pizza

Naga Chaitanya to power Hyderabad Black Birds at Indian Racing League 2024
ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య‌

You are at idlebrain.com > news today >

22 August 2024
Hyderabad

Renowned actor and motorsport enthusiast Akkineni Naga Chaitanya is set to ignite the Indian Racing Festival (IRF) as he takes the helm of the Hyderabad Blackbirds as team owner for the 2024 season of the Indian Racing League (IRL). A passionate follower of Formula 1 and a dedicated collector of supercars and motorcycles, Chaitanya brings a unique blend of motorsport fervor and star power to the league. His deep-rooted love for racing, coupled with his influence as a youth icon and his stature in the entertainment industry, is expected to significantly boost the festival's visibility and attract a broader audience to the thrilling event.

The Hyderabad Blackbirds, one of six city-based teams competing in the Indian Racing League, are poised to make a significant impact under Chaitanya's leadership. The league, the world's first gender-neutral, franchise-based racing competition featuring talented drivers from both India and abroad, will benefit from Chaitanya's expertise and passion. His involvement will further elevate the league's allure as it gears up for its most ambitious season yet. He joins a roster of celebrity team owners, including fellow actors Arjun Kapoor and John Abraham, as well as cricket legend Sourav Ganguly.

The Indian Racing Festival, organized by RPPL, features the FMSCI-approved Indian Racing League and the FEI-certified Formula 4 Indian Championship (F4IC), designed to nurture young talent and provide them with a platform to excel. The festival will be broadcast live on Star Sports and FanCode, aiming to captivate India's growing motorsports fanbase.

The Indian Racing League 2024 kicks off on August 24 at the Madras International Circuit, followed by India's first-ever night street circuit race at the Chennai Formula Racing Circuit a week later. Hyderabad Blackbirds will compete against teams from Bengaluru, Chennai, Delhi, Goa, and Kolkata in the season opener. As Chaitanya takes the reins, the Hyderabad Blackbirds are poised to make a strong statement and compete for the coveted Indian Racing League championship title. On the professional front Naga Chaitanya is set to entertain movie lovers with his upcoming film titled Thandel directed by Chandoo Mondeti. The film features Sai Pallavi as the female lead.

ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య‌

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వ‌న్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు. అలాగే ఆయ‌న ఇప్పుడు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేక‌రిస్తుంటారు. అలాంటి ఇష్ట‌మైన రంగంలోకి చైత‌న్య‌ అడుగు పెట్టారు . ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ (ఐఆర్ఎఫ్‌)లో పోటీ ప‌డే హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైత‌న్య సొంతం చేసుకున్నారు. దీని వ‌ల్ల ఆయ‌న ఐఆర్ఎఫ్‌ నిర్వ‌హించే ఫార్ములా 4లో భాగ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగ‌స్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ సంద‌ర్బంగా అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వ‌న్‌ను ఎంత‌గానో ప్రేమిస్తాను. ఫార్ములా వ‌న్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ న‌డ‌ప‌టంలోని థ్రిల్ న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ నాకు కాంపిటేష‌న్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాను. నా ఫ్యాష‌న్‌ను చూపించుకునే చ‌క్క‌టి వేదిక ఇద‌ని నేను భావిస్తున్నాను. హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌ను సొంతం చేసుకోవ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియ‌న్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బ‌యట‌కు వ‌స్తుంది’’ అని అన్నారు.

ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఒక‌టి. ఇందులో నాగ‌చైత‌న్య భాగం కావ‌టం అనేది స్పీడ్ గేమ్‌కి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఇంకా ఇందులో అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ భాగమ‌య్యారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved