pizza

Mana Shankara Vara Prasad Garu post production in progress
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' నుంచి అదిరిపోయే స్టిల్ రిలీజ్- శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్

You are at idlebrain.com > news today >

23 December 2025
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంఅద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది.

విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టిల్ అదిరిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్ తో ఒక చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న మెగాస్టార్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ గా సంచలనం సృష్టించాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి, వెంకటేష్ పై చిత్రీకరీంచిన పాటని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు.

భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved
Ś Ś