pizza

Nandamuri Balakrishna, Gopichand Malineni, Venkata Satish Kilaru, Vriddhi Cinemas’ Epic Actioner #NBK111 Birthday Special Explosive Reveal On June 10
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ఎపిక్ యాక్షనర్ #NBK111- బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ ఎక్స్‌ప్లోసివ్ జూన్ 10న రిలీజ్

You are at idlebrain.com > news today >

02 June 2026
Hyderabad

Following the phenomenal success of their previous collaboration, Veera Simha Reddy, God Of Masses Nandamuri Balakrishna and successful director Gopichand Malineni are once again gearing up to deliver a larger-than-life entertainer packed with intense action, powerful emotions, and mass appeal. Produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, the project #NBK111 is being mounted on a grand scale.

Meanwhile, the makers have announced that they will unveil a major update on the special occasion of Balakrishna’s birthday on June 10th. The announcement poster sets a fierce and rebellious tone with a dark backdrop dominated by massive NBK lettering wrapped in heavy chains, symbolizing strength and power. The tagline, "No More Vintage, Only New Age," signals a bold transformation, while the "Watch Out For" notice builds intrigue. The June 10 date, accompanied by bullet imagery, hints at an explosive reveal that promises a fresh and powerful avatar of NBK.

The shoot of NBK111 is currently underway in Mumbai, with the lead cast participating, and the team is canning some crucial sequences.

Recently, on the occasion of Manoj Manchu’s birthday, the makers unveiled his inclusion in the film, revealing that he will portray a fiercely impactful character that plays a pivotal role in the story.

Known for crafting powerful mass entertainers, Gopichand Malineni is once again assembling a film loaded with high-voltage moments and compelling drama to balance the narrative.

Additional details regarding the remaining cast and crew will be announced later.

Cast: Nandamuri Balakrishna, Manoj Manchu

Technical Crew:
Writer, Director: Gopichand Malineni
Producer: Venkata Satish Kilaru
Banner: Vriddhi Cinemas

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ఎపిక్ యాక్షనర్ #NBK111- బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ ఎక్స్‌ప్లోసివ్ జూన్ 10న రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #NBK111 ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ ఎన్‌బీకే అక్షరాలు ఇనుప గొలుసులతో బంధించినట్లుగా కనిపిస్తూ, బాలయ్య పవర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. "No More Vintage, Only New Age" అనే ట్యాగ్‌లైన్ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంకేతాలు ఇస్తోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న బుల్లెట్ విజువల్స్, జూన్ 10 తేదీతో కలిపి అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇటీవల మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు ప్రకటించారు. కథలో కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో మనోజ్ కనిపించనున్నారు.

మాస్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన గోపీచంద్ మలినేని, మరోసారి హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో కూడిన కథను సిద్ధం చేశారు.

మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved