It is well known that Megastar Chiranjeevi is teaming up with director Anil Ravipudi and Nayanthara for the upcoming film “Mana Shankara Vara Prasad Garu.” The shoot for this film is progressing at a brisk pace. The glimpse released on the occasion of Chiranjeevi’s birthday significantly raised expectations around the project.
The film’s team recently announced that a beautiful melody song featuring Chiranjeevi and Nayanthara is currently being shot. The song is being choreographed by Vijay Polaki Master, who previously worked on Pushpa 2 and Mirai. This marks his first collaboration with Chiranjeevi.
Given Chiranjeevi’s legendary dance legacy, fans are eager to see how Vijay Polaki Master will present him on screen. As part of this same schedule, another song and a few key scenes will also be filmed. The team further revealed that actor Venkatesh will join the shoot in October, and that will take the film’s shoot to nearly 99% completion.
Chiranjeevi has always had a unique flair for comedy, and Anil Ravipudi is known for his signature humor, never failing to entertain since his debut film. His movies enjoy massive popularity among family audiences. After delivering a blockbuster with “F2” & Sankranthiki Vastunnam, Anil Ravipudi is aiming to repeat that magic.
Following the disappointment of Bholaa Shankar, Chiranjeevi fans are eagerly waiting for a strong comeback at the box office - which is why all eyes are now on this film. As a Sankranti specialist, director Anil Ravipudi is bringing “Mana Shankara Vara Prasad Garu” to the big screens as a festive treat for Sankranti 2026.
మన ముందుకు ఓ సరికొత్త అప్డేట్ తో 'మన శంకరవరప్రసాద్ గారు'..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' రాబోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఓ గ్లింప్స్ తో ఈ సినిమాతో అంచనాలు అమాంతం పెరిపోయాయనే చెప్పుకోవచ్చు. చిరంజీవి మరియు నయనతారల మధ్య ఓ అద్భుతమైన మెలోడీ పాట చిత్రీకరణ జరుగుతున్నట్టు ఆ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. 'పుష్ప 2' మరియు 'మిరాయ్' సినిమాల కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ ఈ పాటకు దర్శకత్వం చేస్తున్నారు. చిరంజీవితో మొదటిసారిగా చేయబోతున్నారాయన.
చిరంజీవి డాన్స్ అంటేనే ఓ ప్రత్యేకం ఉంటుంది కాబట్టి తెరపై ఆయనను విజయ్ పోలాకి మాస్టర్ ఎలా చూపించబోతున్నారో అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇదే షెడ్యూల్ లో మరో పాట మరియు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరగబోతుంది. దీని తరువాత అక్టోబర్ లో జరిగే షూటింగ్ లో హీరో వెంకటేష్ చేరబోతున్నట్టు, దాంతో సుమారు 99% షూటింగ్ పూర్తవబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కామెడీ పండించడంలో చిరంజీవిదంటూ ఓ అద్భుతమైన శైలి ఉంటుంది. అనిల్ రావిపూడి కూడా తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకూ ఏ సినిమాలో కూడా తనమార్కు హాస్యాన్ని పండించడంలో విఫలం అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఆయన సినిమా అంటేనే కుటుంబ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'సంక్రాంతికి వస్తున్నాం' తో తన కెరీర్లోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'భోళా శంకర్' నిరుత్సాహపరచడంతో బాక్సాఫీస్ దగ్గర ఓ మంచి హిట్టు కోసం చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే పడింది. సంక్రాంతి సినిమాల స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాను 2026 సంక్రాంతికి కానుకగా మన ముందుకు తీసుకురాబోతున్నారు.
A beautiful night-effect melody is currently being filmed in Hyderabad on Megastar Chiranjeevi and Nayanthara. This marks the first collaboration between Chiranjeevi and choreographer Vijay Polaki Master, known for iconic numbers like Pushpa… pic.twitter.com/LMgFdGTlI6