pizza

Nenu Ready song released
'నేను రెడీ' మంచి విజయాన్ని సాధించి హవీష్ పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను: మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వి.వి. వినాయక్

You are at idlebrain.com > news today >

31 July 2026
Hyderabad

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తొలి పాట 'కొంచెం కొంచెం' కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హవీష్ మాట్లాడుతూ: "అందరికీ హాయ్. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ ఈవెంట్‌కు వచ్చిన డైరెక్టర్ వి.వి. వినాయక్ గారికి ధన్యవాదాలు. ఇందులో మా ఫస్ట్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అలాగే ఈ పాట కూడా మీకు నచ్చిందని భావిస్తున్నాను. మిక్కీ గారు చాలా మంచి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమా చాలా బాగుంటుంది. మా ప్రొడ్యూసర్స్ ఇప్పటికే సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారు. ట్రైలర్‌లో ఏముంటుందో, దానికి వంద రెట్లు సినిమాలో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. చాలా మంచి కథతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు సినిమా చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది."

దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ: ఇక్కడి ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీకి వస్తున్నప్పుడు నాకు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన అనుభూతి కలిగింది. సత్యనారాయణ గారిని చూస్తుంటే రామోజీరావు గారిని చూసినట్లే అనిపించింది. ఈ యూనివర్సిటీ ఎంత అద్భుతంగా ఉందో, సినిమా కూడా అంతే బాగుంటుందని నమ్ముతున్నాను. ఆయన తన కుమారుడి కోసం పెట్టుకున్న కలలన్నీ ఈ సినిమాతో నెరవేరాలని కోరుకుంటున్నాను. హవీష్ చాలా పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. త్రినాథరావు నక్కిన తీసిన 'నేను లోకల్', 'సినిమా చూపిస్త మావ' సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆ సినిమాల సరసన ఈ సినిమా కూడా చేరాలని కోరుకుంటున్నాను. టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ: "హవీష్ గారికి చాలా గ్యాప్ తర్వాత ఒక కథ నచ్చింది. అదే 'నేను రెడీ'. ఇది ఆయన రీఎంట్రీ మూవీలా, కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాలో యష్ మాస్టర్‌తో ఇంట్రడక్షన్ సాంగ్ చేయించాం. 'ధమాకా'లో రవితేజ గారి పాట ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ పాట కూడా అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు సినిమాకు కావాల్సిన ప్రతిదీ అద్భుతంగా సమకూర్చారు. అలాంటి నిర్మాతలతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది."

నిర్మాత నిఖిల కోనేరు మాట్లాడుతూ: అందరికీ థ్యాంక్యూ. వి.వి. వినాయక్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా తొలి ప్రొడక్షన్‌కు త్రినాథరావు నక్కిన గారు దర్శకత్వం వహించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడూ సూపర్ హిట్ సినిమాలే చేస్తారు. ఈ సినిమా వాటన్నింటికంటే పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. హవీష్‌ను ఆయన చాలా అద్భుతంగా చూపించారు. సినిమా చూస్తున్నప్పుడు హవీష్ పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. కావ్యా థాపర్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆమె చాలా నేచురల్ యాక్టర్. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో పాటలు హైలెట్‌గా నిలుస్తాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది వంద శాతం సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను.

కోనేరు కాంచన మాట్లాడుతూ: మీరు అందరూ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫుల్ కామెడీ మూవీ. హవీష్ తొలి 'సినిమా నువ్విలా' ను ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. ఆ సినిమా 150 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా అంతే పెద్ద సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా అద్భుతంగా నటించారు. తప్పకుండా మీరందరూ ఈ సినిమాను చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. తప్పకుండా మీరందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరినీ కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

నటీనటులు: హవీష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ (స్పెషల్ సాంగ్), బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలం, సత్యనారాయణ, రోహన్ రాయ్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved