pizza

Introducing Fighter Fame Rishabh Sawhney Looks Powerful As The Dreaded Abdali From The Much-Awaited Pan India Film Nagabandham
పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' నుంచి అబ్దాలిగా ఫైటర్ ఫేమ్ రిషబ్ సాహ్నీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

6 February 2026
Hyderabad

Abhishek Nama's much-awaited mythological action drama Nagabandham, starring Virat Karrna, is gearing up for a grand Pan-India release this summer. The film’s teaser is set to drop on the 15th of this month, marking the auspicious occasion of Maha Shivaratri. Ahead of it, the makers have unveiled the first look of another key character from the epic narrative.

Rishabh Sawhney, known for his commanding presence in Bollywood’s Fighter, has delivered a remarkable performance in Nagabandham, where he takes on the role of the infamous Afghan Sultan Abdali. Set in 1750, the film recounts Abdali's conquest in India, detailing his notorious acts of looting temples and his relentless pursuit of vast wealth.

The first-look poster is a striking visual set against a storm-lashed, snow-covered battlefield. Rishabh appears in mid-charge, brandishing a giant, blood-soaked battle axe with fierce resolve. Behind him surges a massive army, green war flags tearing through the icy winds, accompanied by archers, warriors, and towering war elephants- building an intense, high-voltage war canvas. Adding to the menace, a pack of wolves with glowing eyes closes in around him, amplifying the aura of danger, power, and impending doom.

In "Nagabandham," Abdali is depicted as a figure driven by ambition and cruelty, willing to sacrifice the lives of many, including Brahmins and children, in his quest to uncover the mythical Naga Bandham hidden in the Himalayas. The character remains a significant and dark part of history, known for his extreme ruthlessness.

Director Abhishek Nama praised Rishabh’s portrayal, noting that his performance is so convincing that it feels as if the historical figure of Abdali has come to life on screen. "Rishabh has transformed into this complex character, bringing depth and intensity to the role," he stated.

"I am honored to portray a character as challenging as Abdali," Rishabh shared. "I aimed to reflect the complexities and motives of this historical figure while remaining true to the story's essence."

The film features Nabha Natesh and Iswarya Menon as the female leads, with seasoned performers Jagapathi Babu, Jayaprakash, Murali Sharma, and BS Avinash anchoring the narrative with impactful roles.

Backed by the technical brilliance of Soundar Rajan S behind the camera, RC Pranav handling the editing, and Ashok Kumar shaping the grand production design, Nagabandham promises an arresting visual experience on the big screen.

Bankrolled by Kishore Annapureddy and Nishitha Nagireddy, the film is now entering the final leg of its production journey, steadily moving toward completion.

Cast: Virat Karrna, Nabha Natesh, Iswarya Menon, Rishabh Sawhney, Jagapathi Bab, Jayaprakash, Murali Sharma, B.S. Avinash, and others

Technical Crew:
Story, Screenplay & Director: Abhishek Nama
Producers: Kishore Annapureddy, Nishitha Nagireddy
Director of photography: Soundar Rajan S
Music: Abhe, Junaid Kumar
Production Designer: Ashok Kumar
Editor: RC Panav
CEO: Vasu Potini

పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' నుంచి అబ్దాలిగా ఫైటర్ ఫేమ్ రిషబ్ సాహ్నీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. దీనికి ముందు, ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు

బాలీవుడ్ 'ఫైటర్'లో తన అద్భుతమైన ప్రజెన్స్ తో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ నాగబంధంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750లో బ్యాక్ డ్రాప్ లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా వుంది. మంచుతో కప్పబడిన యుద్ధభూమిలో తుఫాన్ వాతావరణం మధ్య, భారీ రక్తంతో మచ్చలపడ్డ గొడ్డలిని చేతబట్టి యుద్ధానికి దూసుకెళ్తున్న అబ్దాలీగా రిషభ్ కనిపిస్తారు. అతని వెనుక భారీ సైన్యం, గాలికి చీలిపోతున్న ఆకుపచ్చ యుద్ధ జెండాలు, విలువిద్యకులు, యోధులు, యుద్ధ ఏనుగులు మొత్తంగా ఒక హై-వోల్టేజ్ వార్ కాన్వాస్‌ను సృష్టించాయి. చుట్టూ మెరుస్తున్న కళ్లతో ఉన్న తోడేళ్ల గుంపు అతని చుట్టూ చేరడం పాత్రలోని క్రూరత్వాన్ని మరింత పెంచుతోంది.

‘నాగబంధం’లో అబ్దాలీని ఆశ, క్రూరత్వంతో నడిచే వ్యక్తిగా కనిపించనున్నారు. హిమాలయాల్లో దాగి ఉన్న మిథికల్ నాగబంధాన్ని స్వాధీనం చేసుకోవడానికి, బ్రాహ్మణులు, పిల్లలు సహా ఎందరి ప్రాణాలనైనా బలి చేయడానికి వెనుకాడని వ్యక్తిగా ఈ పాత్ర ఉండబోతోంది. చరిత్రలో అతడు అత్యంత నిర్దయుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కావడం విశేషం.

రిషభ్ నటనపై దర్శకుడు అభిషేక్ నామా ప్రశంసలు కురిపించారు. “రిషభ్ చేసిన నటన చూస్తే, అబ్దాలీనే తెరపై జీవించినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లిష్టమైన పాత్రలో అతడు అద్భుతంగా నటించారు”

“అబ్దాలీ లాంటి సవాలుతో కూడిన పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పాత్ర, అతని లక్ష్యాలను కథకు న్యాయం చేస్తూ చూపించేందుకు ప్రయత్నించాను” అని రిషభ్ అన్నారు

నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న 'నాగబంధం' చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది.

నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
సీఈఓ: వాసు పోతిని

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved