pizza

Sakshi Vaidya about Nari Nari Naduma Murari
'నారి నారి నడుమ మురారి'లో పర్శనల్ గా రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. ఇది ఫుల్ ఫన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది: హీరోయిన్ సాక్షి వైద్య

You are at idlebrain.com > news today >

7 January 2026
Hyderabad

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
-ఏజెంట్ సినిమా జరుగుతున్న సమయంలోనే నిర్మాత అనిల్ గారు నాతో మరో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఈ సినిమాలో నిత్య క్యారెక్టర్ కోసం అనిల్ గారు, డైరెక్టర్ గారు నన్ను ఫైనల్ చేశారు.

-నిత్య క్యారెక్టర్, ఈ కథ చాలా నచ్చాయి. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్గా చాలా రిలేట్ అవుతుంది. తను ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయి. నిజాయితీగా వుంటుంది.

శర్వా గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
శర్వా గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్.

-అందరూ కూడా చాలా మంచి కోస్టార్స్. షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్ ని చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆయన కంప్లీట్ గా ఒక డిఫరెంట్ పర్సన్ లా కనిపించారు. అలాగే ఇందులో నరేష్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అందరితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

తెలుగులో నటించేటప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా?
తెలుగులో మాట్లాడటం ఒక బ్యారియర్. కాకపోతే డైలాగ్ విషయానికి వచ్చేటప్పటికి ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది. డైరెక్టర్ సాయి గారు టైమింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. తగినంత సమయాన్ని ఇచ్చారు చాలా సపోర్ట్ చేశారు.

సాయిగారి స్ట్రెంత్ కామెడీ. షూటింగ్ సమయంలో కూడా ఆయన చాలా సరదాగా ఉంటారు. నవ్వుతూనే ఉంటారు. అదే సినిమాలో కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఈ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
-ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఉంది. ఈ సినిమా కోసం దాదాపు ఒక నెల రోజులు పాటు వర్క్ షాప్ చేశాం. క్యారెక్టర్ గురించి ప్రతిదీ అర్థం చేసుకున్నాను.

ఈ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
-ఈ కథ వినగానే చాలా మంచి కథ చేసే అవకాశం వచ్చిందనిపించింది. కచ్చితంగా ఈ సినిమా చేయాలని వెంటనే సైన్ చేశాను. ఈ సినిమాకి స్టోరీ ఈజ్ కింగ్.

మ్యూజిక్ గురించి ?
ఇందులో మ్యూజిక్ రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే పాటలు ఇవి. ఖచ్చితంగా థియేటర్స్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

సంయుక్త గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?

చాలా మంచి కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. తను చాలా స్వీట్ పర్సన్. తను చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేసింది.

సినిమా షూటింగు చాలా ఫన్ ఫుల్ గా జరిగింది. కేరళలో షూట్ చేయడం ఫన్ ఎక్స్ పీరియన్స్. సినిమా షూటింగు చాలా ఫన్ గా జరిగింది. అదే ఫన్ స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయింది.

మీరు డాక్టర్ కూడా కదా.. ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటారా?
-లేదండి. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ ప్రాక్టీస్ చేయడం లేదు. ఖాళీ సమయంలో బాగా చదువుతాను. నిద్రపోతాను (నవ్వుతూ)

కొత్త ప్రాజెక్ట్స్ గురించి
-కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వాటి గురించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved