Top Technicians Roped In For YVS Chowdary’s Film With Nandamuri Taraka Ramarao To Be Produced By Yalamanchili Geetha On New Talent Roars @ Banner
యంగ్ చాప్ నందమూరి తారక రామారావు గారితో చేస్తున్న సినిమాకి దిగ్గజ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించడం మా అదృష్టం.
Nandamuri Taraka Ramarao, the great-grandson of the iconic Shri NTR, grandson of the esteemed Hari Krishna, and son of the late Shri Janaki Ram, is set to make a significant splash in Telugu cinema. This marks a new chapter in the storied Nandamuri family legacy. The film, directed by the renowned YVS Chowdary, will be produced by Yalamanchili Geetha under the banner "New Talent Roars @." Ramesh Attili will serve as the Executive Producer.
YVS Chowdary has revealed exciting new details about the upcoming project, announcing an impressive lineup of talent. Enchanting Kuchipudi dancer and Telugu girl, Veenah Rao, is roped in as the lead heroine opposite Nandamuri Taraka Rama Rao.
The film will feature music composed by the Oscar-winning MM Keeravani and lyrics crafted by the celebrated Oscar-winning lyricist Chandrabose. Additionally, Sai Madhav Burra, renowned for his work on numerous high-profile projects, will pen the dialogues for this highly anticipated film.
To prepare for his debut, Nandamuri Taraka Ramarao has undergone rigorous training to master the skills needed for a leading role. YVS Chowdary, known for introducing numerous stars over his distinguished career, is taking on the responsibility of launching Nandamuri Taraka Ramarao with this intriguing project.
The story and screenplay, crafted by YVS Chowdary, are designed to highlight Nandamuri Taraka Ramarao's diverse abilities, promising a cinematic experience that will captivate Telugu film fans. More details about the film’s genre, and other key elements will be unveiled in the near future.
Cast: Nandamuri Taraka Ramarao, Veenah Rao
Technical Crew:
Story, Screenplay & Direction: YVS Chowdary
Banner: New Talent Roars @
Producer: Yalamanchili Geetha
Music: MM Keeravani
Lyrics: Chandrabose
Dialogues: Sai Madhav Burra
Executive Producer: Ramesh Attili
తెలుగమ్మాయి అందాలరాశి వీణ రావ్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం: ప్రెస్ మీట్ లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి
తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని "న్యూ టాలెంట్ రోర్స్ @" బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి సంబధించిన క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించబోయే హీరోయిన్ పేరుని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. ఈ రోజు చాలా ఆనందంగా వుంది. ఈ రోజు నాగ పంచమి. మొదటి శ్రావణ శుక్రవార శుభ సందర్భం. ఈ సినిమాకి సంబధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజున జరుపుకున్నాం. ఈ రోజు కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్ డే సందర్భంగా జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. మహేష్ బాబు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపటినుంచి ఇష్టం. మహేష్ గారు నా మొదటి సినిమా చూడకుండానే 'యువరాజు' సినిమాకి అవకాశం ఇచ్చారు. అది ఆయన నామీద ఉంచిన నమ్మకం. ఆ నమ్మకం నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది. రాజకుమారుడు చేస్తున్న సమయంలోనే నా నిర్మాణ సంస్థ బొమ్మరిల్లుని స్థాపించాను. లాహిరి లాహిరిలో సినిమా విజయోత్సవ వేడుకకు ఆయనే స్వచ్చందంగా వచ్చి వెన్నంటి వున్నారు. ఆ సినిమా వందరోజుల వేడుక మహేష్ బాబు గారి బర్త్ డే రోజు ఆగస్ట్ 9నే గ్రాండ్ గా చేశాను. అనుకోకుండా ఇదే రోజున ఈ వేడుక జరుకుపోవడం చాలా ఏమోషనల్ గా వుంది.
ఈ వేడుకుకు చాలా మెరపులు వున్నాయి. ఈ కథని నేను రాసుకున్నాను. దీనికి అర్ధవంతమైన మాటలు రాయడానికి సమర్దవంతమైన మాటల రచయిత కావాలి. కంచె సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రాతో పని చేయాలని అనుకున్నాను. ఆయన అన్ని సినిమాలకు న్యాయం చేశారు. ప్రతి సినిమాకి గొప్పగా ఎదిగారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణంగా భావిస్తుంటాను. కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారు. ఒక సంగీత దర్శకుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలో అంత ప్రావీణ్యం వున్న సంగీత దర్శకుడాయన. ఆయనతో నా మొదటి సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఆయన నాకు మర్చిపోలేని పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేసిన చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన కథ విని చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఒక పెద్దన్నయ్యలా సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ గారు ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఆయన సాహిత్యం మహా అద్భుతంగా వుండబోతోంది. నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్ గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పరిచయం చేయాలని భావించాం. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి తారసపడింది. తను అద్భుతంగా వుంది. అందమైన తెలుగు భారతీయ అమ్మాయిలా అనిపించింది. గొప్ప రూప సౌందర్యం వుంది. ఆమె పేరు వీణ రావు. మన తెలుగమ్మాయి. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెదరో వుంటారు. అలాగే కొత్త ట్యాలెంట్ ని కూడా ప్రోత్సహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వివరాలు చెబుతాం. మేము చెప్పిన ప్రమాణాలు అనుగుణంగా మీ ట్యాలెంట్స్ ని మాకు పంపించవచ్చు.దాని నుంచి కొంతమందిని ఎంపిక చేస్తాం' అన్నారు.
డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ లో వైవిఎస్ చౌదరి గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు లాంటి మహామహులతోకలిసి పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత యలమంచిలి గీత గారికి ధన్యవాదాలు. కథ విన్నాను, చాలా మంచి కథ. బ్యానర్ లానే ప్రతిభించే ప్రతిభ గర్జిస్తే ఎలా వుంటుందో సినిమా కూడా అలానే వుంటుంది. మంచి డైలాగ్స్ రాసే అవకాశం వున్న కథ. ప్రాణం పెట్టి ఈ సినిమాకి పని చేస్తాను' అన్నారు.
నటీనటులు: నందమూరి తారక రామారావు, వీణ రావ్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి
బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @
నిర్మాత: యలమంచిలి గీత
సంగీతం: ఎంఎం కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి