pizza

Everyone should support a good movie like 'Miss Shetty Mr. Polishetty' - Ace producer Dil Raju
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి మంచి సినిమాను ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి - ప్రముఖ నిర్మాత దిల్ రాజు

You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2023
Hyderabad

The movie 'Miss Shetty Mister Polishetty' starring Anushka shetty and Naveen Polishetty was recently released and became a blockbuster hit. As a clean family entertainer, this movie is receiving appreciation from the audience as well as star heroes, heroines and directors in the film industry. Famous producer Dil Raju recently congratulated the movie 'Miss Shetty Mr. Polishetty'. He said that everyone should support such good films. Producer Dil Raju praised the film in a press meet held at UV Creations office in Hyderabad.

Producer Dil Raju said that 'Miss Shetty Mr. Polishetty' has once again proved that the Telugu audience appreciates good movies. This movie was released along with Jaawan and stood tough even with the competition. I had a good feeling while watching the movie 'Miss Shetty Mr. Polishetty'. Naveen Polishetty keeps making us smile with his character. Also, Anushka made audience emotional with her acting. After the movie ended, I felt like I had seen a good movie. Immediately I called UV Vamsi and Naveen and said you made a good movie. Word of mouth is good. I asked myself to hold a press meet saying that this should be taken more to the people. My target is that we all should support good films when they come. I know team has worked hard for this film, faced with the pandemic. So you forget all the hard work with this success. Those who haven't seen the movie yet should watch immediately and people should recommend to watch it. Wherever you go, I will come to promote this movie. It is believed that this film will have a good theatrical run for four weeks. Today matinees are also full. Media friends also supports good movies. The US audience loved the film so much and that's why they gave one million collections till Sunday. This is Naveen's third one million dollar movie in his career. A new point is told to the audience through this movie. Naveen brought laughs from the start with his character.

Director Mahesh Babu.P. - Thanks to Dil Raju garu for supporting our movie. All our stars are giving their response after watching the movie. Word of mouth is good. Organically, our film is getting good talk and is running in theaters studiously. It all seems happy. We hope that 'Miss Shetty Mr. Polishetty' will be well received in the next three weeks as well. Media is also supporting our film from the beginning. I was happy to read SS Rajamouli's tweet. Mahesh garu, Ravi Teja garu, Samantha garu, director Vamsi Paidipally garu, all of them are happy and appreciated our film. Before the release of the movie, Chiranjeevi garu gave the judgment that it was a super hit. We thank him from our team.

UV Creations producer Pramod said - Dil Raju has been supporting us since the beginning. Thanks to him for guiding us. The movie 'Miss Shetty Mr. Polishetty' is getting a good response from the audience. Word of mouth is good. Naveen is coming from US very soon. We are planning for success celebrations and success tour on his arrival.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి మంచి సినిమాను ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి - ప్రముఖ నిర్మాత దిల్ రాజు

నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను అభినందించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇలాంటి మంచి చిత్రాలను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు సినిమాను ప్రశంసించారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ప్రూవ్ చేశారు. ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగింది. నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్ లో నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే అనుష్క యాక్టింగ్ తో ఎమోషనల్ చేస్తోంది. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించింది. వెంటనే యూవీ వంశీకి, నవీన్ కు ఫోన్ చేశాను. మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది. దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగాను. గుడ్ ఫిలింస్ వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్ చేయాలి అనేది నా టార్గెట్. మీరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుసు. పాండమిక్ ను ఎదుర్కొన్నారు. అలా మీరు పడిన కష్టమంతా ఈ సక్సెస్ తో మర్చిపోతున్నారు. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయండి. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే వాళ్లు చూసేలా ప్రమోట్ చేసుకోవాలి. మీరు ఎక్కడికి రమ్మన్నా ఈ సినిమా ప్రచారం కోసం వస్తాను. నాలుగు వారాల దాకా ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉంది. ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. మీడియా మిత్రులు కూడా మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. వారికి కూడా థాంక్స్. యూఎస్ ఆడియెన్స్ కు ఈ సినిమాలోని అడ్వాన్స్ థాట్ నచ్చుతుంది. అందుకే వాళ్లు సండే వరకే వన్ మిలియన్ కలెక్షన్స్ ఇచ్చేశారు. నవీన్ కెరీర్ లో ఇది మూడో వన్ మిలియన్ డాలర్ మూవీ. ఒక కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా చెప్పారు. నవీన్ తన క్యారెక్టర్ ద్వారా స్టార్టింగ్ నుంచి నవ్విస్తూ వచ్చాడు. లాస్ట్ 15 మినిట్స్ వరకు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫిల్మ్ పూర్తయ్యేసరికి ఒక గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగించారు. జవాన్ ను తట్టుకుంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నిలబడగలిగింది. స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది. అన్నారు.

దర్శకుడు మహేశ్ బాబు.పి. మాట్లాడుతూ - మా సినిమాను ఎంకరేజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థ్యాంక్స్. మన స్టార్స్ అంతా సినిమా చూసి తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. ఆర్గానిక్ గా మా సినిమా మంచి టాక్ తెచ్చుకుని స్టడీగా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇదంతా హ్యాపీగా అనిపిస్తోంది. నెక్ట్ త్రీ వీక్స్ కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. మీడియా కూడా మొదటి నుంచి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తోంది. రాజమౌళి గారి ట్వీట్ ను మల్లీ మల్లీ చదువుకుని సంతోషపడ్డా. మహేశ్ గారు, రవితేజ గారు, సమంత గారు, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి గారు వంటి వారంతా మా సినిమాను అప్రిషియేట్ చేయడం ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే చిరంజీవి గారు సూపర్ హిట్ అని జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయనకు మా టీమ్ నుంచి కృతజ్ఞతలు చెబుతున్నం. అన్నారు.

యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ ప్రమోద్ మాట్లాడుతూ - దిల్ రాజు అన్న మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆయనకు థాంక్స్ చెబుతున్నా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. నవీన్ యూఎస్ నుంచి వస్తున్నాడు. రాగానే సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved