pizza

Natural Star Nani completes 17 years in TFI
నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ది ప్యారడైజ్' నుంచి నాని బీస్ట్ మోడ్ లో అదిరిపోయే స్టిల్ రిలీజ్- ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్

You are at idlebrain.com > news today >

5 September 2025
Hyderabad

నేచురల్ స్టార్ నాని అద్భుతమైన సినీప్రయాణం 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంగా తన మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ 'ది ప్యారడైజ్' నుంచి పవర్ ఫుల్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ స్టిల్ లో నాని కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ, ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఫెరోషియస్ అవాతర్ లో ఆకట్టుకున్నారు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్యారడైజ్ లో నాని నెవర్ బిఫోర్ జడల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్ లో ఇంటెన్స్ గా వర్క్ అవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలకు నేషనల్ వైడ్ గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగు హైదరాబాదులో వేసిన మ్యాసీవ్ సెట్స్ లో జరుగుతోంది.

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved