pizza

'Mr Pregnant' is a must watch movie for all families - Producers Appireddy, Venkat Annapareddy, Ravindar Reddy Sajjala
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఫ్యామిలీస్ అంతా కలిసి చూాడాల్సిన సినిమా - నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల

You are at idlebrain.com > news today >
Follow Us

15 August 2023
Hyderabad

Filmmakers Appireddy, Venkat Annapareddy and Ravinder Reddy Sajjala have made a name for themselves as passionate producers by producing various films under the banner of Mic Movies. Another new concept movie produced by them is 'Mr Pregnant'. Directed by Srinivas Vinjanampati, 'Mr Pregnant' starring Syed Sohel Ryan and Roopa Kodavayur is releasing on 18th of this month. This movie is being released in Nizam area by Mythri Movie Distributors, a leading distribution company. Producers Appireddy, Venkat Annapareddy and Ravinder Reddy Sajjala interacted with media today about the film 'Mr. Pregnant'.

Producer Appireddy said - We are making sure that every movie is new in our production Mic Movies. If the audience likes it, we are making movies with stories with nativity. Be it Slum Dog Husband which came in our company recently, or this movie 'Mr Pregnant', we have produced the film after finding novelty in the script. I like the mother sentiment in this story. But some friends in the industry said that this movie is like a double edged sword, because of the theme of male pregnancy. It is a challenging script and we went ahead. We watched the movie recently and the output came as we expected. Mythri Movie Distributors saw the film recently and they said that the movie was very good. That increased our confidence. Shravan Bharadwaj's music will be the attraction of our movie. We want to do films with big heroes in our company. But they are all busy with committed projects. We are trying to approach them with a script and it is difficult. Even if they like it, we have to wait for two or three years. Why wait when we have a script that we like? If you wait more time then there are chances that the script will be out of date. But if everything is possible for us, we will definitely make films with big heroes. We don't think we can do one or two films. We set the banner to produce movies in a settled manner for a few years. Now four to five films are in the pipeline. Two films are currently in the making. That's why we are learning many things in production with a long goal. No one should make films to give the film to OTT. We say with our experience that producing should be done only if there is strength to release in theatre. If they don't like the OTT of our movie, there will be no chance of releasing it. Once there was an idea to do direction and I'm not interested right now..

Producer Venkat Annapareddy said - We have successfully released four films in our production so far. We are selecting good stories. But when you hear the story, there is a budget. When the making is done, it will go to another number. We think this is the main problem in making. We are trying to overcome it. First, we thought of different heroes for the movie 'Mr. Pregnant'. But when we saw Sohel in BiggBoss who was impressively showed the emotion and strategy in those games. We thought that he would be a good hero for this story. He looks good in this movie. Male pregnant character is very unique. This movie should not be seen in commercial movie format. Many people have shared their experiences with us after watching 'Mr Pregnant'. Lot of them said that they should have taken better care of thier wife during her pregnancy. So it becomes a film that makes them think personally.

Producer Ravinder Reddy Sajjala said - Under our banner, we are making films with three passionate producers. We have no differences between us. If someone says corrections in our work, we will check it. Nagarjuna garu released our trailer of 'Mr. Pregnant' and gave a good boost. Also he saw the trailer once again in that event. As the response to the trailer was good, there was a buzz about the movie. A movie with such a story has not come out in Telugu. Even if it comes in English, it was done experimentally or based on comedy. After we started this movie, this type of movie came in Bollywood. But 'Mr Pregnant' is unique. Audience will enjoy the movie with emotions and entertainment.

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఫ్యామిలీస్ అంతా కలిసి చూాడాల్సిన సినిమా - నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల

మైక్ మూవీస్ బ్యానర్ పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల. వారు నిర్మించిన మరో న్యూ కాన్సెప్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ నెల 18న విడుదలవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజ్ కు రెడీ అయిన సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ - మా మైక్ మూవీస్ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. మన ప్రేక్షకులకు నచ్చేలా, మన నేటివిటీ ఉంటే కథలతో సినిమాలు చేస్తున్నాం. ఇటీవల మా సంస్థలో వచ్చిన స్లమ్ డాగ్ హజ్బెండ్ అయినా, ఇప్పుడు ఈ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అయినా అలా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్ ను నమ్మే నిర్మించాం. ఈ కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. మేము సినిమా చూశాం. ఔట్ పుట్ మేము ఎక్స్ పెక్ట్ చేసినట్లే వచ్చింది. ఇటీవల మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్లు చూశారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. దాంతో మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణ అవుతుంది. మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. మన దగ్గర నచ్చిన స్క్రిప్ట్ ఉన్నప్పుడు వెయిట్ చేయడం ఎందుకనిపిస్తుంటుంది. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం. మేము ఒకటీ రెండు సినిమాలు చేసి వెల్దామని అనుకోవడం లేదు. కొన్నేళ్ల పాటు సెటిల్డ్ గా మూవీస్ నిర్మించాలని బ్యానర్ పెట్టాం. ఇప్పుడు నాలుగైదు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి. రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. అందుకే ఒక లాంగ్ గోల్ పెట్టుకుని ప్రొడక్షన్ లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఓటీటీకి సినిమా ఇవ్వొచ్చని ఎవరూ సినిమాలు నిర్మించకూడదు. థియేటర్ లో రిలీజ్ చేసే స్ట్రెంత్ ఉంటేనే ప్రొడ్యూసింగ్ చేయాలని మా ఎక్సీపిరియన్స్ తో చెబుతున్నాం. ఒకవేళ మన సినిమా ఓటీటీ వాళ్లకు నచ్చకుంటే విడుదల చేసే అవకాశమే ఉండదు కదా. ఒకప్పుడు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు.

నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ - మా సంస్థలో ఇప్పటిదాకా నాలుగు సినిమాల్ని సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేశాం. మంచి కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయితే కథ విన్నప్పుడు ఒక బడ్జెట్ ఉంటుంది. మేకింగ్ పూర్తయ్యేసరికి ఇంకో నెంబర్ కు వెళ్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లమ్ గా భావిస్తున్నాం. దాన్ని ఓవర్ కమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది.

నిర్మాత రవీందర్ రెడ్డి సజ్జల మాట్లాడుతూ - మా బ్యానర్ లో ముగ్గురం నిర్మాతలం కలిసే సినిమాలు చేస్తున్నాం. మా మధ్య డిఫరెన్సెస్ ఎప్పుడూ రావు. మా వర్క్ లో ఎవరైనా కరెక్షన్స్ చెబితే చెక్ చేసుకుంటాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా ట్రైలర్ ను నాగార్జున గారు విడుదల చేయడంతో మంచి బూస్టింగ్ వచ్చింది. అలాగే ఆయన ఆ కార్యక్రమంలో ట్రైలర్ ను మరోసారి చూశారు. ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుండటంతో మూవీ మీద బజ్ ఏర్పడింది. ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదు. ఇంగ్లీష్ లో వచ్చినా...అది ఎక్స్ పర్ మెంటల్ గా చేశారు. కామెడీ మీద బేస్ అయి ఉంటుంది. మేము ఈ సినిమా ప్రారంభించిన తర్వాత బాలీవుడ్ లో ఈ టైప్ సినిమా ఒకటి వచ్చింది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ యూనిక్ గా ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాను ఎంజాయ్ చేస్తారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved