pizza

Venkatesh Joins the Shoot of ‘Mana Shankara Vara Prasad Garu’ from Today
నేటి నుండి 'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్లో వెంకీ..

You are at idlebrain.com > news today >

21 October 2025
Hyderabad

Victory Venkatesh has joined the shooting of Mana Shankara Vara Prasad Garu from today. The film, directed by blockbuster-maker Anil Ravipudi, stars Megastar Chiranjeevi and Nayanthara in lead roles, with Venkatesh playing a crucial character. Known for his disciplined filmmaking and ability to deliver on time, Ravipudi is ensuring that the shoot progresses swiftly - the current schedule will continue uninterrupted until November 12. After this, only a song sequence will be left to film.

The movie, which brings together two of Telugu cinema’s most loved entertainers — Chiranjeevi and Venkatesh - has already created massive buzz. Fans were thrilled by Chiranjeevi’s energetic dance moves in the recently released Meesala Pilla song. With music by Bheems Ceciroleo, Mana Shankara Vara Prasad Garu is being produced by Sahu Garapati and Sushmitha Konidela. Actress Catherine Tresa also plays an important role. The film is slated for a Sankranthi 2026 release.

నేటి నుండి 'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్లో వెంకీ..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా, నయనతార కథానాయికగా నటిస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. హీరో వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇండస్ట్రీలో నిర్మాతల దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరుంది. అనుకున్న సమయానికే షూటింగ్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయడంలో ఆయన పని తీరు అభినందనీయం. అందుకు తగ్గట్టుగానే 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి.

నేటి నుండి హీరో వెంకటేష్ షూటింగ్లో పాల్గోనున్నారు. నవంబర్ 12 వరకూ ప్రస్తుత షెడ్యూల్ నిరాటంకంగా జరగనుంది. ప్రస్తుత షెడ్యూల్ పూర్తయిన తరువాత మరో పాట పాత్రమే షూటింగ్ చేయాల్సి ఉన్నట్టు సమాచారం.

దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట కావడం, ఇంతవరకూ విడుదలైన అన్ని ప్రచార చిత్రాల్లో చిరంజీవి క్లాస్ లుక్కులో కనిపించడం, హాస్య సన్నివేశాలను అలవోకగా పండించగల చిరంజీవి మరియు వెంకటేష్ లు కాంబోగా ఈ చిత్రంలో కనిపించడం, దానికి తోడు ఇటీవలే విడుదలైన 'మీసాల పిల్లా' సాంగ్ లో తనదైన శైలి స్టెప్పులతో చిరంజీవి అలరించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించగా, నిర్మాతలు సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హోరోయిన్ కేథరిన్ కూడా మరో కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved