pizza

Miss Shetty Mr Polishetty is a big success with megastar Chiranjeevi’s appreciation: Director Mahesh Babu P
మెగాస్టార్ ప్రశంసలతో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" బిగ్ సక్సెస్ అందుకున్న ఫీలింగ్ కలిగింది - దర్శకుడు పి.మహేశ్ బాబు.

You are at idlebrain.com > news today >
Follow Us

6 September 2023
Hyderabad

Mahesh Babu p made his directorial debut with the film Rara Krishnaiah. He proved as talented director with the film. After some hiatus, his upcoming movie "Miss Shetty Mr. Polishetty". The family entertainer, starring Naveen Polishetty and Anushka, was produced by UV creations. "Miss Shetty Mr. Polishetty" is ready for a Pan India release tomorrow. Director P Mahesh Babu interacted with media about the film.

- Our hometown Bhimavaram. We came from there for a few years. I have been like this from an early age. Writing stories for the time of studying college, the interest on the direction began. I had a curiosity on the film making process. I came to the industry. Rara Krishnaiah is my first movie. After that there were some films. Some have come stopped after began shooting. Few didn't gone to the sets for unexpected reasons.

- I am writing stories in this gap. Anushka's friend tells the story of Miss Shetty Mr. Polishetty. He tells Anushka. I thought my script was going to a little adult through her. Anushka called me one day and I narrated the story. There are also UV producers there. After telling her the story, you asked who you want to do with the movie. I said that the dialogue version will be completed. They know my focus on the story and content of the film.

- Anushka has done subjects like Baahubali and Bhagmathi. She is also waiting for a similar lighter way entertainment story. When I told this story, she loved. She came into the project. UV creations also impressed. UV Creations has spent more investment for the film. The big banner seemed happy to believe my Vision.

- I've narrated this story to Naveen in 2019. He took time for 3 months and said okay. We have been shooting for the Lead Pair by February 2020. We have set the first schedule in March. Then the pandemic came. On the other hand, Naveen went to the US for promotion and struck there. The lock down is to be limited to all. So this project was up to the expected time. Release date postponing is to make post production more quality.

- In this film there is bold content but not Adult Content. Actors like Anushka and Naveen have an image and credibility. If the content is not good, the original film will not be admitted. The UA certificate came from the censor. The censor team said that they had seen the film without bothering for a moment. The story seemed to be embarrassing at first time Anushka even when he was doing the story. However, she heard the story with a very open mind. When I went to tell the story once again, she enjoyed.

- Actors like Anushka and Naveen are ready to accept new stories, and we are able to write scripts like them. There is no pursuit of the society today. Talking openly. The film's fun emotion gives the audience a new feel. The messages are not straight. But there will be that moral in the story. I've read in the paper with the heading Shetty with Polishetty. We have fixed the title of Miss Shetty and Mr. Polishetti with that rhyming. The two characters are main for this film, so we fixed it.

- A lady who is thinking of not getting married in life wants to be happy to be a mother rather than marry. For that, she takes help of youngster. To this end, the consequences of the couple. The storyline of the film is what they are mentally emotional. In the trailer, we told this point and prepared the audience. There are many emotional bondings that are not the only romance between husbands or lovers. In my story, the heroine will see such a relationship. I am confident people will enjoy the movie tomorrow. There are no scenes that bother anywhere. It feels like a complete movie. This is a good entertainment and emotional movie. Naveen Polishetty, Anushka as Sidhu and Anvitha Character are Natural. We are making a special show for Kollywood directors in Chennai tomorrow. We are releasing the movie in all South Languages. The story is universal, so we are releasing the film in Hindi too.

- Chiranjeevi called us and appreciated me. When I wrote the story as a writer, I wanted to remember these points to watch the movie, and such little details were also spoken by Chiranjeevi. Up to ten people in Chiranjeevi gari family, including Surekha Garu, watched our movie. Chiranjeevi called me and Naveen home and we spent almost half and hour time discussing about the film.

మెగాస్టార్ ప్రశంసలతో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" బిగ్ సక్సెస్ అందుకున్న ఫీలింగ్ కలిగింది - దర్శకుడు పి.మహేశ్ బాబు

రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు పి.మహేశ్ బాబు. తొలి సినిమాతో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి రూపొందించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా మూవీ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" రేపు పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలు తెలిపారు దర్శకుడు పి.మహేశ్ బాబు.

- మా సొంతూరు భీమవరం. కొన్నేళ్లకు అక్కడి నుంచి వైజాగ్ వచ్చాం. నాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. కాలేజ్ చదివే టైమ్ కు కథలు రాయడం, డెరెక్షన్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. సినిమా మేకింగ్ ప్రాసెస్ మీద నాకు క్యూరియాసిటీ ఉండేది. అలా ఇండస్ట్రీకి వచ్చాను. రారా కృష్ణయ్య నా ఫస్ట్ మూవీ. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు టాక్స్ జరిగాయి. కొన్ని షూటింగ్ బిగిన్ అయ్యేవరకు వచ్చాయి. అనుకోని కారణాలతో అవి సెట్స్ మీదకు రాలేదు.

- ఈ గ్యాప్ లో నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథను అనుష్క ఫ్రెండ్ ఒకరికి చెప్పాను. అతను అనుష్కకు చెబుతాడు. ఆమె ద్వారా కొంచెం పెద్దవాళ్ల దగ్గరకు నా స్క్రిప్ట్ వెళ్తుందని అనుకున్నా. అనుష్క ఒకరోజు పిలిపించి కథ చెప్పమంది. అక్కడే యూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఆమెకు కథ చెప్పాక మీరు మూవీ ఎవరితో చేయాలని అనుకుంటున్నారు అని అడిగారు. డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాక ఆలోచిస్తా అని చెప్పాను. సినిమా కథ, కంటెంట్ మీద నాకున్న ఫోకస్ వారికి తెలిసింది.

- అనుష్క గారు బాహుబలి, భాగమతి లాంటి సబ్జెక్ట్స్ చేసి ఉన్నారు. ఆమె కూడా ఇలాంటి లైటర్ వేన్ ఎంటర్ టైన్ మెంట్ కథ కోసం వేచి చూస్తున్నారట. నేను ఈ కథ చెప్పగానే ఆమెకు నచ్చింది. ఆమె ప్రాజెక్ట్ లోకి వచ్చారు. యూవీ వాళ్లు కూడా ఇంప్రెస్ అయ్యారు. యూవీ సంస్థ ఈ సినిమా కోసం నేనెంత ఇంట్రెస్ట్ గా ఉన్నానో అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ చూపించింది. పెద్ద బ్యానర్ నా విజన్ ను నమ్మినందుకు హ్యాపీగా అనిపించింది.

- 2019లో నవీన్ కు కథ చెప్పా. ఆయన 3నెలలు టైమ్ తీసుకుని ఓకే చెప్పారు. లీడ్ పెయిర్ కుదిరాక 2020 ఫిబ్రవరి నాటికి షూటింగ్ ఫిక్స్ చేసుకున్నాం. మార్చిలో ఫస్ట్ షెడ్యూల్ వేసుకున్నాం. అప్పుడే పాండమిక్ వచ్చేసింది. మరోవైపు నవీన్ జాతిరత్నాలు ప్రమోషన్ కోసం యూఎస్ వెళ్లి అక్కడ స్ట్రక్ అయ్యారు. లాక్ డౌన్ లో అందరం ఇంటికే పరిమితం కావాల్సివచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైమ్ కు లేటయ్యింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరింత క్వాలిటీగా చేద్దామనే.

- ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంటుంది కానీ అడల్ట్ కంటెంట్ కాదు. అనుష్క, నవీన్ లాంటి యాక్టర్స్ కు ఒక ఇమేజ్, క్రెడబిలిటీ ఉంటుంది. కంటెంట్ బాగా లేకుంటే అసలు వాళ్లే ఈ సినిమా ఒప్పుకోరు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా సినిమా చూశామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఈ కథ నెరేట్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ టైమ్ అనుష్క గారి దగ్గర ఇబ్బంది అనిపించింది. అయితే ఆమె ఎంతో ఓపెన్ మైండ్ తో కథ విన్నారు. నేను మరోసారి కథ డీటెయిల్డ్ గా చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా ఆమె ఎంజాయ్ చేస్తూ నెరేషన్ విన్నారు.

- కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నారు కాబట్టే మాలాంటి డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ రాయగలుగుతున్నాం. ఇవాళ సొసైటీలో ముసుగులో గుద్దులాట లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. సందేశాలు నేరుగా చెప్పడం లేదు. కానీ కథలో ఆ మోరల్ ఉంటుంది. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్ లో చదివా. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. పైగా రెండు క్యారెక్టర్స్ ప్రధానంగా సాగే సినిమా కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనిపించింది.

- జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన ఉన్న ఒక అమ్మాయి పెళ్లి కాకుండా తల్లి అవడంలో సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఒక అబ్బాయి హెల్ప్ తీసుకుంటుంది. ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడ ముగిసింది. ఈ క్రమంలో ఆ జంటకు ఎదురైన పరిణామాలు ఏంటి. వాళ్లు మానసికంగా ఎలాంటి ఎమోషన్ కు గురయ్యారు అనేది ఈ సినిమా స్టోరీలైన్. ట్రైలర్ లోనే మేము ఈ పాయింట్ చెప్పి ఆడియెన్స్ ను ప్రిపేర్ చేశాం. భార్యా భర్తలైనా, లవర్స్ అయినా వారిమధ్య రొమాన్స్ ఒక్కటే కాదు ఎన్నో ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి. నా కథలో హీరో హీరోయిన్ల మధ్య కూడా అలాంటి రిలేషన్ చూస్తారు. ట్రైలర్ ను ఎలా ఎంజాయ్ చేశారో రేపు మూవీని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎక్కడా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉండవు. ఒక కంప్లీట్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మంచి ఎంటర్ టైనింగ్ ఎమోషనల్ మూవీ ఇది. నవీన్ పోలిశెట్టి, అనుష్క సిద్ధు, అన్విత క్యారెక్టర్స్ లో నాచురల్ గా నటించారు. రేపు చెన్నైలో కోలీవుడ్ డైరెక్టర్స్ కు స్పెషల్ షో వేస్తున్నాం. అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో మూవీని రిలీజ్ చేస్తున్నాం. మన నేటివిటి ఉన్న కథ ఇది అందుకే హిందీలో రిలీజ్ వద్దనుకున్నాం.

- చిరంజీవి గారు మా సినిమా చూసి మాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ లోనే సంతోషంలో ఊగిపోయాను. ఆయనను అభిమానించే వాళ్లం. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. నేను రైటర్ గా కథ రాసేప్పుడు ఈ పాయింట్స్ ను సినిమా చూసేవాళ్లు గుర్తుంచుకోవాలి అనుకుంటానో, అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చిరంజీవి గారు మాట్లాడటం సర్ ప్రైజ్ చేసింది. సురేఖ గారితో సహా పది మంది వరకు చిరంజీవి గారి ఫ్యామిలీ మా సినిమా చూశారు. చిరంజీవి గారు నన్ను, నవీన్ ను ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేశారు. గంట గంటన్నర వాళ్లింట్లో ఉన్నాం. చిరంజీవి గారే ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూయర్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టెన్షన్ గా ఉన్న మాకు ఆయన అప్రిషియేషన్ పెద్ద సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved