంలో విడుదల చేస్తోంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లో నటించిన ఎక్సీపిరియన్స్ ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సోహైల్.

- నేను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేది. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుంది. వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ నాలాంటి యంగ్ హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను. ఈ మూవీ చేయడం రిస్క్ అని అనుకోవడం లేదు. నాలాంటి యంగ్ యాక్టర్స్ రొటీన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడమే రిస్క్ అవుతుంది.

- దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్. ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనిద్దరం కొత్తవాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనేవాడు. నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది.

- మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్. మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించాను. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఆయన మంచి సూచనలు ఇచ్చేవారు. అలా ఈ క్యారెక్టర్ బాగా చేశాను. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ ధరించాను. ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది. తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు.

- ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.

- మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. అది ఎలా ఉంటుందో ఎక్సీపిరియన్స్ అయ్యేందుకైనా తీసుకుంటారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నన్ను ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నా. ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది. కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుంది.

- ఈ సినిమా రిలీజ్ ఆలస్యమయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. ఎందుకంటే ఈ సినిమాపై నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఇది నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా అని నమ్ముతున్నాను.

- మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.

- మైక్ మూవీస్ అప్పిరెడ్డి గారు తన సినిమాలతో కొత్త దర్శకులు, హీరోలను ఎంకరేజ్ చేస్తున్నారు. కనీసం ఐదారు కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేస్తున్నారు. ఆయన కావాలంటే ఇంకొత బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలను ట్రై చేసుకోవచ్చు. కానీ కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. మైక్ మూవీస్ లో నేనూ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. గౌతమ్, మహి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఫస్ట్ ఫన్, లవ్ స్టోరీతో వెళ్తూ తర్వాత ఎమోషనల్ గా మారుతుంది.

- రూపా టాలెంటెడ్ హీరోయిన్. సైమా అవార్డు అందుకుంది. ఈ సినిమాలో నేనూ ఆమె వార్ లా పోటీ పడి నటించాం. పేరున్న టెక్నీషియన్స్ పనిచేశారు. నాకంటే మిగతా వాళ్లంతా మంచి ఎక్సీపిరియన్స్ పర్సన్. నేను చిన్న ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చాను. సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. రోజూ సినిమాల కోసమే కష్టపడుతుంటా. ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు షూటింగ్ జరుగుతోంది. కథ వేరే ఉంటది అనే మరో సినిమా చేస్తున్నాను. సెలెక్టెడ్ గా మూవీస్ చేయాలని ఉంది. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved